E-Paper
Advertisement

అడవిని డెడ్లీ డెత్ గేమ్ లా మార్చే సైకో… టూరిస్టులను టార్చర్ చేసి చంపే కిల్లర్

అడవిని డెడ్లీ డెత్ గేమ్ లా మార్చే సైకో… టూరిస్టులను టార్చర్ చేసి చంపే కిల్లర్
Advertisement

Survival Slasher Thriller: థ్రిల్లర్ కంటెంట్ ను చూసేందుకు ఎక్కవ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు మూవీ లవర్స్. అయితే కొన్ని సినిమాలు స్లాషర్ కంటెంట్ తో వణుకు పుట్టిస్తుంటాయి. ఈ ఏడాది ఒక స్లాషర్ థ్రిల్లర్ ను చూసి ఆడియన్స్ బాగా వణికిపోయారు. ఇది సర్వైవల్ ఇన్‌స్టింక్ట్ తో సాగే ఉద్రిక్తమైన థ్రిల్లర్. అడవి అందం నుంచి భయం పుట్టే నరకం వరకు దర్శకుడు అద్భుతంగా చూపించాడు. హారర్ సర్వైవల్ థ్రిల్లర్ ఇష్టపడే వాళ్ళు తప్పక చూడాల్సిన చిత్రం ఇది. ఈ థ్రిల్లర్ సినిమా పేరు Pitfall. చీకటి అడవిలో క్షణం కూడా ఊపిరి ఆగిపోయేలా చేసే ఈ సినిమా మీకు రాత్రి నిద్రపట్టకుండా చేస్తుంది.

కథ ఏంటంటే

స్కాట్, అతని సోదరి యాష్లే మధ్య గతంలో జరిగిన కుటుంబ వివాదాలు, బాధాకరమైన సంఘటనలు వారి సంబంధాన్ని దూరం చేస్తాయి. ఆ గ్యాప్‌ను తగ్గించుకోవాలని స్కాట్ ఒక ప్లాన్ చేస్తాడు. తమ స్నేహితులతో కలిసి సిటీకి దూరంగా ఉన్న దట్టమైన అడవి ప్రాంతానికి హైకింగ్ ట్రిప్‌కు వెళ్తారు. అందమైన అడవి, చల్లని గాలులు, రాత్రి క్యాంప్‌ఫైర్ స్టోరీలు — మొదటి రెండు రోజులు అందరూ సరదాగా గడుపుతారు. స్కాట్-యాష్లే మధ్య కూడా నెమ్మదిగా పాత స్నేహం తిరిగి వస్తున్నట్టు అనిపిస్తుంది.

Advertisement

కానీ మూడవ రోజు అనుకోకుండా ఒక ప్రమాదం జరుగుతుంది. స్కాట్ తన స్నేహితుల నుంచి కొంచెం దూరంగా వెళ్లి దారి తప్పిపోతాడు. దట్టమైన చీకటి, పొరుగు శబ్దాల మధ్య అతను దారి వెతుక్కుంటూ వెళ్తుండగా, అకస్మాత్తుగా 10 అడుగుల లోతైన గుంతలో పడిపోతాడు. ఆ గుంత అడుగున ఉన్న పదునైన ఇనుప స్పైక్స్ అతని కాళ్లలోకి లోతుగా గుచ్చుకుంటాయి. తీవ్రమైన నొప్పి, రక్తపాతం మధ్య స్కాట్ అక్కడే చిక్కుకుపోతాడు. మొదట్లో ఇది జంతువులను పట్టడానికి వేసిన సాధారణ ఉచ్చు అని అనుకుంటాడు. కానీ త్వరలోనే భయంకరమైన నిజం తెలుస్తుంది — ఇది ఒక సైకోపతిక్ హంటర్ మనుషులను వేటాడటానికి పన్నిన ఉచ్చు.

