E-Paper
Advertisement

Brahmamudi Serial Today Episode July 9th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: అగ్రిమెంట్ పేపర్స్ చింపేసిన నందు  

Brahmamudi Serial Today Episode July 9th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: అగ్రిమెంట్ పేపర్స్ చింపేసిన నందు  
Advertisement

Brahmamudi serial today Episode: ఇంటికి వచ్చిన నందు తను కళ్యాణ్‌, అప్పుల కూతురు నందు అని చెబుతుంది.. అందరూ షాక్‌ అవుతుంది. భ్రమరాంబ మాత్రం నువ్వే నందు అనడానికి సాక్ష్యం ఏంటి అని అడగ్గానే.. అయితే చెప్తాను పిన్ని చిన్నప్పుడు మదన్‌ గాడి చేతిలో పండు లాక్కున్నప్పుడు నువ్వు నన్ను కొట్టావు కదా..? అలాగే మాకు అక్షరాభ్యాసం జరుగుతున్నప్పు మా పలకలు లాక్కుని పగులగొట్టారు కదా..? అంటూ చెప్పగానే.. భ్రమరాంబ భయంగా అది నేను కాదు రేఖ విరగొట్టింది అనగానే.. నందు సరేలే ఎవరో ఒకరు ప్రతి చిన్న విషయానికి మీరు నన్ను కొట్టారు కదా..? నన్ను రాచి రంపాన పెట్టారు కదా..? అంటూ చెప్తుంటే.. రేఖ, నందును కొట్టిన విషయం గుర్తుకు చేసుకుంటుంది. నందు.. బాబాయ్‌ నేను కోపంత పిన్ని చేయి కొరికినప్పుడు నువ్వే కదా నన్ను ఆపావు అనగానే..

శేషు అవునమ్మా.. ఇప్పుడు నమ్మకం వచ్చింది అనగానే.. రేఖ కోపంగా ఏయ్‌ ఏవో చిన్నప్పటివి నాలుగు విషయాలు తెలుసుకుని నువ్వే నందు అంటే నమ్మేస్తామా..? అంటుంది. దీంతో రేఖ కోపంగా నాకు తెలుసు ఆంటీ నువ్వెంత దొంగ.. అంటూ ఆపగానే.. శేషు ఏంటమ్మా ఆగిపోయావు.. పూర్తి చేయ్‌ అనగానే.. చేస్తాను.. బాబాయ్‌ ఇక నుంచి ఇక్కడే ఉంటాను కదా…? అప్పుడు పూర్తి చేస్తాను అంటూ తానే చిన్నప్పటి నందును అంటూ తెలిపే సాక్ష్యం తన ఫోన్‌లో రేఖకు చూపిస్తుంది. ఆ సాక్ష్యం చూసిన రేఖ షాక్ అవుతుంది. ఈ ఫ్రూప్‌ సరిపోతుందా..? ఇంకా ఏమైనా కావాలా..? ఈ ఆస్థి మీకు ట్రాన్స్‌ఫర్‌ కావాలంటే ఇందుతో పాటే నేను కూడా సంతకం చేయాలి కదా..? చెప్పండి నేను కూడా సంతకం చేయాలా వద్దా..? అని అడగ్గానే..

Advertisement

శేషు మా తల్లివి కదా.. సంతకం పెట్టేయ్‌ అమ్మా అనగానే.. సరే బాబయ్‌ నువ్వు చెప్పినందుకు పెట్టేస్తానులే ఎక్కడ పెట్టాలి ఇక్కడ పెట్టాలా..? అంటూ అడుగుతుంటే.. భ్రమరాంబ నవ్వుతుంది. నందు పెన్ను తీసుకుని సంతకం చేయబోతుంటే.. ఇందు, అపర్ణ, సుభాష్‌ భయంగా చూస్తుంటారు. అప్పుడే నందు కోపంగా అగ్రిమెంట్‌ పేపర్స్‌ చింపేస్తుంది. వచ్చిన ఆఫీసర్లను వెళ్లిపోమ్మని చెప్తుంది. వాళ్లు వెళ్లిపోయాక నందు కోపంగా చిన్నప్పుడు నువ్వు పెట్టే టార్చర్‌ భరించలేక నీకు ఎప్పటికైనా బుద్ది చెప్పాలని ఇంట్లోంచి పారిపోయి చదువుకుని పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌కు దగ్గర అయ్యాను.. ఇప్పటి వరకు మా అక్కను అమాయకురాలిని చేసి ఆడించారు.. ఇకపై అలా చేస్తే నేను ఊరుకోను.. మా అక్కకు నేనున్నాను.. మా అక్క జోలికి ఎవరైనా వస్తే తాట తీసేస్తాను.. పద అక్కా అంటూ ఇందును తీసుకుని నందు రూంలోకి వెళ్లిపోతుంది.

