Big Stories

Guntur : ఇప్పటంలో వైఎస్ విగ్రహం తొలగింపు..

Guntur : గుంటూరు జిల్లా ఇప్పటం గ్రామం ఏపీ రాజకీయాలకు కేంద్రబిందువైంది. జనసేన సభకు స్థలం ఇచ్చారన్న అక్కసుతో వైసీపీ ప్రభుత్వం అక్రమంగా ఇళ్లు కూల్చారంటూ ఆపార్టీ అధినేత పవన్ కల్యాణ్ శనివారం బాధితులను పరామర్శించిన విషయం విధితమే.

- Advertisement -

అయితే రహదారిపై ఉన్న విగ్రహాలు అడ్డురాలేదు కానీ పేదల ఇళ్ళే అడ్డొచ్చాయా? వాటిని ఎందుకు కూల్చలేదని పవన్ కల్యాణ్ ఈసందర్భంగా ప్రభుత్వాన్ని నిలదీశారు. దీనిపై సోషల్ మీడియాలోనూ పెద్దఎత్తున దుమారం చెలరేగింది. పవన్ కామెంట్స్‌కు స్పందించిన వైసీపీ సర్కారు సోమవారం ఆ విగ్రహాల తొలగింపునకు రంగంలోకి దిగింది. భారీ క్రేన్లను ఇప్పటం గ్రామానికి రప్పించి దివంగత నేత వైఎస్ విగ్రహంతోపాటు గాంధీజీ, నెహ్రూ విగ్రహాలను కూడా తొలగించింది.

- Advertisement -

ఇప్పటం గ్రామానికి వెళ్లే ఆర్ అండ్ బీ రహదారి 80 అడుగుల వెడల్పు ఉండాల్సిందిపోయి ఆక్రమణల కారణంగా 40-50 అడుగులకే కుదించుకు పోయిందని మున్సిపల్ అధికారులు పేర్కొన్నారు. చట్టప్రకారం నోటీసులు జారీ చేసి బుధ,గురువారాల్లో ఆక్రమణలు తొలగించినట్టు చెప్పారు. 53 ఆక్రమణలను తాము గుర్తించగా ,జనసేనకు చెందిన ఒకరు మాత్రమే హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారని వారు వెల్లడించారు. మిగిలిన వాటిని మాత్రమే తాము తొలగించామని, ఇళ్లు కూల్చలేదని తెలిపారు. రహదారిని ఆక్రమిస్తున్న గోడలను, దుకాణాలను మాత్రమే తొలగించామని వారు తెలిపారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News