అడవి అంతటా ఆ అదృశ్య వేటగాడు రకరకాల ప్రమాదకరమైన ట్రాప్స్‌ను అమర్చి ఉంచాడు. స్నేహితులు స్కాట్ కనిపించకపోవడంతో వెతకడం మొదలుపెడతారు. కానీ కిల్లర్ వారి మొబైల్ ఫోన్లను దొంగిలించి, సిగ్నల్ లేకుండా చేసి, బయటి ప్రపంచంతో అన్ని సంబంధాలు తెంచేస్తాడు. ఒక్కొక్కరు ఒక్కొక్క ట్రాప్‌లో చిక్కుకుని భయంకరమైన మరణాలు ఎదుర్కొంటారు. యాష్లే తన సోదరుడిని కాపాడుకోవాలనే తపనతో, గాయపడిన స్థితిలో కూడా పోరాడుతుంది. స్కాట్ గుంతలో చిక్కుకుని కూడా ధైర్యంతో బయటపడే ప్రయత్నం చేస్తాడు. అడవి రాత్రి చీకటి, వర్షం, జంతువుల శబ్దాలు, కిల్లర్ వేటతో అక్కడ ప్రతి క్షణం ఉత్కంఠభరితంగా ఉంటుంది. కిల్లర్ ఎందుకు ఇలా వేటాడుతున్నాడు? అతని గతం ఏమిటి? అన్నీ కథ ముందుకు సాగుతున్న కొద్దీ బయటపడతాయి. చివరికి స్కాట్, అతని సోదరి యాష్లే ఆ సైకో కల్లర్ ఉచ్చు నుంచి బయట పడ్డారా ? లేక ఆ ఉచ్చులో బలైపోయారా ? అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

Advertisement

2026 లో వచ్చిన ఈ హాలీవుడ్ హారర్ సర్వైవల్ థ్రిల్లర్ Pitfall ప్రస్తుతం Amazon Prime Videoలో అందుబాటులో ఉంది. జేమ్స్ కొండెలిక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తెలుగు డబ్బింగ్ లేకుండా కేవలం ఇంగ్లీష్ భాషలోనే స్ట్రీమ్ అవుతోంది. ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్‌తో పాటు రెంటల్, బై ఆప్షన్ ద్వారా డిజిటల్ వీడియో ఆన్ డిమాండ్‌లో చూడవచ్చు. అడవి నేపథ్యంలో సాగే ఈ సినిమా స్లాషర్, సర్వైవల్, హారర్ ఎలిమెంట్స్‌ను అద్భుతంగా చూపిస్తూ ప్రేక్షకులను ఎడ్జ్ ఆఫ్ ది సీట్‌లో కూర్చోబెడుతుంది.

Read Also : నరకంలో ఉన్న పేరెంట్స్ కోసం దేవుడితో ఒప్పందం… మెంటలెక్కించే సూపర్ నేచురల్ థ్రిల్లర్

Related News

కొరియన్ కనకరాజు స్ట్రీమింగ్ డేట్ లాక్.. ఎక్కడ చూడొచ్చంటే?

కోట్ల ఆస్తి, విలాసవంతమైన కుటుంబం… కట్ చేస్తే షాకింగ్ ట్విస్ట్… మెంటలెక్కించే సైకలాజికల్ థ్రిల్లర్

ది బీటిల్స్ నుంచి హాలీవుడ్ పాప్ స్టార్ల వరకు… ప్రపంచ దిగ్గజాల వెనుక ఉన్న మ్యూజిక్ మొఘల్ కథ

కట్స్ లేకుండా ఒకే ఒక్క షాట్‌లో తెరకెక్కిన హారర్ థ్రిల్లర్… నిజంగానే ఆ భయంకరమైన ఇంట్లో ఉన్న థ్రిల్లిచ్చే థ్రిల్లర్

ఆ వర్షపు రాత్రి చేసిన ఒక్క తప్పు… చిన్న పొరపాటుకు జీవితాంతం శిక్ష… హార్ట్ టచింగ్ స్టోరీ

హీరో కావాలంటే ఇన్ని అవమానాలా? ఒక్క అవకాశం కోసం జీవితాన్నే పణంగా పెట్టిన యువకుడి కథ

ఒకే ఇంట్లో ఉన్నా ఒకరికొకరు దూరం… లవర్స్ మిస్ అవ్వకుండా చూడాల్సిన మినీ సిరీస్

30 పెళ్లి సంబంధాలు ఫెయిల్.. 31వ పెళ్లి కూడా పెటాకులు… ఈ అమ్మాయి చేసిన పనికి హ్యాట్సాఫ్

Big Stories

Advertisement
×