SSMB 29: రాజమౌళి (Rajamouli) , మహేష్ బాబు (Maheshbabu) కాంబినేషన్లో వచ్చే సినిమా గురించి ఎప్పుడెప్పుడు అప్డేట్ వస్తుందా..? ఎప్పుడెప్పుడు చూద్దామా అని లక్షలాదిమంది అభిమానులు కళ్ళల్లో ఒత్తులు వేసుకొని ఎదురు చూస్తున్నారు. అలా ఎదురుచూస్తున్న సమయంలోనే నవంబర్ 15న రామోజీ ఫిలింసిటీలో దాదాపు లక్ష మంది మధ్యలో ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ గ్లింప్స్ తో పాటు మహేష్ బాబు ఫస్ట్ లుక్ కూడా రివీల్ చేస్తున్నట్టు రాజమౌళి క్లారిటీ ఇచ్చేశారు. ఇప్పటికే ఈ సినిమా నుండి అప్డేట్ రావడానికి చాలా టైం పట్టడంతో అభిమానులు నిరాశ పడుతున్నారనే కారణంతో రాజమౌళి “గ్లోబ్ ట్రోటర్” పేరుతో ఈవెంట్ ని గ్రాండ్ గా చేస్తున్నారు. అయితే నవంబర్ 15 రోజు కంటే ముందే అంటే నవంబర్ 7నే ఈ సినిమా నుండి కీ రోల్ గా నటిస్తున్న పృథ్వీరాజ్ సుకుమారన్ ఫస్ట్ లుక్ ని రివీల్ చేశారు. కుంభ అనే పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నట్టు క్లారిటీ ఇచ్చారు.
అయితే పృథ్వీరాజ్ సుకుమారన్ ని చూస్తూ ఉంటే ఆయన నడవలేని పరిస్థితిలో వీల్ చైర్ కే పరిమితమైనట్టు చూపించారు. కానీ ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ పై చాలానే ట్రోల్స్ వస్తున్నాయి. ఎందుకంటే గతంలో సూర్య నటించిన 24 మూవీలో కూడా ఆత్రేయ పాత్రలో నటించిన సూర్య ఇలాగే వీల్ చైర్ లో కూర్చుని ఉంటారు. దాంతో 24 మూవీ నుండి రాజమౌళి కాపీ కొట్టారంటూ ట్రోల్స్ వచ్చాయి.
ALSO READ:Mammootty: అరుదైన గౌరవం దక్కించుకున్న మమ్ముట్టి మూవీ!
ఇదంతా పక్కన పెడితే.. తాజాగా ఎస్ఎస్ఎంబి 29 నుండి విడుదలైన కుంభ పాత్ర గురించి పురాణాల్లో ఓ స్టోరీ ఉంది అంటూ ఒక వీడియో వైరల్ అవుతోంది. కుంభ పేరు వెనుక ఉన్న హిస్టరీ ఏంటంటే.. పృథ్వీరాజ్ సుకుమారన్ ప్లే చేస్తున్న కుంభ పేరులో చాలా అర్థం ఉంది. ఈ కుంభ అనే పేరుకి అమరుడు అని అర్థం. అలా కుంభ అనే పదానికి మన పురాణాల్లో ఓ పెద్ద కథే ఉంది. అదేంటంటే.. దేవతలు, రాక్షసులు అమృతం కోసం క్షీరసాగరమదనం చేసే సమయంలో అమృతం వస్తుంది. అయితే ఈ అమృతం ఒక కుండలో ఉంటుంది. ఆ కుండనే కుంభ అంటారు. అయితే ఆ కుండలోని అమృతంలో కొన్ని చుక్కలు ఉజ్జయిని,నాసిక్, ప్రయాగ్ రాజ్ పై పడతాయి. అందుకే అక్కడ కుంభమేళా అనే మహా యాగాన్ని జరుపుకుంటారు. ఇక ఈ ఏడాదిలో మహాకుంభమేళా ప్రయాగ్ రాజ్ లో జరిగిన సంగతి మనకు తెలిసిందే.
మరొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే..వారణాసికి ప్రయాగ్ రాజ్ చాలా దగ్గరగా ఉంటుంది. అందుకోసమే కొన్ని ముఖ్యమైన సన్నివేశాల కోసం ఎస్ఎస్ఎంబి 29 టీం వారణాసి సెట్ కూడా వేశారు. ఇదంతా చూస్తూ ఉంటే ఎస్ఎస్ఎంబి 29లో పురాణా ఇతిహాసాల గురించి ఉంటుందని అనిపిస్తోంది.