BigTV English

4 Months Baby World Record: 4 నెలల బుడ్డదాని అద్భుత ప్రతిభ.. నోబుల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు!

4 Months Baby World Record: 4 నెలల బుడ్డదాని అద్భుత ప్రతిభ.. నోబుల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు!
Local news andhra Pradesh

Four Months Old Baby Set a World Record(Local news andhra Pradesh): చాలా మంది తమ అద్వితీయ విన్యాసాలతో రికార్డులు సృష్టిస్తారు. అందుకోసం ఎంతో శ్రమిస్తారు. ఎన్నో సంవత్సరాలు కష్టపడతారు. అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. గిన్నీసు రికార్డుల్లో చోటు సాధిస్తారు. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డుల్లో చోటు సంపాదిస్తారు. అలాంటి పుట్టిన 4 నెలలకే ఓ చిన్నారి అద్భుతమే చేసింది. నోబుల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకుంది.


ఆంధ్రప్రదేశ్‌లోని నందిగామకు చెందిన నాలుగు నెలల పాప కైవల్య అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇటీవల కైవల్య పేరు నోబుల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో నమోదైంది. ఈ చిన్నారి కూరగాయలు, జంతువులు, పక్షుల చిత్రాలు వరకు మొత్తం 120 విభిన్న విషయాలను గుర్తించుకో గలుగుతోంది.

ఆ చిన్నారి అద్భుతమైన ప్రతిభ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అభ్యాస సామర్థ్యం, ప్రతిభ అబ్బుర పరుస్తోంది. కైవల్యలో ఈ ప్రత్యేక సామర్థ్యాన్ని ఆమె తల్లి హేమ మొదట గమనించారు. కైవల్య ప్రతిభను తెలుపుతూ ఆమె తల్లి ఓ వీడియో తీశారు. ఈ వీడియోను నోబుల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌కు పంపించారు. కైవల్య ఈ ప్రత్యేక ప్రతిభను నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ బృందం గుర్తించింది.


Read More: మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే యూటర్న్.. మళ్లీ వైసీపీలో చేరిక..

అద్భుతమైన జ్ఞాపకశక్తి, విషయాలను గుర్తించే సామర్థ్యం ప్రశంసిస్తూ సర్టిఫికేట్ ఇచ్చింది. దీంతో కైవల్య ఇంత చిన్న వయస్సులో ప్రపంచ రికార్డు క్రియేట్ చేసింది. ఈ ప్రపంచ రికార్డు 2024 ఫిబ్రవరి 3న నమోదైంది. 100కుపైగా ఫ్లాష్‌కార్డ్‌లను గుర్తించిన ప్రపంచంలోనే తొలి పాపగా నాలుగు నెలల కైవల్య రికార్డు సృష్టించింది.

Tags

Related News

Araku Coffee: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అరకులో ఇకపై అందరూ లక్షాధికారులే!

Pawan Kalyan project: పవన్ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం.. కోట్లల్లో ఖర్చు.. ఎందుకంటే?

Railways: రైల్వే ప్రాజెక్టులపై దృష్టి.. అవన్నీ జరిగితే ఏపీకి తిరుగుండదు

Pulivendula Politics: పులివెందుల రాజకీయాలు.. 30 ఏళ్లలో రెండోసారి, ఓటర్లు ఫుల్‌ఖుషీ

Pawan Kalyan: రూటు మార్చిన పవన్.. నిన్న మామిడి.. నేడు చీరలు, రేపు?

AP Free Bus Scheme: ఏపీలో ఫ్రీ బస్ స్కీమ్.. ఆ బస్సు లెక్కితే ఉచిత ప్రయాణం ఉండదు

Big Stories

×