E-Paper
Advertisement

మళ్లీ యుద్ధం తీవ్రరూపం.. బంగారం-వెండి ధరలు భారీగా పతనం, కొన్నాళ్లు ఇదే పరిస్థితి తప్పదా?

మళ్లీ యుద్ధం తీవ్రరూపం.. బంగారం-వెండి ధరలు భారీగా పతనం, కొన్నాళ్లు ఇదే పరిస్థితి తప్పదా?
Advertisement

Gold Price Down: పశ్చిమాసియాలో మరోసారి బాంబు దాడులు తీవ్రమయ్యాయి. ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు మళ్లీ పెరిగాయి. విపరీతంగా పెరుగుతున్నాయి. ఇదే క్రమంలో బంగారం-వెండి ధరలు భారీగా పతనమవుతున్నాయి. ధరలు పతనం కావడంతో తెలుగు రాష్ట్రాల్లో పసిడి-వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధం –ఇరాన్-అమెరికా మధ్య యుద్ధం మళ్లీ మొదలైంది. గడిచిన రెండు రోజులుగా ఒకరి స్థావరాలపై మరొకరు బీకరంగా దాడులు చేస్తున్నారు. సీజ్ ఫైర్ ఎండ్ అయ్యిందని ట్రంప్ చెప్పగానే ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లో ఒక్కసారిగా కూలిపోయాయి. ఇరాన్ చమురు విక్రయాలపై అమెరికా ఆంక్షలు తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు మళ్లీ భగ్గుమన్నాయి.

Advertisement

పెరుగుతున్న ఆయిల్ ధరలు-బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు ప్రస్తుతం 80 డాలర్లకు సమీపంలో ఉంది. రేపో మాపో ఈ ధర 100 డాలర్లకు చేరే అవకాశముందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఈసారి అమెరికా చమురు క్షేత్రాలను టార్గెట్ చేయవచ్చనే ప్రచారం లేకపోలేదు. ఈ నేపథ్యంలో పెట్టుబడుదారుల చూపు డాలర్ వైపు మళ్లింది. ఇప్పుడిప్పుడే పెరుగుతున్న బంగారం-వెండి ధరలు ట్రంప్ ప్రకటనతో ఢమాల్ అన్నాయి.

పడిపోతున్న బంగారం-వెండి ధరలు-ఈ రెండు మెటల్స్ ఆకర్షణ కోల్పోతున్నాయి. వరుసగా మూడో రోజులు భారీ పతనం కనిపించింది. అటు అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్-సిల్వర్ రేట్లు విపరీతంగా తగ్గాయి. స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 4070 డాలర్లకు దిగొచ్చింది. అంతకుముందు 4120 వద్ద ట్రేడింగ్ జరిగింది. సిల్వర్ కూడా 61 డాలర్ల స్థాయి నుంచి 58 డాలర్లకు పతనమైంది. అటు డాలరుతో చూస్తే రూపాయి విలువ రూ. 95.55 వద్ద కొనసాగుతోంది.

Advertisement

అంతర్జాతీయంగా కాకుండా దేశీయంగా బంగారం-వెండి ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. గడిచిన రెండు రోజులను ఒక్కసారి పరిశీలిస్తే.. హైదరాబాద్ సిటీలో గురువారం ఉదయం 7 గంటలకు ధరలను పరిశీలిద్దాం. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 2130 తగ్గింది. ఇప్పుడు 10 గ్రాములు రూ. 1,43,130 వద్ద ట్రేడింగ్ జరుగుతోంది.

కొన్నాళ్లు తప్పదంటున్న మార్కెట్ వర్గాలు – బుధవారంతో పోల్చితే రూ. 1360 తగ్గింది. 22 క్యారెట్ల ధర రూ. 1950 తగ్గింది. 10 గ్రాములు రూ. 1,31,200 వద్ద కొనసాగుతోంది. అంతకుముందు రోజు రూ. 1250 తగ్గింది. గడిచిన మూడు రోజులుగా చూస్తే ఏకంగా రూ. 3300 తగ్గినట్లయ్యింది. బంగారం బాటలో వెండి ధరలు పతనం అవుతున్నాయి.

ALSO READ: తక్కువ ధరకి వస్తుందని నోటరీ ప్లాట్లు కొంటున్నారా? అయితే మీరు డేంజర్‌లో పడినట్టే..?

వెండి కేజీ రూ. 5 వేలు తగ్గి రూ. 2.45 లక్షల వద్ద ఉంది. జులై 6 న వెండి రేటు రూ. 10 వేలు తగ్గింది. పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో బంగారం-వెండి ధరలు భారీ పతనం కావచ్చని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అదే సమయంలో పెట్టుబడుదారులు బంగారం కంటే డాలర్ వైపు మొగ్గు చూపు అవకాశముందని చెబుతున్నాయి.

Related News

Notary Plot: తక్కువ ధరకి వస్తుందని నోటరీ ప్లాట్లు కొంటున్నారా? అయితే మీరు డేంజర్‌లో పడినట్టే..?

PF Accounts: 34 కోట్ల మందికి శుభవార్త.. పీఎఫ్ సభ్యులకు వడ్డీ జమ, ఆపై రూ.5 లక్షల వరకు

ప్రధాని మోడి ఇన్వెస్ట్ చేస్తున్న ఈ పోస్టాఫీస్ స్కీమ్ గురించి తెలుసా? లక్షల్లో వడ్డీ!

పసిడి ప్రియులకు చల్లని వార్త.. భారీగా తగ్గిన పసిడి ధరలు.. కొనుగోలుకు ఇదే మంచి సమయమా?

Hyderabad: ఖరీదైన హౌసింగ్ మార్కెట్‌గా హైదరాబాద్.. దేశంలో మూడోది, ఆ రెండు నగరాల తర్వాత ఇక్కడే

సిక్ లీవ్స్‌పై సర్కార్ ఉక్కుపాదం.. ఒక్కరోజు లీవ్ పెట్టినా.. డాక్టర్ సర్టిఫికేట్ ఉండాల్సిందే!

బంగారం ధరల షాక్.. పెరిగేటప్పుడు రాకెట్ వేగం.. తగ్గేటప్పుడు నత్తనడక! పసిడి ప్రియుల్లో తీవ్ర ఆందోళన

Big Stories

Advertisement
×