AP Excise Suraksha App: ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో నకిలీ మద్యం, తయారీలో విక్రయాలపై దృష్టి సారించింది. తాజాగా నకిలీ మద్యానికి చెక్ పెట్టేందుకు చర్యలు చేపట్టింది కూటమి సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా ప్రభుత్వం ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ (AP Excise Suraksha App)పేరుతో కొత్త యాప్‌ను ప్రారంభించింది.
ఈ మధ్య కాలంలో రాష్ట్రవ్యాప్తంగా నకిలీ మద్యం తయారీ, అక్రమ రవాణా, కల్తీ విక్రయాలు ఘటనలు పెరిగిపోయాయి. ఈ పరిస్థితిని పరిగణనలోకి తీసుకున్న ఏపీ ప్రభుత్వం, నకిలీ మద్యం దందాకు తావు ఇవ్వకూడదని కీలక నిర్ణయించింది. ఈ క్రమంలో ఆధునిక సాంకేతికతను వినియోగించి ఎక్సైజ్ సురక్ష యాప్ ను రూపకల్పన చేసింది.
ఈ యాప్ ద్వారా ప్రతి మద్యం బాటిల్‌పై ఉండే QR కోడ్‌ను స్కాన్ చేయడం తప్పనిసరి. వినియోగదారు స్కాన్ చేసిన వెంటనే ఆ బాటిల్ ఎక్కడ తయారైంది, ఎప్పుడు పంపిణీ అయింది, ఏ లైసెన్స్డ్ కంపెనీ ఉత్పత్తి చేసిందనే సమాచారాన్ని చూపిస్తుంది. బాటిల్ నకిలీ అయితే వెంటనే హెచ్చరిక సందేశం యూజర్ ఫోన్‌లో కనిపిస్తుంది.
యాప్ ఎలా వాడాలంటే.. Google Play Store లేదా Apple App Store లో AP Excise Suraksha అని సెర్చ్ చేసి యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి.
యాప్ ఓపెన్ చేసిన తర్వాత QR Code Scan ఆప్షన్ ద్వారా బాటిల్‌పై ఉన్న కోడ్‌ను స్కాన్ చేయాలి.
యాప్ వెంటనే బాటిల్‌కు సంబంధించిన పూర్తి వివరాలను చూపిస్తుంది.
ఏదైనా అనుమానం ఉన్నప్పుడు “Report Fake Liquor” ఆప్షన్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు.
ఈ విధంగా, ప్రజలు తాము కొనుగోలు చేసే మద్యం నాణ్యతను స్వయంగా తనిఖీ చేసుకునే వీలుంది.
ఏపీ సర్కార్ అన్ని జిల్లా ఎక్సైజ్ అధికారులకు.. స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ప్రతి బార్, వైన్ షాప్, క్లబ్ ప్రాంగణాల్లో QR స్కాన్ చేయండి.. నకిలీ మద్యాన్ని నిరోధించండి అనే బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించించినట్లు తెలుస్తోంది. ప్రజల్లో యాప్ వాడకం గురించి అవగాహన కలిగించేందుకు పోస్టర్లు, డిజిటల్ క్యాంపెయిన్లు, సోషల్ మీడియా ప్రచారాలు నిర్వహించాలనే ఆదేశాలు ఇచ్చింది.
Also Read: అక్రమంగా మద్యం అమ్ముతున్న.. ఇద్దరు మహిళలు అరెస్ట్
అంతేకాక, మద్యం విక్రయ సంస్థలు, పంపిణీ దారులు, డీలర్లు కూడా యాప్ విధానాన్ని తప్పనిసరిగా అనుసరించాలని హెచ్చరికలు జారీ చేసింది. ఎవరైనా నకిలీ మద్యం విక్రయిస్తే, కఠిన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ శాఖ స్పష్టం చేసింది.