E-Paper
Advertisement

అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు.. వైసీపీ నేతలు షాక్

అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు.. వైసీపీ నేతలు షాక్
Advertisement

Amaravati: మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఆయన ఫోన్ చేసిన ఈడీ అధికారులు విచారణకు హాజరుకావాలని చెప్పినట్టు సమాచారం. ఈనెల 11న నోటీసులు ఇచ్చామని చెప్పారట. తనకు నోటీసులు అందలేదని ఆయన తెలిపారు. తాజాగా తమ కార్యాలయానికి రావాలని అధికారులు చెప్పారు. నోటీసులు ఏ కేసులో ఇచ్చారో సమాచారం తెలియదని చెప్పారట అంబటి.

ఏపీలో డొంక కదుతులున్న లిక్కర్ స్కామ్ కేసు

ఏపీ లిక్కర్ స్కామ్‌లో తీగలాగితే డొంక అంతా కదులుతోంది. ఈ కేసులో వైసీపీ కీలక నేతలకు చెమటలు పడుతున్నాయి. తాజాగా వైసీపీ ఫైర్ బ్రాండ్, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు ఇచ్చింది. మద్య అక్రమ రవాణా వ్యవహారంలో ఆయనకు నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ కేసులో లోతుగా దర్యాప్తు చేస్తున్నారు ఈడీ అధికారులు. ఈ వ్యవహారంలో అంబటికి నోటీసులు ఇవ్వడంతో వైసీపీ నేతలు ఖంగుతిన్నారు. మద్యం రవాణాకు సంబంధించి సబ్ కాంట్రాక్టులు అంబటి రాంబాబు బినామీ కంపెనీలకు కట్టబెట్టారని అధికారులు దర్యాప్తులో గుర్తించినట్టు సమాచారం.

మాజీ మంత్రి అంబటికి ఈడీ నోటీసులు

Advertisement

ఈ నేపథ్యంలో అంబటికి ఈనెల 11 న విచారణకు రావాలని ఈడీ నోటీసులు ఇచ్చినట్టు ఈడీ మాట. తనకు ఎలాంటి సమాచారం లేదని, అందుకే  విచారణకు రాలేదని ఆయన చెప్పినట్టు ఈడీ వర్గాలు చెబుతున్నాయి. గడిచిన రెండువారాలు కిందట అంబటి అనారోగ్యం పాలైన అంబటి, చికిత్స కోసం హైదరాబాద్‌కు వెళ్లారు. అక్కడ వైద్యం తీసుకుంటున్నారు. అందువల్ల నోటీసులు ఆయనకు అందలేదని అధికారులు భావిస్తున్నారు.  ఇప్పుడు ఫోన్ చేసి ఈడీ కార్యాలయానికి రావాలని సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది.

హైదరాబాద్‌లో అంబటి, ఈవారంలో విచారణకు హాజరు

ఈ కేసులో ఓ వైపు సిట్.. మరోవైపు ఈడీ లోతుగా దర్యాప్తు చేస్తోంది. ఇప్పటికే మాజీమంత్రి కారుమూరి నాగేశ్వరరావుని ఈడీ అరెస్టు చేయడం, రిమాండ్ విధించడం చకచకా జరిగింది. వైసీపీలో కీలకంగా ఉన్న అంబటికి నోటీసులు ఇవ్వడంతో మిగతా నేతలకు టెన్షన్ పట్టుకుంది. రేపటి రోజున ఇంకెంతమందికి నోటీసులు ఇస్తారేమోనని బెంబేలెత్తిత్తున్నారు. ఈడీ నోటీసులపై వైసీపీ నేతలు ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి.

Advertisement

ALSO READ: ట్రైన్‌పై ఓ వ్యక్తి నానాహంగామా.. ఆత్మహత్య చేసుకుంటానంటూ, రేణిగుంట రైల్వే స్టేషన్‌లో రచ్చ

Related News

వైసీపీకి చిచ్చుపెడుతున్న విజయసాయిరెడ్డి.. మా పార్టీ అసలైన రాయలసీమ రెడ్ల పార్టీ

ట్రైన్‌పై ఓ వ్యక్తి నానాహంగామా.. ఆత్మహత్య చేసుకుంటానంటూ, రేణిగుంట రైల్వే స్టేషన్‌లో రచ్చ

మెల్‌బోర్న్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. విశాఖకు చెందిన ఇద్దరు మహిళలు మృతి, షాకింగ్ ఫుటేజ్ వెలుగులోకి

భర్తను వదిలేసి బావ కొడుకుతో ఎఫైర్.. చివరకు ఏమైందంటే..

రాష్ట్రంలో తీవ్ర కరువు.. ఎకరాకు రూ. 25 వేల పరిహారం ఇవ్వాల్సిందే! వైఎస్ జగన్ డిమాండ్

తుని వద్ద రోడ్డు ప్రమాదం.. పెళ్లి బస్సు బోల్తా, 40 మందికి గాయాలు!

వారణాసిలో చంద్రబాబు జోష్.. మోదీ పాలనపై ప్రశంసల జల్లు!

Big Stories

Advertisement
×