Big Stories

TaTa Nagar Smuggling : పాములను అక్రమ రవాణా చేస్తున్న మహిళ అరెస్ట్..

TATA Nagar Smuggling : ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 28 పాములు. 12 ఊసరవెల్లులు, 9 పెట్టెల కీటకాలు, ఒక పెట్టెలో స్పైడర్స్.. ఇదేదో.. జూ.. గురించి చెబుతున్నది కాదు. వీటిని అక్రమంగా రవాణా చేస్తూ దేవిచంద్ర అనే మహిళా ఆర్పీఎఫ్ పోలీసులకు చిక్కింది.

- Advertisement -

జంషెడ్ పూర్ లోని టాటానగర్ రైల్వే స్టేషన్ లో సదరు మహిళ బ్యాగ్ ను పోలీసులు తనిఖీ చేశారు. అందులో ఉన్న వాటిని చూసి ఒక్కసారిగా కంగుతిన్నారు. పాములు, కీటకాలు, ఊసరవెల్లులను స్మగ్లింగ్ చేస్తున్నట్టు గుర్తించి ఆమెను స్టేషన్ కు తరలించారు. ఓ మహిళ బ్యాగ్ ను ఓపెన్ చేయడంతో అందులోంచి పాములు, పలురకాల కీటకాలు బయటపడ్డాయి.

- Advertisement -

వెంటనే పోలీసులు స్నేక్ క్యాచర్స్ కు సమాచారం అందించారు. వాళ్లు వచ్చి బ్యాగులోని మిగతావాటిని చూసేసరికి అందులోని 8 ఊసరవెల్లులు, ఒక పాము చనిపోయి ఉంది. సదరు మహిళపై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. ఆమె స్వస్థలం పుణె అని పోలీసులు తెలిపారు. నీలాంచల్ ఎక్స్ ప్రెస్ జనరల్ బోగీ ఆ మహిళ ప్రయాణించిందంటున్నారు

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News