E-Paper
Advertisement

శివుడు ఖండించిన.. వినాయకుడి మొదటి మానవ రూప తల ఎక్కడుందో తెలుసా?

శివుడు ఖండించిన.. వినాయకుడి మొదటి మానవ రూప తల ఎక్కడుందో తెలుసా?
Advertisement

Patal Bhuvaneshwar Cave: వినాయక చవితి అనగానే.. బోలెడు కథలు వినినిస్తాయి. అందులో ఒకటి శివుడు విఘ్నేశ్వరుడి తలను ఖండించడం. ఆ తర్వాత పార్వతీ దేవి కోరిక మేరకు ఏనుగు తలను తీసుకొచ్చి ఆయన శరీరానికి అమర్చడం తెలిసిన విషయమే. అయితే, శివుడు ఖండించిన వినాయకుడి మానవ రూప తల ఎక్కడ ఉంది? అనేది చాలా మందికి తెలియదు. ఇప్పుడు ఆ రహస్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

పాతాళ భువనేశ్వర్ గుహలోనే ఉందా?    

ఉత్తరాఖండ్‌ లోని పిథోరగఢ్ జిల్లాలో పాతాళ భువనేశ్వర్ గుహ ఉంటుంది. ఇది గంగోలిహాట్‌కు సుమారు 14 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సముద్ర మట్టానికి దాదాపు 1,350 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ గుహ ప్రధాన ప్రవేశద్వారం నుంచి సుమారు 160 మీటర్ల మేర విస్తరించి, 90 మీటర్ల లోతు వరకు ఉంటుంది. ఇక్కడ అడుగు పెట్టగానే మరో ప్రపంచంలోకి వెళ్లిన అనుభూతి కలుగుతుంది. కొండల మధ్య సహజంగా ఏర్పడిన ఈ సున్నపురాయి గుహలో అనేక శిలా ఆకృతులు కనిపిస్తాయి. వాటికి దేవతలు, పురాణ కథలతో సంబంధం ఉందని స్థానికులు నమ్ముతారు. అందుకే దీనిని సాధారణ గుహగా కాకుండా ‘గుహల నగరం’గా పిలుస్తారు.

గణేశుడి తల ఇక్కడే ఉందా?   

Advertisement

పాతాళ భువనేశ్వర్‌కు సంబంధించిన అత్యంత ఆసక్తికర విషయాల్లో గణేశుడి కథ కూడా ఉంది. పురాణ కథనం ప్రకారం.. శివుడి ఆగ్రహానికి గణేశుడి తల మొండెం నుంచి వేరై ఈ గుహలో పడిందని నమ్ముతారు. తర్వాత పార్వతీదేవి కోరిక మేరకు శివుడు గణేశుడికి ఏనుగు తలను అమర్చాడని కథ చెబుతుంది. అయితే, గణేశుడి అసలు తలను మాత్రం పాతాళ భువనేశ్వర్‌లోనే ఉంచారని స్థానికుల విశ్వాసం. గుహలోని ఓ శిలను గణేశుడి తలగా భక్తులు భావిస్తారు. దాని పైన 108 రేకుల బ్రహ్మకమలం ఆకారంలో మరో శిల ఉంటుందని చెబుతారు. అక్కడి నుంచి నీటి బిందువులు గణేశుడి తలపై పడుతుంటాయి.

గుహలో అనేక శిలా ఆకృతులు!

ప్రవేశద్వారం దగ్గర నరసింహ స్వామికి సంబంధించిన శిలా ఆకృతి కనిపిస్తుంది. కొద్దిగా ముందుకు వెళ్తే శేషనాగు పడగను పోలిన రాయి ఉంటుంది. భూమి శేషనాగుపైనే నిలిచి ఉందనే విశ్వాసంతో దీనికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తారు. మరింత లోపలికి వెళ్లినప్పుడు ఆవు పొదుగులను పోలిన మరో శిలా నిర్మాణం కనిపిస్తుంది. దీనిని కామధేనువుగా భావిస్తారు. ఒకప్పుడు ఇక్కడి నుంచి పాలు ప్రవహించేవని, ప్రస్తుతం నీరు వస్తోందని స్థానికులు చెబుతారు.

