E-Paper
Advertisement

ఊరమాస్ ఎంటర్‌టైన్‌మెంట్ గ్యారంటీ..కోడాక్ 43 ఇంచ్ స్మార్ట్ టీవీ అదిరిపోయే ఫీచర్లు ఇవే!

ఊరమాస్ ఎంటర్‌టైన్‌మెంట్ గ్యారంటీ..కోడాక్ 43 ఇంచ్ స్మార్ట్ టీవీ అదిరిపోయే ఫీచర్లు ఇవే!
Advertisement

Kodak 9X Series 43 inch Smart TV: ప్రస్తుత కాలంలో ఇంటింటికీ.. స్మార్ట్ టీవీలు ఒక ముఖ్యమైన సాధనంగా మారిపోయాయి. పెద్ద స్క్రీన్, అదిరి పోయే సౌండ్ క్వాలిటీ, స్మార్ట్ ఫీచర్లు తక్కువ ధరలో.. లభిస్తే ఎవరైనా వెంటనే కొనడానికి ఆసక్తి చూపుతారు.ప్రముఖ బ్రాండ్ కోడాక్ (Kodak) తన కస్టమర్ల కోసం మార్కెట్లోకి.. తెచ్చిన ‘కోడాక్ 9X సిరీస్ 43 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ’ (మోడల్: 439X5081) అలాంటి కోవకే చెందుతుంది. సాధారణ మిడిల్ క్లాస్ కుటుంబాల బడ్జెట్‌కు సరిగ్గా సరి పోయే ఈ టీవీ విశేషాలు ఏమిటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

పూర్తి ఫీచర్లు:

బెజెల్-లెస్ డిజైన్, డిస్‌ప్లే క్వాలిటీ:

ఈ టీవీ మెయిన్ హైలైట్ దీని డిజైన్ అని చెప్పాలి. ఇది మోడ్రన్ బెజెల్-లెస్ డిస్‌ప్లేతో వస్తుంది. అంటే స్క్రీన్ చుట్టూ అంచులు చాలా పల్చగా ఉండి చూడటానికి చాలా ప్రీమియంగా కనిపిస్తుంది. 108 సెంటీమీటర్లు అనగా 43 ఇంచుల ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే ద్వారా సినిమాలు, వెబ్ సిరీస్‌లు చూస్తున్నప్పుడు విజువల్స్ చాలా స్పష్టంగా, రంగుల మయంగా కనిపిస్తాయి. అంతేకాకుండా .. కంటి చూపును రక్షించడానికి ప్రత్యేకంగా ‘స్మార్ట్ షీల్డ్ ఐ’ టెక్నాలజీని అందించారు. దీనివల్ల ఎక్కువసేపు టీవీ చూసినా కళ్లకు ఎలాంటి ఒత్తిడి కలగదు.

పవర్ ఫుల్ 30W సౌండ్ అవుట్‌పుట్:

Advertisement

సాధారణంగా ఈ బడ్జెట్ టీవీలలో సౌండ్ క్వాలిటీ అంతంత మాత్రంగానే ఉంటుంది. కానీ కోడాక్ ఈ విషయంలో.. ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. ఇందులో పవర్ ఫుల్ 2 స్పీకర్లతో కూడిన 30 వాట్స్ (30W) సౌండ్ అవుట్‌ పుట్‌ను అందించారు. బేస్ , వాయిస్ క్లారిటీ చాలా స్పష్టంగా ఉండటం వల్ల అదనంగా హోమ్ థియేటర్ అవసరం లేకుండానే.. ఇంట్లోనే రియల్ థియేటర్ ఫీల్ పొందొచ్చు.

