E-Paper
Advertisement

Jagan on Bhogapuram: భోగాపురం ఎయిర్‌పోర్టుపై క్లారిటీ.. నవ్వుతూ నిజం చెప్పిన జగన్, క్రెడిట్ ఇచ్చేశారు

Jagan on Bhogapuram: భోగాపురం ఎయిర్‌పోర్టుపై క్లారిటీ.. నవ్వుతూ నిజం చెప్పిన జగన్, క్రెడిట్ ఇచ్చేశారు
Advertisement

Jagan on Bhogapuram: ఏపీలో వైసీపీ కొత్త ట్రెండ్ క్రియేట్ చేసిందా? కూటమి ప్రభుత్వం చేస్తున్న పనులను తమ గొప్పగా చెప్పకోవడం మొదలు పెట్టిందా? అధినేత మొదలు.. నేతలు కూడా అదే బాటలో వెళ్తున్నారా?  వారి మాటలు విని ప్రజలు నవ్వుకుంటున్నారా? తాజాగా గురువారం మీడియా ముందుకొచ్చిన జగన్, భోగాపురం ఎయిర్‌పోర్టు గురించి ఏమన్నారు?

భోగాపురం ఎయిర్‌పోర్టుపై జగన్ క్లారిటీ

Advertisement

గురువారం మధ్యాహ్నం భోగాపురం ఎయిర్‌పోర్టుపై నోరు విప్పారు మాజీ సీఎం జగన్. గురువారం తాడేపల్లి మీడియా సమావేశంలో ఈ వ్యవహారం గురించి అనుక్షణం నవ్వుతూ కనిపించారు. ఎయిర్‌పోర్టు విషయంలో క్రెడిట్ చోరీ కోసం సీఎం చంద్రబాబు పడరాని పాట్లు పడుతున్నారని ఆరోపించారు. వాస్తవానికి ఎయిర్‌పోర్టు పేరుతో భూ దోపిడీ ప్లాన్ చేశారని విమర్శించారు.

Advertisement

2014-19 మధ్యకాలంలో తొలుత 10 వేల ఎకరాలు, ఆ తర్వాత 5 వేల ఎకరాలు కావాలంటూ సీఎం చంద్రబాబు చెప్పిన మాటలను గుర్తు చేశారు. చంద్రబాబు చిత్తశుద్ధిని ప్రజలు శంకించారని అన్నారు. ఎయిర్‌పోర్టుకి వ్యతిరేకంగా 139 పిటిషన్ న్యాయస్థానంలో వేశారన్నారు. అప్పటి టీడీపీ ప్రభుత్వంలో ఆ ప్రాజెక్టు టేకాఫ్ కాలేదన్నారు.

నవ్వుతూ నిజాలు చెప్పిన మాజీ సీఎం

వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎయిర్‌పోర్టుకు 2,200 ఎకరాలు, ఏరో సిటీకి 500 ఎకరాలు కేటాయించామన్నారు. ఆ తర్వాత ప్రాజెక్టు నిర్మాణం వేగంగా చేపట్టామన్నారు. అన్ని కేసులను సాల్వు చేసి భూసేకరణ పూర్తి చేశామన్నారు. మూడు గ్రామాల్లో 400 కుటుంబాలను తరలించామన్నారు. వారికి కాలనీలను కట్టించామని గుర్తు చేశారు.

అందుకోసం దాదాపు రూ. 960 కోట్లు భూసేకరణకు ఇచ్చామన్నారు. ఆనాడు సివిల్ ఏవియేషన్స్ మంత్రి అశోక్ గజపతిరాజు ఉన్నప్పటికీ కేంద్రం నుంచి ఎలాంటి క్లియరెన్సు తెచ్చుకోలేకపోయారని, అంతా తాము చేశామని చెప్పే ప్రయత్నం చేశారు. ఇది ముమ్మాటికీ వాస్తవమని అన్నారు. విశాఖలో డిఫెన్సు సంస్థలు ఉన్నాయని, ఎయిర్‌పోర్టు కట్టాలంటే వారి అనుమతి తప్పనిసరని గుర్తు చేశారు.

ALSO READ:  ఈసారి ఏపీ వంతు.. జగన్ మళ్లీ అవే మాటలు

కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి ప్రాజెక్టు కట్టించామన్నారు. తాము లేఖలు ఇవ్వడమేకాదు, రిక్వెస్టులు చేయడంతో ఇదంతా జరిగిందన్నారు. ఎన్ఓసీతోపాటు ఎయిర్‌పోర్టు అథారిటీకి సంబంధించి అన్నిశాఖల నుంచి అప్రూవల్ తెచ్చామన్నారు. 2023 మే 3న శంకుస్థాపన చేసినట్టు తెలిపారు జగన్.

ఎయిర్‌పోర్టు నిర్మాణం జరుగుతున్నప్పుడే దానికి సమాంతరంగా సిటీ నుంచి కనెక్టవిటీ కోసం రోడ్డు నిర్మాణానికి ప్లాన్ చేశామన్నారు. ఆనాడు కేంద్రమంత్రి గడ్కరీ చెప్పిన వీడియో ప్లే చేశారు. 2026 జనవరిలో తొలి విమానం ల్యాండ్ అవుతుందని ఆ రోజు తాను చెప్పానని, అదే సమయానికి జరిగిందన్నారు. ఏరో సిటీని తన ఖాతాలో వేసేసుకున్నారు మాజీ సీఎం.. దటీజ్ జగన్.

Related News

ఏపీలో తీవ్ర విషాదం.. అమలాపురం మాజీ ఎంపీ బుచ్చిబాబు కన్నుమూత!

తెలుగుదేశం పార్టీ రెండో జాబితా విడుదల.. ఇందులోను మహిళలదే హవా!

పులివెందులలో హైటెన్షన్.. నామినేషన్ కేంద్రం వద్ద కాల్పులు జరిపిన పోలీసులు!

సాలూరు జనసేనలో భగ్గుమన్న చైర్మన్ టికెట్ వివాదం.. కేడర్ తీవ్ర ఆగ్రహం!

రాజంపేటలో ఉద్రిక్తత.. వైసీపీ ఎమ్మెల్యే అమర్‌నాథ్ రెడ్డి ఇంటిపై దాడి!

ఏపీలో స్థానిక ఎన్నికల ఘర్షణలు.. వైఎస్ షర్మిల సంచలన కామెంట్స్!

జనసేన మున్సిపల్ అభ్యర్ధుల తొలి జాబితా విడుదల.. విజయవాడ బరిలో వంగవీటి రాధాకృష్ణ

పల్నాడులో హైటెన్షన్‌.. వైసీపీ కీలక నేతల హౌస్‌ అరెస్ట్‌.. ఆంక్షలపై రాజకీయ దుమారం!

Big Stories

Advertisement
×