E-Paper
Advertisement

రూ. 3 వేల కోట్ల స్కామ్.. ఐదు ప్రాంతాల్లో ఇళ్లు-ఆఫీసుల్లో ఈడీ సోదాలు.. షాకైన విశాఖ వైసీపీ నేత విజయప్రసాద్‌

రూ. 3 వేల కోట్ల స్కామ్.. ఐదు ప్రాంతాల్లో ఇళ్లు-ఆఫీసుల్లో ఈడీ సోదాలు.. షాకైన విశాఖ వైసీపీ నేత విజయప్రసాద్‌
Advertisement

Visakhapatnam: ఈడీ దాడులతో వైసీపీ నేత మళ్ల విజయ ప్రసాద్ ఉక్కిరి బిక్కిరి అయ్యారు. ఆయన ఇళ్లు- ఆఫీసులను ఏకకాలంలో సోదాలు చేసింది. ఏపీ, తెలంగాణల్లోని ఐదు చోట్లు సోదాలు జరుగుతున్నాయి. వెల్ఫేర్‌ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీల ఛైర్మన్‌గా అవకతవకలకు పాల్పడిన కేసులో ఈ సోదాలు జరుగుతున్నాయి.

విశాఖ వైసీపీ నేత విజయ్ ప్రసాద్ ఇంటిపై  ఈడీ సోదాలు

బుధవారం ఉదయం విశాఖ వైసీపీ పశ్చిమ నియోజకవర్గం నేత మళ్ల విజయప్రసాద్‌ ఇళ్లు-ఆఫీసుల్లో సోదాలు చేసింది ఈడీ. హైదరాబాద్‌, విశాఖలోని ఐదు చోట్ల సోదాలు జరుగుతున్నాయి. వెల్ఫేర్‌ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీల ఛైర్మన్‌ వ్యవహరించిన ఆయన, అనేక అవకతవకలకు పాల్పడిన కేసులో ఈడీ దాడులు కొనసాగుతున్నాయి. దాదాపు రూ.3 వేల కోట్ల అక్రమాలు జరిగినట్లు తెలుస్తోంది.

ఐదు ప్రాంతాల్లో ఇళ్లు-ఆఫీసుల్లో ఈడీ సోదాలు

Advertisement

బీహార్‌, ఒడిషాకు చెందిన ఈడీ అధికారులు ఈ దాడుల్లో పాల్గొన్నారు. వెల్ఫేర్ గ్రూప్ ఆఫ్ కంపెనీల చైర్మన్‌గా మళ్ల విజయప్రసాద్ ఉన్నప్పుడు డిపాజిట్ల సేకరణ, నిధుల మళ్లింపులో తీవ్ర అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. ఏపీ వెలుపల ఒడిషా, బీహార్ రాష్ట్రాల్లో ఆ సంస్థ కార్యకలాపాలు కొనసాగించింది. ఆ సమయంలో ఆయన అనేక అవకతవకలకు పాల్పడినట్టు ఆయా రాష్ట్రాల్లో కేసులు నమోదు అయ్యాయి. ఆ కేసుల ఆధారంగా ఈడీ సోదాలకు దిగింది.

ALSO READ: వైసీపీలో అంతర్గత విభేదాలా? బోరుగడ్డ ఫోన్ సంభాషణ ఆడియో లీక్, వెలుగులోకి కొత్త విషయాలు

Advertisement

గతంలో ఒకసారి విజయ్‌ ప్రసాద్ ఇళ్లు, కార్యాలయాలపై సోదాలు జరిగిన విషయం తెల్సిందే. ఈ తనిఖీల్లో భాగంగా ప్రసాద్ బ్యాంక్ ఖాతాలు, ల్యాప్‌టాప్‌లు, కీలక పత్రాలను ఈడీ బృందాలు తనిఖీ చేస్తున్నాయి. 2009లో ఎమ్మెల్యేగా గెలుపొందిన మళ్ల విజయప్రసాద్, 2019 ఎన్నికల్లో విశాఖపట్నం వెస్ట్ నుంచి వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. 2021లో ఏపీ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. ఇప్పుడు వెస్ట్ నియోజకవర్గ సమన్వయకర్తగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

Related News

ఊరేగింపు రూట్ మార్చాలన్న పోలీసులు.. భగ్గుమన్న హిందూ సంఘాలు!

చంద్రబాబు సభపై అమర్నాథ్ సెటైర్లు.. విశాఖలో అసలు సమస్య ఇదేనంటూ ఫైర్!

తిరుమల లడ్డులో అసలు నెయ్యే లేదా? మరి జంతువుల కొవ్వు మాటేంటీ?

తిరుమల లడ్డూ కల్తీపై ఈడీ సంచలన ప్రకటన.. పవన్ కళ్యాణ్‌పై నెటిజన్లు ఫైర్!

విశాఖ ప్రజలకు గుడ్‌న్యూస్.. కీలక నిర్ణయం తీసుకున్న చంద్రబాబు?

టీడీపీ, వైసిపి రెండూ ఆయన తొత్తులే.. వైఎస్ షర్మిలా సంచలన వ్యాఖ్యలు!

2029లో చీపురుపల్లి నుంచే పోటీ.. పుకార్లకు చెక్ పెట్టిన బొత్స సత్యనారాయణ

అనకాపల్లి జిల్లాలో విషాదం.. వేర్వేరు ఘటనల్లో రెండు ప్రేమజంటల ఆత్మహత్య!

Big Stories

Advertisement
×