BigTV English

Crime: పెళ్లైన మహిళతో ఎఫైర్.. అడ్డొచ్చిన తండ్రిపై దాడి.. వీడియో కాల్‌లో లవర్‌కు లైవ్..

Crime: పెళ్లైన మహిళతో ఎఫైర్.. అడ్డొచ్చిన తండ్రిపై దాడి.. వీడియో కాల్‌లో లవర్‌కు లైవ్..

Crime: జనాలు మరీ సైకోలుగా మారిపోతున్నారు. ఇటీవల కాలంలో ఉన్మాదం జడలు విచ్చుకుంటోంది. మహిళలపై దాడులు, గంజాయి గొడవలు, హత్యలు, అరాచకాలతో పైశాచికత్వం పేట్రేగిపోతోంది. అలాంటిదో మరో ఘటన చిత్తూరు నగరంలో జరిగింది.


అతని పేరు భరత్. వయసు 21. పనీపాటలేని జులాయి ఖర్చుల కోసం కూలి పని చేస్తుంటాడు. వాడికి కూడా ఓ ఎఫైర్ ఉంది. తమ ఇంటి సమీపంలోని ఓ మహిళ(39)తో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఇద్దరి మధ్య సుమారు 20ఏళ్ల గ్యాప్ ఉంది. అయితేనేం.. ఆ యంగ్ బాయ్‌తో తెగ ఎంజాయ్ చేస్తోంది ఆ హౌజ్ వైఫ్.

ఈ అక్రమ సంబంధం విషయం భరత్ తండ్రికి తెలిసింది. అతనికి ఒళ్లు మండింది. తన కొడుకు చెడిపోతున్నాడని భావించి.. మందలించాడు. తండ్రి హోంగార్డుగా చేస్తుండటంతో పోలీస్ స్టేషన్లోనూ ఫిర్యాదు చేశాడు. కొడుకును స్టేషన్‌కు పిలిపించి ఎస్సైతో గట్టిగా వార్నింగ్ ఇప్పించాడు తండ్రి. ఇక తన కొడుకు దారికొస్తాడని.. ఆ మహిళతో ఎఫైర్ ఆపేస్తాడని భావించాడు.


కానీ, భరత్ తగ్గేదేలే అన్నాడు. అప్పటికే బాగా అలవాటు పడ్డాడేమో.. ఆ మహిళకు దూరంగా ఉండేది లేదన్నాడు. తనకే వార్నింగ్ ఇప్పిస్తాడా అని తండ్రిపైనే ధ్వేషం పెంచుకున్నాడు. వన్ ఫైన్ డే.. తన ఆంటీకి ఫోన్ చేసి.. వీడియో కాల్‌లో ఆమెకు చూపిస్తూ.. తండ్రిని దారుణంగా కొట్టాడు. కర్రతో తలపై బలంగా కొట్టడంతో ఆ తండ్రికి తీవ్ర గాయమైంది. ఇదంతా వీడియో కాల్‌లో చూస్తూ ఆ మహిళ ఖుషీ అయింది.

విషయం తెలిసి స్థానికులు గాయపడిన తండ్రిని ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. భరత్‌పై చిత్తూరు రెండో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related News

Pulivendula Politics: పులివెందుల రాజకీయాలు.. 30 ఏళ్లలో రెండోసారి, ఓటర్లు ఫుల్‌ఖుషీ

Pawan Kalyan: రూటు మార్చిన పవన్.. నిన్న మామిడి.. నేడు చీరలు, రేపు?

AP Free Bus Scheme: ఏపీలో ఫ్రీ బస్ స్కీమ్.. ఆ బస్సు లెక్కితే ఉచిత ప్రయాణం ఉండదు

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Big Stories

×