BigTV English

Gannavaram News : టీడీపీలోకి యార్లగడ్డ..? ముహూర్తం ఫిక్స్..!

Gannavaram News : టీడీపీలోకి యార్లగడ్డ..? ముహూర్తం ఫిక్స్..!
TDP latest news telugu


TDP latest news telugu(Andhra Pradesh political news today) : గన్నవరం రాజకీయం క్లైమాక్స్‌ కి చేరింది. వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావ్‌ పార్టీ మారతారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈనెల 19న లోకేష్ పాదయాత్రలో టీడీపీ కండువా కప్పుకుంటారని భావిస్తున్నారు. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో విభేదాల కారణంగా యార్లగడ్డ వెంకట్రావు పార్టీని వీడబోతున్నారు. ఎన్నికల ఇయర్‌లో నియోజకవర్గాల్లో నేతల మధ్య సయోధ్య కుదిర్చే బాధ్యతలను వైసీపీలో సజ్జల రామకృష్ణారెడ్డి చూస్తున్నారు. వల్లభనేని వంశీ – యార్లగడ్డ వెంకట్రావు మధ్య పంచాయితీ చేసేందుకు ఆయన కాల్ చేయగా యార్లగడ్డ లైట్ తీసుకున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి పిలుపు వచ్చినా బేఖాతరు చేశారు. దీంతో ఆయన టీడీపీలో చేరతారని జరుగుతున్న ప్రచారానికి బలం చేకూరింది. ఈ క్రమంలో తన అనుచరులతో సమావేశమయ్యారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు.

మరోవైపు గన్నవరం రాజకీయాలు కొత్త పంథా తొక్కుతున్నాయి. క్రికెట్ బెట్టింగులు, ఎన్నికల్లో గెలుపు ఓటములపై పందాలు కాయడం కామన్. ఏపీలో పందెం రాయుళ్ల మరో అడుగు ముందుకేసి నేతలు పార్టీ మార్పుపై భారీగా బెట్టింగులు కడుతున్నారు. గన్నవరం పాలిటిక్స్ నుంచి ఈ బెట్టింగులు కేంద్రంగా మారుతున్నాయి గన్నవరం లో 2019లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందిన యార్లగడ్డ వెంకట్రావు తెలుగుదేశంలో చేరుతారంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.ఈ నేపథ్యంలో యార్లగడ్డ టీడీపీ తీర్థం పుచ్చుకొనున్నారని కొంతమంది బెట్టింగ్ లు కడుతుంటే.. లేదు యార్లగడ్డ వైసీపీ లోనే ఉంటారంటూ మరికొంతమంది బెట్టింగులు కడుతున్నారు.


2019లో వైసీపీ తరఫున గన్నవరంలో పోటీ చేసి వంశీ మీద తక్కువ ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు యార్లగడ్డ. ఇక ఎన్నికల అనంతరం వైసీపీ అధికారంలోకి రావడంతో వల్లభనేని వంశీ ఆ పార్టీలోకి మారారు. దీంతో యార్లగడ్డ వర్గం రగులుతోంది. 2014లో కూడా వంశీ ఎమ్మెల్యేగా ఉన్నారు. అపుడు టీడీపీ అధికారంలో ఉంది. ఆ టైమ్ లో వంశీ అధికార పార్టీ ఎమ్మెల్యేగా తమను అనేక ఇబ్బందులకు గురి చేశారని యార్లగడ్డ వర్గం అంటోంది.

ఇక ఈ నెల 19 నుంచి లోకేష్ యువగళం పాదయాత్ర కృష్ణా జిల్లాలో ప్రవేశించనుంది. దీంతో లోకేష్ సమక్షంలో పసుపు కండువాను యార్లగడ్డ కప్పుకుంటారు అని తెలుస్తోంది. మరి యార్లగడ్డకు 2024 ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్ టీడీపీ ఇస్తుందా అన్నది చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే టీడీపీ ఈ సీటుని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కు ఇవ్వాలని చూస్తోంది. అలా విజయవాడ తూర్పు నుంచి వంగవీటి రాధాను పోటీకి నిలబెట్టాలని ఆలోచిస్తోంది. ఒక వేళ అలా కాకపోయినా వంశీని దెబ్బ తీసేందుకు పవర్ ఫుల్ లీడర్ కోసం వెతుకుతోంది. మరి 2019లో వంశీపై ఓడిన యార్లగడ్డ 2024లో గెలుస్తారని టీడీపీ భావిస్తే మాత్రం ఆయనకే టికెట్ అంటున్నారు.

Related News

Tirumala News: బుక్కైన జగన్ మామ, టీటీడీ కేసు నమోదు? అసలు ఏం జరిగింది?

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Pulivendula Campaign: ఖైదీల వేషధారణలో ఎన్నికల ప్రచారం.. వైసీపీ పరువు తీసేశారుగా!

Nara Lokesh: ర్యాగింగ్ ఘటనపై లోకేష్ ఘాటు రియాక్షన్

Visakhapatnam 2050: విశాఖ నగరం 2050లో.. ఇలా ఉంటుందా? అసలు ఊహించలేం కదా!

Araku Coffee: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అరకులో ఇకపై అందరూ లక్షాధికారులే!

Big Stories

×