YV Subba Reddy Comments on CM Chandrababu: తిరుమల ప్రసాదంపై సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. గత వైసీపీ ప్రభుత్వం తిరుపతి లడ్డూలో జంతువుల కొవ్వు ఉపయోగించారని వ్యాఖ్యలు చేయడం రాష్ట్రంలో సంచలనంగా మారింది. ప్రస్తుతం ఈ ఆరోపణలు రాష్ట్రాన్ని కుదిపేస్తున్నాయి. తాజాగా, ఈ వ్యాఖ్యలపై టీటీడీ మాజీ చైర్మన్, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కౌంటర్ ఇచ్చారు.
దివ్య క్షేత్రం తిరుమల పవిత్రతను, వందల కోట్లమంది హిందువుల విశ్వాసాలను చంద్రబాబు దారుణంగా దెబ్బతీసి పెద్ద పాపమే చేశాడని పేర్కొన్నారు. తిరుమల ప్రసాదంపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు అత్యంత దుర్మార్గమని, మనిషి పుట్టుక పుట్టినవారెవ్వరూ కూడా ఇలాంటి మాటలు మాట్లాడరన్నారు. తిరుమల ప్రసాదరంపై ఇప్పటివరకు ఇలాంటి ఆరోపణలు ఎవరూ చేయలేదని మండిపడ్డారు.
రాజకీయం లబ్ధికోసం ఎంతటి నీచానికైనా చంద్రబాబు వెనకాడరని మరోసారి నిరూపించారని సుబ్బారెడ్డి ఆరోపించారు. భక్తుల విశ్వాసాన్ని బలపరిచేందుకు తిరుమల ప్రసాదం విషయంలో నా కుటుంబంతో కలిసి సాక్షిగా ప్రమాణానికి సిద్ధంగా ఉన్నామని, చంద్రబాబు కూడా తన కుటుంబంతో ప్రమాణానికి సిద్ధమా? అని సవాల్ విసిరారు.
రాజస్థాన్ ఫతేపూర్‌లోని దేశీ ఆవుల నెయ్యితోనే ప్రసాదాలు తయారు చేశారని సుబ్బారెడ్డి అన్నారు. చంద్రబాబు మతి భ్రమించి మాట్లాడారా.. కావాలని మాట్లాడారా అన్న చర్చ జరుగుతోందన్నారు. భక్తుల మనోభావాలను చంద్రబాబు దెబ్బతీశారన్నారు. చంద్రబాబు తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోకపోతే చట్టపరంగా, న్యాయపరంగా ముందుకు వెళ్తామన్నారు.
2019 నుంచి 2024 మధ్య క్వాలిటీ చెక్ చేసి నాణ్యత లేదని పదిసార్లు నెయ్యి ట్యాంకర్లు వెనక్కిపంపినట్లు తెలిపారు. కేంద్రంలో, రాష్ట్రంలో మీ ప్రభుత్వాలే ఉన్నాయని, కావాలంటే ల్యాబ్‌కు పంపించాలన్నారు.
రాజకీయ లబ్ధికోసం ఆరోపణలు చేస్తే ఆ భగవంతుడు క్షమించడని, రాజకీయ ప్రత్యర్థులను దృష్టిలో ఉంచుకొని తిరుమల ప్రసాదాలపై చంద్రబాబు ఆరోపణలు దుర్మార్గమన్నారు. తిరుమలలో అన్నప్రసాదాల తయారీ విషయంలో, భగవంతుడి పేరుమీద ఆరోపణలు చేయడం బాబుకు కొత్తేమీ కాదన్నారు. గతంలో కూడా ఆరోపణలు చేస్తే దేవుడు శిక్షించాడన్నారు
Also Read: తిరుమల లడ్డూపై వివాదం.. వేంకటేశ్వరుడికి మచ్చతెచ్చేలా మాజీ సీఎం చేశారా?
ఇదిలా ఉండగా, చంద్రబాబు మంగళగిరిలో తిరుమల లడ్డూపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం తిరుమల లడ్డూ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించదన్నారు. అఖరికి తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వును వాడినట్లు చెప్పారు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ఆవు పాలతో తయారు చేసిన నందిని నెయ్యితో తయారు చేయిస్తున్నామన్నారు.
రాజకీయం లబ్ధికోసం ఎంతటి నీచానికైనా చంద్రబాబు వెనుకాడడని మరోమారు నిరూపితం అయ్యింది. భక్తుల విశ్వాసాన్ని బలపరిచేందుకు తిరుమల ప్రసాదం విషయంలో నేను, నా కుటుంబం ఆ దేవ దేవుని సాక్షిగా ప్రమాణానికి సిద్ధంగా ఉన్నాం. చంద్రబాబుకూడా తన కుటుంబంతో ప్రమాణానికి సిద్ధమా?2/2
— Y V Subba Reddy (@yvsubbareddymp) September 18, 2024