BigTV English

Alla Ramakrishna Reddy: మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే యూటర్న్.. మళ్లీ వైసీపీలో చేరిక..

Alla Ramakrishna Reddy: మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే యూటర్న్.. మళ్లీ వైసీపీలో చేరిక..
Alla Ramakrishna Reddy

Alla Ramakrishna Reddy Joins YCP(AP political news): మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి యూటర్న్ తీసుకున్నారు. మళ్లీ తిరిగి వైసీపీలోకి చేరారు. సీఎం జగన్‌ .. ఆర్కేకు వైసీపీ కండువా కప్పారు.


మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మళ్లీ సొంతగూటికి చేరారు. ఈ క్రమంలోనే మంగళవారం ఆయన సోదరుడు ఎంపీ అయోధ్య రామిరెడ్డితో కలిసి సీఎం వైఎస్ జగన్‌ తో భేటీ అయ్యారు. సోమవారం రాత్రి ఆర్కేతో వైసీపీ సీనియర్ నేత ఎంపీ విజయసాయిరెడ్డి మంతనాలు చేశారు. పార్టీలోకి తిరిగి రావాలని కోరారు. ఇద్దరు నేతల మధ్య చర్చలు ఫలించాయి. ఆర్కే మళ్లీ వైసీపీ కండువా కప్పుకునేందుకు అంగీకారం తెలిపారు.

మంగళగిరి నియోజకవర్గంలో వరసగా రెండుసార్లు ఆర్కే విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో స్వల్ప తేడాతో గెలిచారు. 2019లో మాత్రం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ను ఓడించారు. మూడోసారి విజయంతో హ్యాట్రిక్ కొట్టాలని భావించిన ఆర్కేకు కొన్నిరోజుల క్రితం జగన్ షాకిచ్చారు. 2019 ఎన్నికల సమయంలో ఆర్కేను గెలిపిస్తే మంత్రిని చేస్తానని జగన్ ప్రకటించారు. కానీ మంత్రి పదవి ఇవ్వలేదు. జగన్ కేబినెట్ 1.O, కేబినెట్ 2.Oలో ఆర్కేకు స్థానం దక్కలేదు. చివరి ఎమ్మెల్యే టిక్కెట్ కు ఎసరు పెట్టడంతో ఆయన పార్టీని వీడారు.


Read More: కాక రేపుతున్న కృష్ణాజిల్లా రాజకీయం.. గుడివాడలో వైసీపీ టికెట్ ఎవరికి ?

మంగళగిరి నియోజకవర్గ ఇన్ ఛార్జ్ గా గంజి చిరంజీవిని జగన్ కొంతకాలం క్రితం నియమించారు. ఈ క్రమంలో ఆర్కే పార్డీని వీడారు. అప్పుడు ఆయన షర్మిల వెంటే నడుస్తానని ప్రకటించారు. చెప్పినట్లుగా షర్మిల తన కుమారుడి వివాహానికి సీఎం వైఎస్ జగన్ ను ఆహ్వానించడానికి వెళ్లినప్పుడు ఆర్కే అక్కడ వెళ్లారు. ఆ తర్వాత కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇప్పుడు వైసీపీ పెద్దల రంగంలోకి దిగి ఆర్కేను తిరిగి పార్టీలోకి తీసుకొచ్చేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించాయి.

మంగళగిరి నియోజకవర్గంలో లోకేశ్ ను ఓడించడమే లక్ష్యంగా వైసీపీ పెద్దలు పావులు కదుపుతున్నారు. ఆర్కే మళ్లీ పార్టీలో చేరడంతో వైసీపీ బలం మరింత పెరుగుతుందని భావిస్తున్నారు.

Tags

Related News

AP Heavy Rains: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏపీకి అతి భారీ వర్ష సూచన.. రేపు ఈ జిల్లాల్లో

YS Jagan: మీది రెడ్ బుక్ అయితే.. మాది డిజిటిల్ బుక్, కథ వేరే ఉంటది.. జగన్ సంచలన వ్యాఖ్యలు

Yellow Shirt: అసలైన పసుపు సైనికుడు.. కూతురు పెళ్లిలో కూడా పసుపు చొక్కానే

Roja Hot Comments: శుక్రవారం వస్తే జంప్.. జగన్‌పై రోజా సెటైర్లు?

Digital Book: డిజిటల్ బుక్‌తో వైసీపీ వార్నింగ్.. రెడ్ బుక్ విజృంభించే టైమ్ వచ్చిందా?

Mother Killed Son: కళ్లలో కారం, చీరతో ఉరి.. ఎకరం భూమి కోసం కొడుకును చంపిన తల్లి

Jagan: ప్రతిపక్ష హోదా వల్ల లాభం ఏంటి? ఎమ్మెల్యేలకు ప్రశ్నించే హక్కు ఉండదా? జగన్ లాజిక్ ఏంటి?

Tirumala News: భక్తులకు నేరుగా శ్రీవారి దర్శనం, సాయంత్రం తిరుమలకు సీఎం చంద్రబాబు

Big Stories

×