BigTV English

Kavitha: సిసోడియానే అరెస్ట్ చేశారు.. కవిత సేఫేనా?

Kavitha: సిసోడియానే అరెస్ట్ చేశారు.. కవిత సేఫేనా?

Kavitha: ఆయన ఢిల్లీ డిప్యూటీ సీఎం. ఆప్‌లో నెంబర్ 2 పొజిషన్. అయితేనేం? వదిలేస్తారా? అరెస్ట్ చేసేసింది సీబీఐ. ఢిల్లీ లిక్కర్ స్కాంలో మనీష్ సిసోడియా పాత్రపై బలమైన అనుమానం ఉండటం.. విచారణకు సిసోడియా సహకరించకపోవడంతో.. ఆయన్ను అరెస్ట్ చేసింది సీబీఐ. కస్టడీకి తీసుకుని.. పక్కా ఆధారాలు సేకరించనుంది.


సిసోడియాకు వ్యతిరేకంగా గట్టి ఆధారాలు లేవు. సీబీఐకి అనుమానం మాత్రం బలంగా ఉంది. విచారణకు సహకరించట్లేదనే సాకుతో మాత్రమే అరెస్ట్ చేసింది. కీలకమైన అంశాలపై ఆయన సరిగా సమాధానం ఇవ్వలేదని అంటోంది. అయితే, ఈ కేసులో మనీష్ సిసోడియాను నిందితుడిగా పేర్కొనలేదని తెలుస్తోంది.

నూతన మద్యం విధానాన్ని ఎలా డ్రాఫ్ట్‌ చేశారు? ఎవరెవరు దాన్ని ఆమోదించారు? ఎలాంటి చర్చలు జరిగాయి? అనే వివరాలున్న కీలక ఫైళ్లు ప్రస్తుతం కన్పించట్లేదని సీబీఐ వర్గాలు చెబుతున్నాయి. ఆ మిస్సింగ్ ఫైల్స్‌ గురించి విచారణ సమయంలో సిసోడియాను ఎన్నిసార్లు అడిగినా.. తనకు తెలియదనే చెప్పారని అంటున్నారు. ఇక, డ్రాఫ్ట్‌ డాక్యుమెంట్‌లో మార్పులకు సంబంధించిన ఆదేశాలు వాట్సప్‌ ద్వారా ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులకు అందాయని తెలుస్తోంది. ఆ నెంబర్ సిసోడియాదేనని తేలింది. అయితే.. 2022 ఆగస్టు నుంచి సెప్టెంబరు మధ్య సిసోడియా ఏకంగా 18 ఫోన్లు, 4 సిమ్‌కార్డులు మార్చేసినట్టు సీబీఐ దర్యాప్తులో వెల్లడైంది. గతేడాది ఆగస్టు 19న సిసోడియాపై సీబీఐ కేసు నమోదు కాగా.. ఆ మర్నాడే ఆయన ఒకే నంబరుపై మూడు ఫోన్లు మార్చి వాడారని సీబీఐ గుర్తించింది. ఎందుకలా చేశారంటే.. మనీశ్ నుంచి సరైన సమాధానం రాలేదు.


ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా అరెస్ట్‌.. తెలంగాణలో ప్రకంపణలు రేపుతోంది. ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు ఛార్జిషీట్‌లో ఎమ్మెల్సీ కవిత పేరు ఉండటం.. ఓ దఫా విచారించడం జరిగింది. సౌత్ లాబీ పేరుతో కవిత, మాగుంట రాఘవరెడ్డిలు కీ రోల్ ప్లే చేశారని అంటున్నారు. 100 కోట్లు చేతులు మార్చారని అనుమానిస్తున్నారు. ఈ కేసులో మాగుంట రాఘవను సీబీఐ అరెస్ట్ చేసి జైలుకు పంపించింది. హూ నెక్ట్స్? అనే చర్చ మొదలైంది.

ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేస్తారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. మనీశ్ సిసోడియాలానే కవిత సైతం 10 ఐ ఫోన్లు మార్చారంటూ ఛార్జిషీట్లో తెలిపింది సీబీఐ. అయితే, సీఎం కేసీఆర్ కూతురు కావడంతో పక్కా ఎవిడెన్స్‌ ఉండాలని సీబీఐ భావిస్తోంది. అయితే, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రినే అరెస్ట్ చేసిన సీబీఐ.. సీఎం కూతురనే కారణంతో వదిలేస్తుందా? అనే చర్చ జరుగుతోంది. త్వరలోనే కవిత అరెస్ట్ తప్పదంటూ రాష్ట్ర బీజేపీ నేతలు పదే పదే వార్నింగులు ఇస్తున్నారు. అదే నిజమైతే.. త్వరలోనే కేసీఆర్ కూతురు కవిత అరెస్ట్ తప్పదా? సిసోడియానే వదలని సీబీఐ.. కవితను వదిలేస్తుందా? అదే జరిగితే తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కడం ఖాయం. సిసోడియా అరెస్ట్‌తో ఢిల్లీలో ఆప్ పెద్ద ఎత్తున బీజేపీకి వ్యతిరేకంగా నిరసనలు చేస్తోంది. మరి, రాజకీయ చాణక్యుడుగా చెప్పబడే కేసీఆర్.. కవిత విషయాన్ని ఎలా డీల్ చేస్తారో?

Related News

Bagram Air Base: బాగ్రామ్ ఎయిర్ బేస్ ఇచ్చేయండి.. లేదంటే రక్తపాతమే..

US Army in Bangladesh: బంగ్లాలో సీక్రెట్ మిషన్..! రంగంలోకి యూఎస్ ఆర్మీ..

Amit Shah: మావోయిస్టుల రూట్ చేంజ్! కొత్త వ్యూహం ఇదేనా?

Telangana Sports: టార్గెట్ 2036 ఒలింపిక్స్..! గోల్డ్ తెచ్చిన వారికి రూ.6 కోట్ల నజరానా

Telangana BJP MP’s: మారకపోతే అంతే.. బీజేపీ ఎంపీలకు ఢిల్లీ పెద్దల వార్నింగ్

Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్‌పై.. వైసీపీ పొలిటికల్ గేమ్

Kakinada: కాకినాడ రూరల్ సెగ్మెంట్‌పై ఫోకస్ పెట్టని టీడీపీ పెద్దలు

Hyderabad Metro: మెట్రో ప్లాన్..! అప్పుల నుంచి బయటపడాలంటే ఇదొక్కటే మార్గం..!

Big Stories

×