E-Paper
Advertisement

Konatala – Ashokgajapathiraju Meeting: అశోక్ గజపతిరాజుతో కొణతాల భేటీ.. కూటమిదే విజయం అంటూ..!

Konatala – Ashokgajapathiraju Meeting: అశోక్ గజపతిరాజుతో కొణతాల భేటీ.. కూటమిదే విజయం అంటూ..!
Advertisement

Konatala Says Kutami Will Form the Government in AP after meeting with Ashokgajapathiraju: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు ముగియడంతో నేతలు రిలాక్స్ అవుతున్నా రు. కొందరు లాంగ్ టూర్లకు వెళ్తుండగా, మరికొందరు దేవాలయాలు సందర్శిస్తున్నారు. ఈ జాబితాలోకి అనకాపల్లి జనసేన అభ్యర్థి కొణతాల రామకృష్ణ ఒకరు.

తాజాగా విజయనగరం వచ్చిన కొణతాల పైడితల్లి అమ్మవారిని దర్శించుకున్నారు. అక్కడి నుంచి నేరుగా టీడీపీ సీనియర్ నేత అశోక్‌గజపతిరాజుతో సమావేశమయ్యారు. ఇరువురు మధ్య దాదాపు గంటకుపైగా వివిధ అంశాలపై చర్చించుకున్నారు. ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలు, ఎన్నికల ఫలితాల పరిస్థితి వంటి అంశాలపై డీప్‌గా చర్చించుకున్నారు. భేటీ తర్వాత మీడియాతో మాట్లాడారు కొణతాల రామకృష్ణ.

Advertisement

ఈసారి ఎన్నికల్లో కూటమి విజయం సాధించడం ఖాయమన్నారు కొణతాల. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏ రకమైన పరిపాలన ఉండాలని కోరుకున్నారో అదే జరుగుతుందన్నారు. త్వరలో ముఖ్యమంత్రి గా చంద్రబాబు బాధ్యతలు చేపడతారన్నారు. వలసలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఉత్తరాంధ్ర కూడా ఒకటన్నారు. విద్య, ఆదాయ వనరులు తక్కువగా ఉన్న ప్రాంతమని, ఇక్కడ అభివృద్ది చేసేందుకు తమవంతు కృషి చేస్తామన్నారు. జగన్ ప్రభుత్వంలో ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్టులను నిర్వీర్యం చేశారన్నారు.

Also Read: Chandrababu return from foreign tour: విదేశాల నుంచి వచ్చిన చంద్రబాబు, రేపో మాపో విజయవాడకు..

Advertisement

20 ఏళ్ల కిందటి ఒకసారి వెనక్కి వెళ్తే.. కొణతాల కాంగ్రెస్‌లో ఉండగా, అశోక్ గజపతిరాజు టీడీపీలో ఉన్నారు. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కొణతాల జనసేన వైపు వచ్చారు. ఈ క్రమంలో ఆయన అనకాపల్లి నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేశారు. ఇటీవల కాలంలో టీడీపీ సీనియర్ నేతలను కలుస్తూ వస్తున్నారట కొణతాల రామకృష్ణ. మరి దీనివెనుక మర్మమేంటని చర్చించుకోవడం ఫ్యాన్ పార్టీ నేతల వంతైంది.

Tags

Related News

రూ.1000 కోట్ల ఆస్తి.. వేలాది కుటుంబాల ఇళ్ల కల నెరవేర్చిన మంత్రి లోకేశ్

ఆంధ్రప్రదేశ్‌కి దక్కిన అరుదైన గౌరవం.. బెస్ట్ వెడ్డింగ్ డెస్టినేషన్‌గా ఏపీకి అంతర్జాతీయ అవార్డు

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

ఆక్వా కల్చర్‌ను ఆదుకోండి.. ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు!

Big Stories

Advertisement
×