రూంలోకి వెళ్లిన తర్వాత నందు.. అపర్ణ, సుభాష్‌ లకు కాళ్లు మొక్కుతుంది. అపర్ణ ఎమోషనల్‌ అవుతుంది. అంత చిన్న వయసులోనే నువ్వెలా అంత కఠినమైన నిర్ణయం తీసుకున్నావే.. అంటూ ఏడుస్తుంది. నీ గురించి వెతకని చోటే లేదు.. నిన్ను ఎవరైనా కిడ్నాప్‌ చేశారేమోనని ఎంత కుమిలిపోయామో తెలుసా..? అంటూ బాధపడుతుంది. ఆ రోజు ఇందు కిడ్నాప్‌ అయిన రోజు నువ్వు ఇంట్లోనే ఉన్నావు కదా..? కనీసం అప్పుడైనా చెప్పాలి కదా అంటూ అపర్ణ అడగ్గానే.. ఎవరికి తెలియకుండా ఇలా ఎందుకు ఉన్నావే ఇన్ని రోజులు అంటూ ప్రశ్నించగానే.. ఎవరికీ తెలియకపోవడం ఏంటి నాన్నమ్మ ఇందు అక్కకు తెలుసు కదా..? నేనే నందును అని అక్కకు చెప్పాను కదా అనగానే.. అపర్ణ, సుభాష్‌, స్వాతి షాక్‌ అవుతారు. అపర్ణ ఆశ్చర్యంగా ఏంటే ఇది చెప్పేది ఇది నిజమేనా..? ఇదే నందు అని నీకు తెలుసా..? అని అడగ్గానే.. ఇందు తెలుసు నాన్నమ్మ అంటుంది.

Advertisement

అపర్ణ కోపంగా అంటే నీకు తెలిసి కూడా నాకు చెప్పలేదంటే నేను ఏమనుకోవాలి అనగానే.. ఇందు కోపంగా ఏయ్‌ ఏంటే నువ్వు రాగానే నన్ను ఇలా ఇరికించావు.. ఆరోజు నువ్వే కదా ఈ విషయం ఎవ్వరికీ చెప్పొద్దని నా దగ్గర మాట తీసుకున్నావు.. అనగానే.. నందు అవును తీసుకున్నాను కానీ చెప్పడం చెప్పకపోవడం నీ ఇష్టం కదక్కా అంటూ నవ్వుతుంది. అప్పుడే ఇందు నేను ఇదంతా చెప్పలేదు కదా నీకు ఎలా తెలిసింది అంటూ అడగ్గానే.. తనకు రాజు చెప్పాడని నందు చెప్తుంది. రాజు తనను పిలిచి చెప్పిన విషయం మొత్తం చెప్తుంది నందు. నువ్వు రాకపోయి ఉంటే ఆస్థి మొత్తం రేఖ ఆంటీ సొంతం అయ్యేది అంటూ థాంక్స్‌ చెప్తుంది.

స్వాతి మాత్రం నాన్నమ్మ నువ్వు చెప్పిందే నిజమైంది. బావ రాకుండానే సేవ్‌ చేశాడు అని చెప్పగానే.. అపర్ణ, సుభాష్‌ ఇద్దరూ రాజును మెచ్చుకుంటూ.. చాలా గొప్ప మనిషి అంటూ పొగుడుతారు. రాజుకు నువ్వంటే ప్రాణం అందుకే వాళ్ల అమ్మనాన్న అలా మాట్లాడినా వాళ్లతో వెళ్లలేదు.. తను నీతో ఉంటేనే నీ జీవితం బాగుంటుంది. ఈ ఇల్లు బాగుంటుంది. అంటూ చెప్తారు. వాళ్లందరూ ఎంత చెప్పినా ఇందు తాను రాజును రమ్మనలేనని చెప్తుంది. అపర్ణ ఎందుకని అడిగితే.. రాజును ఈ ఊబిలోకి రానివ్వకూడదని అంటూ చెప్పగానే.. ఈరోజు బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

హర్మూజ్ తెరుస్తారా.. దాడులు ఎదుర్కొంటారా? ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

Big Stories

Advertisement
×