BigTV English

AP News: మరో వ్యక్తితో క్లోజ్‌గా ఉన్నదని అనుమానం.. కలిసి ఊరెళ్లుతుండగా అడ్డగించి అత్యాచారం

AP News: మరో వ్యక్తితో క్లోజ్‌గా ఉన్నదని అనుమానం.. కలిసి ఊరెళ్లుతుండగా అడ్డగించి అత్యాచారం

Crime News: అమ్మాయి, అబ్బాయి మధ్య స్నేహం సహజం. అలాగే.. అనకాపల్లికి చెందిన 19 ఏళ్ల యువతితో సాయి కుమార్ ఫ్రెండ్షిప్ చేశాడు. కొంతకాలంగా వారి మధ్య పరిచయం కొనసాగింది. అయితే, ఆ యువతి, ఆమె స్నేహితురాలు మరో వ్యక్తితో సన్నిహితంగా ఉంటున్నదని సాయి కుమార్ అనుమానించాడు. దీన్ని సాయికుమార్ సహించలేకపోయాడు. ఆ యువతిపై కోపాన్ని పెంచుకున్నాడు. అందులో నుంచి మూర్ఖపు ఆలోచనకు దిగాడు.


సాయికుమార్ ఫ్రెండ్, ఆమె స్నేహితురాలు, మరొక యువకుడు కలిసి అనకాపల్లి నుంచి సింహాచలానికి వెళ్లుతున్నట్టు సాయికుమార్‌కు సమాచారం వచ్చింది. అంతే.. సాయి కుమార్ ఇదే అదును అనుకున్నాడు. తనలోని మృగాన్ని బయటికి తెచ్చాడు. సింహాచలం వెళ్లుతున్న ఆ ముగ్గురిని సాయికుమార్, అతని మిత్రులు అడ్డుకున్నారు. అనకాపల్లిలోని బొజ్జన్న కొండుకు ఆ యువతిని తీసుకెళ్లారు. అక్కడే సాయికుమార్, అతని మిత్రులు ఆ యువతిని బెదిరించారు.

ఇదేమి అర్థంకాని ఆ యువతి భయపడి ఏలేలు కాలువలోకి దూకింది. ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. దీంతో సాయికుమార్, అతని మిత్రులు వెంటనే ఆమెను కాపాడారు. సమీపంలోని హ్యాపీ హౌస్‌కు తీసుకెళ్లారు. బాధిత యువతి వాష్ రూమ్‌లో బట్టలు ఆరబెట్టుకుంటూ ఉన్నది. ఆ సమయంలో సాయికుమార్ అందులోకి చొరబడ్డాడు. యువతిని అత్యాచారం చేశాడు.


Also Read: భాగ్యలక్ష్మి టెంపుల్ ముందు బీఆర్ఎస్‌పై ఘాటు వ్యాఖ్యలు చేసిన మంత్రి కోమటి రెడ్డి

సాయికుమార్ అత్యాచారం చేయడంతో బాధిత యువతి కుంగిపోయింది. ఏం చేయాలో పాలుపోలేదు. తన మిత్రురాలి ఇంటికి వెళ్లింది. ఇదిలా ఉండగా.. ఇంటికి కూతురు రాకపోవడంతో తల్లిదండ్రులు గాబరా పడ్డారు. పోలీసులను ఆశ్రయించారు. పోలీసు స్టేషన్‌ నుంచి ఇంటికి వచ్చే సరికి కూతురు ఇంటికి వచ్చింది. దీంతో వెంటనే కూతురిని సమీపించి ఏమైందని వివరాలు అడిగారు. కూతురు భోరుమంది. జరిగిన పరిణామాలన్నింటిని పూస గుచ్చినట్టు చెప్పుకొచ్చింది. దీంతో పేరెంట్స్ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగంలోకి దిగి సాయికుమార్‌తోపాటు మరో ఐదుగురిని అరెస్టు చేశారు. కిడ్నాప్, అత్యాచరం నేరాల కింద పోలీసులు కేసు ఫైల్ చేశారు. అనకాపల్లిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×