E-Paper
Advertisement

పెళ్లి వేడుకలో రక్తపాతం.. ఇద్దర్ని లేపేసిన ప్రత్యర్థులు, తిరుపతి సిటీలో జంట హత్యల కలకలం

పెళ్లి వేడుకలో రక్తపాతం.. ఇద్దర్ని లేపేసిన ప్రత్యర్థులు, తిరుపతి సిటీలో జంట హత్యల కలకలం
Advertisement

Tirupati Double Murder: తిరుపతి నగరంలో జంట హత్యలు తీవ్ర కలకలం రేపాయి. విడిపోయిన కుటుంబాన్ని కలపాలని భావించిన ఇద్దరు మధ్యవర్తులు దారుణ హత్యకు గురయ్యారు. తిరుపతిలోని పద్మావతి కల్యాణ మండపం-1లో రాత్రి ఈ ఘోరం జరిగింది. జంట హత్యల వెనుక అసలేం జరిగింది?

తిరుపతి సిటీలో జంట హత్యల కలకలం-తిరుమల వ్యాపారి సంపూర్ణమ్మ తన కూతుర్ని ఏర్పేడు మండలానికి చెందిన సునీల్ ఇచ్చి పెళ్లి చేసింది. ఇదంతా ఆరేళ్ల కిందట జరిగింది. ఆ జంటకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే ఫ్యామిలీలో ఏర్పడిన కొన్ని సమస్యల కారణంగా భార్యాభర్తలు విడివిడిగా ఉంటున్నారు.

Advertisement

బుధవారం రాత్రి తిరుపతిలోని పద్మావతి కళ్యాణ మండపంలో జంగాలపల్లి ప్రాంతానికి చెందిన వారి బంధువుల వివాహం జరుగుతోంది. ఈ వివాహానికి అల్లుడు సునీల్ వస్తాడని భావించింది అత్త సంపూర్ణమ్మ. పెద్దలతో మాట్లాడించి తన కూతురు సంసారాన్ని చక్కదిద్దాలని అనుకుంది.

పద్మావతి కళ్యాణ మండపంలో ఘటన-ఈ నేపథ్యంలో ఆనాడు పెళ్లి పెద్దగా వ్యవహారించిన మునిరత్నం యాదవ్‌ను సంప్రదించింది సంపూర్ణమ్మ. తిరుమలలో గాజుల వ్యాపారం చేస్తున్న మునిరత్నం, పెద్దామె మాట కాదనలేక సరేనని అన్నాడు. మునిరత్నం తన స్నేహితుడు మణికంఠను తోడుగా తీసుకుని వివాహ వేడుకకు వచ్చాడు.

Advertisement

కల్యాణ మండపంలో మునిరత్నం-మణికంఠ కలిసి సునీల్‌ను కలిశారు. భార్యాభర్తల మధ్య జరిగిన గొడవలపై మాట్లాడుతున్నారు. ఆ సమయంలో మాటా మాటా కాస్త పెరిగి తీవ్ర వివాదానికి దారితీసింది. తీవ్ర ఆగ్రహానికి లోనైన సునీల్, ఫోన్ చేసి తన తండ్రి, తమ్ముడు, అల్లుడ్ని కల్యాణ మండపం వద్దకు రప్పించాడు.

భార్యాభర్తలను కలపేందుకు ప్లాన్..  ఆగ్రహానికి లోనైన యువకుడి బంధువులు

చర్చలు ఫెయిల్ కావడంతో మునిరత్నం-మణికంఠలు తమ వాహనాలపై వెళ్లిపోవడానికి రెడీ అయ్యారు. బయలుదేరుతున్న సమయంలో సునీల్-అతని కుటుంబ సభ్యులు కత్తులతో వారిపై విచక్షణా రహితంగా దాడికి చేశారు. ఈ పరిణామానికి భయపడిన బంధువులు, అక్కడున్నవారు భయంతో బయటకు పరుగులు తీశారు. కల్యాణ మండపం నుంచి బయటకు పరుగెత్తున్న వ్యక్తులను వెంటాడి మరీ నరికాడు సునీల్.

ALSO READ: మత విద్వేషాలు రేపితే చర్యలు తప్పవు.. జగన్, ప్రకాష్ రాజ్‌లపై మంత్రి సత్యకుమార్ ఫైర్!

తీవ్రంగా గాయపడిన మునిరత్నం అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. గాయాల పాలైన మణికంఠ ప్రాణాలను కాపాడుకోవడానికి కల్యాణ మండపం ప్రధాన గేటు వైపు పరుగులు తీశాడు. ఈ ఘటన గురించి సమాచారం తీసుకున్న స్థానికులు వెంటనే రుయా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మణికంఠ కూడా మృతి చెందాడు. నిందితుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.

 

Related News

టీడీపీ చేరిన నెల రోజులకే మజ్జి శ్రీనుకు బిగ్ టాస్క్.. స్థానిక సంస్థల ఎన్నికల్లో నిరూపించుకుంటే

చంద్రబాబు మోసాలు, వెన్నుపోట్లకు స్వస్తి చెప్పాలి: బొత్స సత్యనారాయణ

పోలవరం ఎమ్మెల్యేపై పవన్ కల్యాణ్ సీరియస్.. విచారణకు హైలెవెల్ కమిటీ ఏర్పాటు!

జ్ఞానేష్ కుమార్ మోదీకి బానిస!.. అఖిలపక్ష భేటీలో ఫైర్ అయిన వైఎస్ షర్మిల

ఆంధ్రా యూనివర్సిటీలో కొకైన్ కలకలం.. పోలీసుల రికార్డుల్లో షాకింగ్ నిజాలు!

సీఎం చంద్రబాబుపై సెటైర్లు వేసిన నందమూరి లక్ష్మీపార్వతి.. ఏమన్నారంటే?

ఎన్నికలంటే వైసీపీకి వణుకు.. అందుకే న్యాయస్థానాలకు, పార్టీ పరంగా బీసీలకు న్యాయం-సీఎం చంద్రబాబు

బీసీల రిజర్వేషన్ల అంశం.. ఏపీ ప్రభుత్వం రియాక్ట్, పార్టీ పరంగా ఇస్తామన్న మంత్రి పార్థసారధి

Big Stories

Advertisement
×