E-Paper
Advertisement

మంత్రుల పేషీల్లో ‘షాడో’ లీడర్లు.. CCTV కెమెరాల్లో దొరికిపోయిన ‘పైరవీ’ నేతలు!

మంత్రుల పేషీల్లో ‘షాడో’ లీడర్లు.. CCTV కెమెరాల్లో దొరికిపోయిన ‘పైరవీ’ నేతలు!
Advertisement

Minister Offices: స్వేచ్ఛ బ్యూరో: ప్రజా సమస్యలను పక్కనబెట్టి,సచివాలయంలోని మంత్రుల పేషీల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న అధికార పార్టీ నేతలకు ముఖ్యమంత్రి గట్టి షాక్ ఇవ్వనున్నారు. నియోజకవర్గాల్లో ప్రజలతో ఉండాల్సింది పోయి, బదిలీలు, పదవులు, పైరవీలే ధ్యేయంగా సచివాలయంలో మకాం వేస్తున్న నాయకుల జాబితాను తయారు చేయాలని సీఎం కార్యాలయం నుంచి ఇంటెలిజెన్స్ కు ఆదేశాలు వెళ్లినట్లు సమాచారం. దీంతో ఆయా లీడర్ల వివరాలను ఇంటెలిజెన్స్ టీమ్ ప్రిపేర్ చేస్తున్నాయి.

మంత్రుల పై ప్రభుత్వం సీరియస్

Advertisement

‘మినిస్టర్ పేషీలలో షాడోస్ ’ అనే టైటిల్ తో మంగళవారం స్వేచ్ఛ పత్రిక ఓ కథనం ప్రచురించింది. దీన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకొని అన్ని పేషీల వివరాలను తెప్పించుకుంటున్నది. సెక్రటేరియట్ ఇంటెలిజెన్స్ టీమ్స్ మంత్రుల పేషీల్లో పెత్తనం చెలాయించే పార్టీకి చెందిన ముఖ్య నేతల వివరాలను ప్రభుత్వానికి అందజేసినట్లు తెలిసింది. దీంతో ఇటు పార్టీ, ప్రభుత్వంలో ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది. తమపై ఎక్కడ చర్యలు తీసుకుంటారోనని పేషీల్లో మకాం వేసే లీడర్లు ఆందోళన చెందాల్సిన పరిస్థితి ఏర్పడింది.

హెచ్చరించినా మారని తీరు..

Advertisement

​ఇటీవల నిర్వహించిన జూమ్ మీటింగ్‌లో సీఎం పార్టీ నాయకులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నాయకులు ఎల్లప్పుడూ తమ నియోజకవర్గ పరిధిలోని ప్రజ అందుబాటులో ఉండాలని నొక్కి చెప్పారు. అంతేగాక ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు క్షేత్రస్థాయిలో విస్తృత పబ్లిసిటీ కల్పించాలని ఆదేశించారు. పదవులు, కాంట్రాక్టులు, బదిలీల కోసం మంత్రుల పేషీల చుట్టూ తిరిగితే సహించేది లేదని, అలాంటి వారిపై కఠిన చర్యలు ఉంటాయని సీఎం ముందే హెచ్చరించారు. అయినప్పటికీ, కొందరు నేతలు ….పార్టీ, ప్రభుత్వ ఆదేశాలను పక్కనబెట్టి నిత్యం మంత్రుల పేషీల్లో తిరగడంపై సీఎం సీరియస్ గా ఉన్నారు.

ఏం చేస్తున్నారు..?

మంత్రి పేషీ వద్ద ఎవరు ఎక్కువ సమయం గడుపుతున్నారో సీసిటీవీ గ్రౌండ్ ఇంటెలిజెన్స్ ద్వారా సీఎంవో వర్గాలు రిపోర్టును సేకరించాయి. ఏ నాయకుడు ఏ పేషీలో ఎంత సేపు ఉంటున్నారు? ఏం వర్క్ మీద వచ్చారు? ప్రజలకు ఉపయోగపడే వర్కా? సెల్ఫ్​ వర్క్స్ హా? పైరవీలా? ఇలాంటి తదితర అంశాలన్నీ ఇంటెలిజెన్స్ టీమ్స్ మంత్రులు పేషీల నుంచి వివరాలు సేకరిస్తున్నాయి. అంతేగాక మంత్రుల రివ్యూల్లో కుర్చుంటున్న నేతల వివరాలతో పాటు పేషీల్లో పెత్తనం చెలాయించే నేతల వివరాలను కూడా లిస్టు తయారు చేస్తున్నారు.

నాయకులపై సీఎం సీరియస్..

ప్రజా పాలన వేగవంతం కావాల్సిన సమయంలో, ప్రజలతో అనుసంధానం కాకుండా హైదరాబాద్‌లోనే తిష్టవేసిన నాయకులపై సీఎం సీరియస్ యాక్షన్ తీసుకోనున్నట్లు తెలుస్తోంది. క్రమశిక్షణ తప్పే నాయకులకు వచ్చే పదవుల్లో ప్రాధాన్యత తగ్గించడమే కాకుండా, పార్టీ పరంగా కూడా కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు నిర్ణయించారు.

Also Read: ఖమ్మంలో పోలీసుల మెరుపు దాడి.. 324 కిలోల గంజాయి సీజ్!

Tags

Related News

వినాయకుడి దర్శనానికి వెళ్లి వస్తుండగా.. ఇద్దరి ప్రాణాలు గాల్లో

ప్రభుత్వ స్కూల్ పిల్లలకు గుడ్ న్యూస్.. యూనిఫాంలో కొత్త మార్పులు!

కల్వకుంట్ల ఫ్యామిలీ భూములపై రచ్చ.. మధ్యలో రైతుల్ని ఎందుకు లాగుతున్నారు?..ఆది శ్రీనివాస్ ఫైర్

ఢిల్లీ కేంద్రంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాస్టర్ ప్లాన్.. వర్కౌట్ అయ్యేనా..?

తెలంగాణ యువతకు డెల్ సంస్థ బిగ్ ఆఫర్.. అన్నీ ఉచితం!

మూడు రోజుల డెడ్‌లైన్.. జూరాల ప్రాజెక్టు నీటిపై ఎంపీ డీకే అరుణ అల్టిమేటం?

అదనపు కట్నం కోసం కానిస్టేబుల్ వేధింపులు.. ఆత్మహత్య చేసుకున్న యువతి!

సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్.. 45 రోజుల్లో ఆ దరఖాస్తులకు పరిష్కారం..?

Big Stories

Advertisement
×