BigTV English

GadiKota DwarakaNath Reddy | కడపలో వైసీపీకి మరో షాక్.. టిడిపి గూటికి విజయసాయి రెడ్డి బావమరిది!

GadiKota DwarakaNath Reddy | ఏపీలో అధికార వైసీపీకి మరో దెబ్బ తగిలింది. వైసీపీ అగ్రనేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి బావమరిది ద్వారకనాథ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు. జగన్మోహన్ రెడ్డి కోసం పదేళ్లుగా శ్రమించినా .. వైసీపీలో తగిన గౌరవం దక్కలేదనే అసంతృప్తితో ఆయన టిడిపి వైపు అడుగులేస్తున్నారు.

GadiKota DwarakaNath Reddy | కడపలో వైసీపీకి మరో షాక్.. టిడిపి గూటికి విజయసాయి రెడ్డి బావమరిది!

GadiKota DwarakaNath Reddy | ఏపీలో అధికార వైసీపీకి మరో దెబ్బ తగిలింది. వైసీపీ అగ్రనేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి(Vijaysai Reddy) బావమరిది ద్వారకనాథ రెడ్డి తెలుగుదేశం పార్టీ(TDP)లో చేరారు. జగన్మోహన్ రెడ్డి కోసం పదేళ్లుగా శ్రమించినా .. వైసీపీలో తగిన గౌరవం దక్కలేదనే అసంతృప్తితో ఆయన టిడిపి కండువా వేసుకున్నారు.


వైసీపీ నియోజక ఇన్‌ఛార్జుల రెండో జాబితా విడుదల అయిన తర్వాతి రోజే ద్వారకనాథ రెడ్డి టిడిపిలోకి చేరడం గమనార్హం.

1994లో కడప లక్కిరెడ్డిపల్లె నియోజకవర్గం టిడిపి ఎమ్మెల్యేగా పనిచేసిన ద్వారకనాధ రెడ్డి ఆ తరువాత 1999 కాంగ్రెస్ పార్టీలో చేరారు. కానీ పోటీ చేసిన ప్రతిసారి ఓడిపోయారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి ఆయన జగన్ వెంటే ఉన్నారు. 2014, 2019 ఏపీ ఎన్నికల కోసం ఆయనకు పార్టీ టికెట్ ఇవ్వలేదు. అప్పటి నుంచి ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు.


ద్వారకనాథ రెడ్డి, ఆయన సోదరుడు గడికోట సురేంద్రనాథ రెడ్డి, సోదరి హరెమ్మ బుధవారం విజయవాడలో జరిగిన ఓ టిడిపి కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. ద్వారకనాథ రెడ్డి అక్క హరెమ్మ.. దివంగత సినీ నటుడు, టిడిపి నాయకుడు నందమూరి తారకరత్న భార్యకు తల్లి. ద్వారకనాథ రెడ్డి మరోసోదరి విజయసాయి రెడ్డి భార్య.

ద్వారకనాథ రెడ్డి టిడిపి తరపున రాయచోటి ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నారని చర్చ జరుగుతోంది. ద్వారకనాథ రెడ్డి ప్రత్యక్ష రాజకీయాలలో ఇంతకాలం లేనప్పటికీ ఎన్నికలను ప్రభావితం చేయగలే అనుచరగణం ఆయనకు ఉంది.
టిడిపిలోకి చేరిన సందర్భంగా ద్వారకనాథ రెడ్డి మాట్లాడుతూ.. ”జగన్ పాలన మొత్తం అవినీతిమయంగా ఉంది. వైఎస్ఆర్ పాలనకు, జగన్మోహన్ రెడ్డి పాలనకు అసలు పొంతనే లేదు. పలుమార్లు వైసీపీ టికెట్ వస్తుందని ఆశచూపారు. కనీసం ఏదైనా నామినేటెడ్ పదవి అయినా ఇవ్వకుండా మోసం చేశారు. విజయసాయి రెడ్డికి కూడా ఇప్పుడు అక్కడ ప్రాధాన్యం లేదు. ఆయన కూడా వైసీపీ వీడే పరిస్థితి రావొచ్చు. కుటుంబంతో సహా టిడిపిలోకి చేరేందుకు వచ్చాను,” అని అన్నారు.

Tags

Related News

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Big Stories

×