BigTV English

CM Jagan in London: లండన్‌లో వైసీపీ నేతలు.. కాకపోతే.. మరో రెండురోజుల్లో..

CM Jagan in London: లండన్‌లో వైసీపీ నేతలు.. కాకపోతే.. మరో రెండురోజుల్లో..

CM Jagan meet Key Leaders at London: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ఫలితాల తర్వాత ఏం జరగబోతోంది? అధికారంలోకి ఏ పార్టీ రాబోతోంది? ఈసారి వైసీపీ రాకపోతే పరిస్థితి ఏంటి? అన్నదే ఇప్పుడు నేతల్లో చర్చ జరుగుతోంది. కేంద్రంలో ఎన్డీయే వస్తుందని కొందరంటే, మరికొందరు మాత్రం హంగ్ వస్తుందని చెబుతున్నారు. ఒకవేళ ఎన్డీయే గనుక వస్తే వైసీపీ పరిస్థితి ఎలా ఉండబోతోంది? ఫ్యాన్ పార్టీకి ఇబ్బందులు తప్పవా? ఇవే ప్రశ్నలు రైజ్ అవుతున్నాయి.


ఎన్నికల పోలింగ్ ముగియగానే లండన్‌కు వెళ్లారు సీఎం జగన్. పనిలో పనిగా లండన్‌తోపాటు పారిస్ కూడా వెళ్లనున్నారట. ఈసారి ఎన్ఆర్ఐ విభాగంతో సమావేశాలకు జగన్ దూరంగా ఉండబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎందుకన్నది మాత్రం నేతలకు అంతుబట్టడం లేదు. జగన్ తర్వాత అరడజను మంది వైసీపీ నేతలు లండన్‌కు వెళ్లినట్టు వార్తలు వస్తున్నాయి. అక్కడవారితో భేటీ అయ్యేందుకు జగన్ అంగీకరించలేదని తెలుస్తోంది.

కొన్ని ఆన్‌లైన్ పోర్టల్స్ అయితే ఏఏజీ పొన్నవోలు ప్రస్తుతం లండన్‌లో ఉన్నారని రాసుకొచ్చాయి. అంతే కాదు జగన్‌తో తనకు సమావేశం ఏర్పాటు చేయమని ఆయన కంటతడి పెట్టినట్టు ప్రస్తావించాయి. అందరు ఒకేతాటి మీదకు వచ్చి జగన్‌ను కాపాడుకోవాలని ఆయన అన్నట్లు రాశాయి. ఈ విషయం తెలియగానే వైసీపీ నేతల్లో ఆందోళన మొదలైంది. మొన్నటివరకు వైసీపీ గెలుస్తుందని ధీమా చెప్పిన నేతలు, ఇప్పుడు కంగారుపడుతున్నారట.


Also Read: అశోక్ గజపతిరాజుతో కొణతాల భేటీ, కూటమిదే విజయం

ఇంతవరకు ఓకే, సీఎం జగన్ లండన్‌లో ల్యాండ్ అయిన తర్వాత ఆయనకు సంబంధించిన ఎలాంటి సమాచారం రాలేదు. ఎక్కడ విజిట్ చేస్తున్నారనేది కనీసం ఫోటోలు బయటకు రాలేదు. ఇంతకీ వెనకాల ఏం జరుగుతుందనేది అనేది ప్రశ్న. మరో రెండురోజులు ఆగితే సీఎం జగన్ తిరిగి విజయవాడకు రాబోతున్నారు. అప్పుడైనా ఆయా వార్తలకు ఫుల్‌స్టాప్ పడతాయా? అన్నది చూడాలి.

Tags

Related News

Araku Coffee: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అరకులో ఇకపై అందరూ లక్షాధికారులే!

Pawan Kalyan project: పవన్ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం.. కోట్లల్లో ఖర్చు.. ఎందుకంటే?

Railways: రైల్వే ప్రాజెక్టులపై దృష్టి.. అవన్నీ జరిగితే ఏపీకి తిరుగుండదు

Pulivendula Politics: పులివెందుల రాజకీయాలు.. 30 ఏళ్లలో రెండోసారి, ఓటర్లు ఫుల్‌ఖుషీ

Pawan Kalyan: రూటు మార్చిన పవన్.. నిన్న మామిడి.. నేడు చీరలు, రేపు?

AP Free Bus Scheme: ఏపీలో ఫ్రీ బస్ స్కీమ్.. ఆ బస్సు లెక్కితే ఉచిత ప్రయాణం ఉండదు

Big Stories

×