Mahieka Sharma: హార్దిక్ పాండ్యా ( Hardik Pandya) గురించి తెలియని వారంటూ ఎవరూ ఉండరు టీమిండియాలో స్టార్ క్రికెటర్ గా తనకంటూ ప్రత్యేకమైన పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్నాడు. తనదైన ఆటతీరుతో కోట్లాది సంఖ్యలో అభిమానులను సంపాదించుకున్నాడు. క్రికెట్ రంగంలో ఎన్నో అద్భుతాలు సృష్టించి గొప్ప పేరును సంపాదించుకున్నాడు హార్థిక్ పాండ్యా. క్రికెట్ రంగంలో ఎన్నో అద్భుతాలు సృష్టించిన హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితంలో మాత్రం కాస్త నిరాశ ఎదురయింది.
Also Read: IND vs WI: రెండో టెస్ట్ లోనూ విజయం…విండీస్ ను వైట్ వాష్ చేసిన టీమిండియా.. WTCలో మన ర్యాంక్ ఎంతంటే
హార్దిక్ పాండ్యా తన పుట్టినరోజు సందర్భంగా తన కొత్త ప్రియురాలు మహికా శర్మ ( Mahieka Sharma )ను అభిమానులకు పరిచయం చేశాడు. వీరిద్దరూ కలిసి ఒకే కారులో ముంబై ఎయిర్పోర్ట్ కు చేరుకొని ఇద్దరు కలిసి లోపలికి వెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అనంతరం హార్దిక్ పాండ్యా తన ప్రియురాలిని పరిచయం చేస్తూ ఫోటోలను అభిమానులతో ఇన్ స్టా వేదికగా షేర్ చేసుకున్నాడు. దీంతో వీరిద్దరూ తొందరలోనే వివాహం చేసుకోబోతున్నట్లుగా అనేక రకాల వార్తలు వస్తున్నాయి. మరి హార్దిక్ పాండ్యా ఈ విషయం పైన ఏదో ఒక క్లారిటీ ఇస్తే కానీ అసలు విషయం బయటికి రాదు.
హార్దిక్ పాండ్యా తన ప్రియురాలిని పరిచయం చేసిన అనంతరం మహికా శర్మ ప్రెగ్నెంట్ అంటూ ఓ వార్త హాట్ టాపిక్ గా మారుతుంది. పెళ్లి కాకముందే మహికా శర్మ ప్రెగ్నెంట్ అయిందని అందుకే హార్దిక్ పాండ్యా తన ప్రియురాలు ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకున్నాడంటూ ఓ వార్త హాట్ టాపిక్ గా మారుతుంది. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం మహికా శర్మకు సంబంధించిన ఈ విషయం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. హార్దిక్ పాండ్యా మొదటి భార్య నటాషా కూడా వివాహానికి ముందే ప్రెగ్నెంట్ అయింది. వీరు పెళ్లికి ముందే ఓ మగ బిడ్డకు జన్మనిచ్చారు.
అనంతరం వివాహం చేసుకున్నారు వివాహం తర్వాత అది తక్కువ సమయంలోనే ఈ జంట విడిపోయారు. వారి కుమారుడిని మాత్రం ఇద్దరూ చూసుకుంటున్నారు. ఆ కారణం చేతనే హార్దిక్ పాండ్యా తన ప్రియురాలిని పరిచయం చేశాడంటూ కొన్ని రకాల వార్తలు పుట్టుకొస్తున్నాయి. ఇది ఇలా ఉండగా, నటాషాకు విడాకులు ఇచ్చిన తర్వాత దాదాపు ఏడాదిన్నర పాటు బ్యాచిలర్ లైఫ్ ఎంజాయ్ చేశాడు హర్ధిక్ పాండ్యా. నటాషాకు విడాకులు ఇచ్చిన తర్వాత, జాస్మిన్ వాలియాతో రిలేషన్ పెట్టుకున్నట్లు పాండ్యాపై వార్తలు వచ్చాయి. ఇక ఇప్పుడు మహికా శర్మను పరిచయం చేశాడు హర్ధిక్ పాండ్యా.
Did Hardik Pandya just confirm that he's dating Mahieka Sharma?
What do you think?? Comment below 👇🏻
.
.#HardikPandya #MahiekaSharma #RumouredCouples #IsItOfficial #HardikMahieka #IF #IndiaForums pic.twitter.com/kFQbd6OupT— India Forums (@indiaforums) October 10, 2025