Vijayawada: వైసీపీకి మెల్లగా గాలి తీసేస్తున్నారు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి. తాజాగా శుక్రవారం మీడియా ముందుకొచ్చిన ఆయన, కీలక వ్యాఖ్యలు చేశారు. మా పార్టీ రాయలసీమ ఒరిజినల్ రెడ్ల పౌరుషాన్ని కాపాడే పార్టీ అని వ్యాఖ్యానించారు. మళ్లీ చెబుతున్నానని, తాను సీఎం కావాలనే కోరిన లేదని మరోసారి మనసులోని మాట బయపెట్టారు.
తాను పెట్టబోయే మా పార్టీ రాయలసీమ ‘ఒరిజినల్ రెడ్ల’ పౌరుషాన్ని, ఆత్మగౌరవాన్ని కాపాడే పార్టీ అని తేల్చేశారు విజయసాయిరెడ్డి. ఈ విషయంలో అందురూ కలిసి రావాలని, అందరం కలిసి రాష్ట్రాభివృద్ధికి కలిసి పని చేద్దామన్నారు. మా పార్టీ అన్ని కులాలు, మతాలను గౌరవించే పార్టీ అని, ఏ మతాన్ని, కులాన్ని కించపరచాలనే ఉద్దేశం లేదన్నారు. మళ్లీ చెబుతున్నానని, తాను సీఎం కావాలని అనుకోవడం లేదన్నారు.
గత ప్రభుత్వంలో అన్ని కులాల కార్పొరేషన్లను ఇచ్చిందని, ఈ ప్రభుత్వం ఇంకా రెడ్డీ కార్పొరేషన్ పదవుల్ని భర్తీ చేయలేదన్నారు. తక్షణమే రెడ్డి కార్పొరేషన్ ఖాళీలను భర్తీ చేయాలన్నారు. రాష్ట్రం విభజన తర్వాత రాయలసీమకు ఎన్ని నీటి ప్రాజెక్టులు వచ్చాయి? ఏదైనా అభివృద్ధి జరిగిందా? అంటూ సీఎం చంద్రబాబు, జగన్‌లను ప్రశ్నించారు. గడిచిన పుష్కరకాలంగా ఈ రెండు కుటుంబాలు రాష్ట్రాన్ని పాలించాయని గుర్తు చేశారు.
ఈ రెండు కుటుంబాలకు రాయలసీమ పట్ల నిజమైన ప్రేమ ఉందా? అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు రైజ్ చేశారు. ఓట్ల కోసం రాయలసీమ, రెడ్లు, ఫ్యాక్షన్ రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. సీమకు చెందిన నేతలు ముఖ్యమంత్రులు అయ్యారని, అక్కడ ఆస్తుల్ని పెంచుకున్నారని, అభివృద్ధి చేస్తున్నారని మండిపడ్డారు. ఈ గడ్డ కోసం పోరాటానికి యువత ముందుకు రావాలని, వ్యక్తుల అభివృద్ధికి రక్తం చిందించాల్సిన అవసరం లేదున్నారు. సీమ ఒడంబడిక ఏమైందని ప్రశ్నించారు. అత్యధికంగా వలస పోయేది ఈ ప్రాంత ప్రజలేనని అన్నారు.
ALSO READ: అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు.. వైసీపీ నేతలు షాక్
మీరే చూస్తారని, తమిళనాడులో టీవీకే పార్టీ డబ్బులు పెట్టిందా? సినిమా గ్లామర్ ఉంటుందేమో కానీ, ప్రజలకు నమ్మకాన్ని కలిగించి వాళ్ళు అధికారంలోకి వచ్చారన్నారు. ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతుంటాయని, ఈ రెండు కుటుంబాలు ఉన్నంతకాలం సీమ అభివృద్ధి జరగదని తేల్చేశారు. దేశంలో వర్షాలు తక్కువ పడే ప్రాంతాల్లో రాజస్థాన్‌లోని జైసాల్మీర్ తొలి స్థానం కాగా, రెండోది అనంతపురం జిల్లా అని గుర్తు చేశారు. ఇక్కడి నుంచి వచ్చిన నేతలు ఏం చేశారని ప్రశ్నించారు. ఇవి కాకుండా ఇంకా చాలా విషయాలు బయటపెట్టారు.