Udaya Bhanu Remuneration:యాంకర్ గా బుల్లితెరని ఒక ఊపు ఊపిన ఉదయ భాను తాజాగా పంచనామా అనే వెబ్ సిరీస్ తో నిర్మాతగా మారిపోయింది.అయితే ప్రస్తుతం టాప్ యాంకర్స్ అంతా భారీగా పారోతోషికాలు పుచ్చుకుంటున్న ఈ సందర్భంగా ఒకప్పుడు టాప్ యాంకర్ గా సత్తా చాటిన ఉదయభాను ఎంత రెమ్యూనరేషన్ తీసుకుని ఉంటుందా అంటూ ఆరాలు తీస్తున్నారు నెటిజన్లు.
ఒక్కో ఎపిసోడ్ కి కేవలం 500
అయితే ఇప్పుడు యాంకర్స్ తీసుకుంటున్నట్టుగా ఒకప్పుడు పారితోషికాలు ఈ స్థాయిలో లేవు.ఉదయభాను కెరీర్ మొదలు పెట్టిన కొత్తల్లో ఒక్కో ఎపిసోడ్ కి కేవలం 500 నుండి 800 రూపాయ మాత్రమే పుచ్చుకున్నట్టు తెలుస్తుంది.అయినా టీవీలో యాంకర్ గా తనకంటూ ఒక గుర్తింపు రావడమే లక్ష్యంగా పని చేసిందట ఉదయభాను.
స్టార్ యాంకర్ గా క్రేజ్
అలా తనదైన ఎనర్జీ,టైమింగ్ తో చాలా తక్కువ కాలంలోనే ఆడియన్స్ ని తమ యాంకరింగ్ తో ఫిదా చేసింది.అలా ‘రేలా రే రిలా’, ‘డ్యాన్సింగ్ స్టార్స్’, ‘గోల్డ్ రష్’, ‘లక్కీ లక్ష్మి’, ‘చాంగురే బంగారు లేడీ’ అంటూ ఎన్నో గేమ్ షోలు, టాక్ షోలు ,ఈవెంట్స్,డాన్స్ ప్రోగ్రామ్స్ ..ఇలా యాంకరింగ్ చేసిన ఎన్నో ప్రోగ్రామ్స్ టీవీల TRP రేటింగ్ ఒక్కసారిగా దూసుకుపోవడంతో స్టార్ యాంకర్ గా క్రేజ్ కొట్టేసింది.ఇక ఆ క్రమంలోనే యాంకర్ గా ఉదయభాను రెమ్యూనరేషన్ కూడా అమాంతం పెరిగిపోయింది.
దాదాపు రూ. 4 లక్షల నుండి రూ. 5 లక్షల వరకు
దాంతో ఉదయభాను అప్పటి వరకు ఉన్న సౌత్ యాంకర్ లలో హయ్యెస్ట్ పారితోషికం తీసుకునే యాంకర్ లలో ఒకరిగా నిలిచిందట.అలా ఒక్కో ఎపిసోడ్ కి గానూ ఉదయభాను అప్పట్లోనేరూ. 60 వేల నుండి రూ. 1 లక్ష పదివేల వరకు తీసుకున్నట్టుగా సోషల్ మీడియాలో వినిపిస్తుంటుంది.
ఇక సినిమా ఈవెంట్లు, ఆడియో లాంచ్‌లు, ప్రీ-రిలీజ్ ఈవెంట్లు మరియు ప్రత్యేక కార్యక్రమాలకి యాంకరింగ్ చేయడానికి ఈవెంట్‌కు దాదాపు రూ. 4 లక్షల నుండి రూ. 5 లక్షల వరకు తీసుకునేవారని తెలుస్తుంది.అయితే ఇవన్ని కేవలం మీడియాలో వస్తున్న వార్తల ఆధారంగా లెక్క వేసినవే తప్ప స్వయంగా ఉదయభానే చెప్పిన విషయాలు కాదని గుర్తుంచుకోవాలి.
దాదాపు రూ. 9 లక్షల పైనే ఎగవేత
అయితే భారీగా పారితోషికం తీసుకుంటున్న సమయంలో కొందరు యాంకరింగ్ చేయించుకొని డబ్బాలు ఎగ్గొట్టారని,అలా ఒకటి రెండు కాదు ఏకంగా దాదాపు రూ. 9 లక్షల పైనే తనకు ఇవ్వకుండా హ్యాండ్ ఇచ్చారని పలు ఇంటర్వ్యూలలో వాపోయింది ఉదయభాను.ఏది ఏమైనా కేవలం 500 పారితోషికం తీసుకునే స్థాయి నుండి టాప్ యాంకర్ గా రూ. 5 లక్షల వరకు తీసుకునే స్థాయికి ఉదయభాను ఎదిగిందంటే మెచ్చుకోతగ్గ విషయమే !
ALSO READ:ప్యారడైజ్ కోసం నాని రెమ్యూనరేషన్ తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!