పురాణాల్లో పాతాళ భువనేశ్వర్ ప్రస్తానం?

Advertisement

ఈ గుహ ప్రస్తావన స్కంద పురాణంలో ఉందని భక్తులు విశ్వసిస్తారు. సూర్యవంశానికి చెందిన ఋతుపర్ణ మహారాజు త్రేతాయుగంలో ఈ గుహను కనుగొన్నాడనే కథ కూడా ఉంది. కలియుగంలో క్రీ.శ. 722లో ఆది శంకరాచార్యులు ఈ ప్రాంతాన్ని సందర్శించారని స్థానిక సంప్రదాయం చెబుతుంది. ఆయన కాలం నుంచి ఈ క్షేత్రంలో పూజా సంప్రదాయం కొనసాగుతోందని నమ్మకం. తరతరాలుగా భండారీ పురోహిత కుటుంబాలు ఇక్కడ ధార్మిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు చెబుతారు.

దేవతల నిలయమనే విశ్వాసం!

పాతాళ భువనేశ్వర్ గురించి మరో ఆసక్తికరమైన నమ్మకం కూడా ఉంది. ఈ గుహలో శివుడితో పాటు ఇతర దేవతలు సూక్ష్మ రూపంలో కొలువై ఉంటారని భక్తులు విశ్వసిస్తారు. కేదార్‌నాథ్, బద్రీనాథ్, అమర్‌నాథ్ వంటి పుణ్యక్షేత్రాలకు సంబంధించిన ఆధ్యాత్మిక ప్రాధాన్యత కూడా ఈ గుహకు ఉందని స్థానిక కథనాలు చెబుతున్నాయి. ప్రళయానికి సంబంధించిన రహస్యాలు కూడా ఈ గుహతో ముడిపడి ఉన్నాయని జానపద కథలు చెప్తుంటాయి. గుప్త-గంగ, రామగంగ, సరయూ నదుల సంగమంతోనూ ఈ ప్రాంతానికి సంబంధం ఉందని కొన్ని పురాణ విశ్వాసాలు చెబుతున్నాయి. మొత్తంగా పాతాళ భువనేశ్వర్‌లో ప్రకృతి, పురాణం, ఆధ్యాత్మిక విశ్వాసం ఒకే చోట కలిసినట్లు కనిపిస్తాయి. అందుకే, ఉత్తరాఖండ్‌కు వెళ్లే భక్తులు  పాతాళ భువనేశ్వర్‌ను దర్శించుకుంటారు.

Read Also: విగ్రహం లేని 300 ఏళ్ల పురాతన ఆలయం.. కొండల్లో దాగిఉన్న ఈ గుడి గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Tags

Related News

సోలో ట్రిప్ వెళ్లాలనుకుంటున్నారా? అమ్మాయిలకైనా, అబ్బాయిలకైనా ఈ 4 ప్రదేశాలు సేఫ్ & బడ్జెట్ ఫ్రెండ్లీ!

గర్భిణీలకు రైలులో లోయర్ బెర్త్ రూల్ ఇదే.. అప్పర్ బెర్త్ వస్తే ఏం చేయాలంటే?

ఇళ్లుంటాయి.. జనాలు ఉంటారు.. కానీ, అక్కడ ఊర్లకు పేర్లు ఉండవు, ఎందుకంటే?

విగ్రహం లేని 300 ఏళ్ల పురాతన ఆలయం.. కొండల్లో దాగిఉన్న ఈ గుడి గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు!

కనువిందు చేసే పక్షులు, కట్టిపడేసే గార్డెన్లు.. హైదరాబాద్‌ దగ్గర్లో ఇంత అద్భుతమైన పార్క్ ఉందా?

సరస్సు ఒడ్డున కొలువైన రంగనాయక స్వామి.. ఇదే తెలంగాణ అపర శ్రీరంగం!

పచ్చని కొండలు.. పురాతన ఆలయం.. మధ్యలో మత్తడిదుంకే జలపాతం.. పెన్నాబద్దెవోలు అందాలకు ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే!

Big Stories

Advertisement
×