క్వాడ్-కోర్ ప్రాసెసర్, స్మార్ట్ ఫీచర్లు:

ఆండ్రాయిడ్ టెక్నాలజీతో పని చేసే ఈ టీవీలో సౌపర్ ఫాస్ట్ క్వాడ్-కోర్ ప్రాసెసర్‌ను వాడారు. దీని వల్ల టీవీ ఎక్కడా లాగ్ అవ్వకుండా చాలా స్మూత్‌గా ఆపరేట్ అవుతుంది. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ+ హాట్‌స్టార్ వంటి ప్రముఖ ఓటీటీ యాప్‌లను ఈజీగా రన్ చేసుకోవచ్చు. ఇంటర్‌నెట్ కనెక్టివిటీ ద్వారా మీకు నచ్చిన కంటెంట్‌ను ఇట్టే చూడొచ్చు.

ఉచిత లైవ్ ఛానెల్స్, కనెక్టివిటీ:

Advertisement

ఈ టీవీలో మరో అదిరిపోయే ఫీచర్ ఏంటంటే.. ఎలాంటి అదనపు సబ్‌స్క్రిప్షన్ లేకుండా ఉచితంగా 600 పైచిలుకు లైవ్ ఛానెళ్లను చూడొచ్చు. అలాగే బ్లూటూత్, వైఫై, హెచ్‌డీఎంఐ, యూఎస్‌బీ పోర్ట్‌లు ఉండటం వల్ల గేమింగ్ కన్సోల్స్ లేదా పెన్‌డ్రైవ్‌లను ఈజీగా కనెక్ట్ చేసుకోవచ్చు.

Also Read: ఇదేం డిజైన్ భయ్యా! మార్కెట్‌ను షేక్ చేస్తున్న సోనీ ఇయర్‌బడ్స్

ధర :

ఇన్ని లేటెస్ట్ ఫీచర్లు ఉన్న ఈ కోడాక్ 43 ఇంచ్ స్మార్ట్ టీవీ కేవలం రూ. 16,999 ధరకే లభించడం నిజంగా అద్భుతం అని చెప్పాలి. మార్కెట్లో లభించే ఇతర బ్రాండ్లతో పోలిస్తే.. ఇది అత్యుత్తమ బడ్జెట్ ఆప్షన్.

మొత్తానికి.. కోడాక్ 9X సిరీస్ 43 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ స్మార్ట్ టీవీ అనేది తక్కువ బడ్జెట్‌లో.. ఎక్కువ ఫీచర్లు కోరుకునే వారికి పర్ఫెక్ట్ ఛాయిస్. పెద్ద డిస్‌ప్లే, 30W పవర్ ఫుల్ సౌండ్ , స్మార్ట్ ఆండ్రాయిడ్ ఫీచర్లతో ఈ మోడల్ బెస్ట్ ఎంటర్ టైన్మెంట్ అందిస్తుంది.

Related News

పాకెట్ సైజులో పవర్ బ్యాంక్..నాయిస్ నుంచి అదిరిపోయే మోడల్!

లాంగ్ రోడ్ ట్రిప్‌లో పెట్రోల్ ఖర్చులు తగ్గించాలనుకుంటే.. ఈ 5 గాడ్జెట్లు వెంట పెట్టుకోండి!

ఒంటరి ప్రయాణంలో దారి తప్పినా, ఆపదలో ఉన్నా.. ఈ యాప్స్ క్షణాల్లో ఆదుకుంటాయి!

ఇదేం డిజైన్ భయ్యా! మార్కెట్‌ను షేక్ చేస్తున్న సోనీ ఇయర్‌బడ్స్

శాంసంగ్ నుంచి మరో అద్భుతం..గెలాక్సీ వాచ్ అల్ట్రా 2 పూర్తి రివ్యూ !

రూ.1999లకే అదిరిపోయే స్మార్ట్‌వాచ్..ఇన్ఫినిక్స్ Xవ్యాచ్ H5 ప్రో ఫీచర్లు అదుర్స్!

స్టోర్ల ముందు క్యూ కట్టాల్సిన పనిలేదు.. నిమిషాల్లో మీ చేతికి కొత్త iPhone 18 Pro, ఎలాగంటే?

Big Stories

Advertisement
×