Pakistan – Afghanistan: ఒకప్పుడు మిత్రదేశాలుగా ఉన్న పాకిస్థాన్, ఆఫ్ఘానిస్థాన్ మధ్య ఇప్పుడు పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఆదివారంతో దాడులు ఆగాయనుకున్న సమయంలో ఇప్పుడు మళ్లీ దాడులు మొదలయ్యాయి. ఈ దాడుల్లో పాక్‌కు తీవ్ర నష్టం జరిగినట్టు తెలుస్తోంది. పాక్ ఆర్మీ పోస్టులపై తాలిబన్ల దాడులతో పాక్ ఆర్మీకి భారీ నష్టంతో పాటు.. భారీగా ప్రాణ నష్టం జరిగినట్టు తెలుస్తోంది.
నిజానికి అఫ్ఘాన్ విదేశాంగ మంత్రి భారత పర్యటనలో ఉన్న సమయంలో అఫ్ఘాన్ రాజధాని కాబూల్‌పై ఎయిర్‌స్ట్రైక్స్ నిర్వహించింది పాకిస్థాన్. అప్పటి నుంచి ఈ దాడులు కొనసాగుతున్నాయి. పాక్ జరిపిన దాడులకు ప్రతీకారంగా సరిహద్దుల్లోని పాక్ పోస్టులపై దాడులు ప్రారంభించింది. దీంతో ఇరు దేశాలకు భారీగానే నష్టం జరిగిందని చెప్పాలి. అయితే ఖతార్, సౌదీ అరేబియా జోక్యంతో కాల్పులు ఆగాయి. కానీ నిన్న అర్ధరాత్రి నుంచి మళ్లీ దాడులు మొదలయ్యాయి. పాకిస్థాన్ మొదట తమ పోస్టులపై దాడులు చేసిందని ఆరోపించింది అఫ్ఘానిస్థాన్. ఈ దాడుల్లో అమాయకులైన 15 మంది అఫ్ఘాన్ ప్రజలు మరణించారని తెలిపింది.
Afghan Taliban claims they used drones to target Pakistani border outposts. Dozens of Pakistani soldiers have been killed or are missing as of now. Deadliest clashes between Pakistan and Afghanistan in years. pic.twitter.com/Ig4raLRnVl
— Aditya Raj Kaul (@AdityaRajKaul) October 15, 2025
ఈ దాడులకు ప్రతీకారంగానే పాక్ ఆర్మీ పోస్టులను లక్ష్యంగా చేసుకున్నామని తెలిపింది. పాక్ ఆర్మీ పోస్టుపై డ్రోన్ దాడి చేశామని ప్రకటించింది. అంతేకాదు తమ దాడుల్లో పాక్ ఆర్మీ పోస్టులు ధ్వంసం అవ్వడమే గాకుండా.. భారీగా పాక్ సైనికులను మట్టుపెట్టామని తెలిపింది. పాక్ ఆర్మీ ఆయుధాలతో పాటు ట్యాంక్‌లను స్వాధీనం చేసుకున్నామంది. కానీ పాకిస్థాన్ మాత్రం డిఫరెంట్ స్టోరీ చెబుతోంది. తమ పోస్టులపై తాలిబన్లు దాడులు జరిపారంది. ఈ దాడుల్లో పాక్ పారా మిలటరీ కమాండోలు మృతి చెందారంటోంది.
ALSO READ: Visakha Crime: విశాఖలో దారుణ హత్య.. నడిరోడ్డుపై అందరు చూస్తుండగానే చంపేశారు
మొత్తానికైతే ఇరు దేశాల మధ్య ప్రస్తుతం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే అఫ్ఘాన్‌లో పర్యటించాల్సి ఉన్న పాక్ రక్షణమంత్రి, ఐఎస్ఐ చీఫ్ పర్యటన రద్దైంది. వారి వీసాలకు అస్సలు అనుమతి ఇవ్వడం లేదు అఫ్ఘాన్‌లోని తాలిబన్ ప్రభుత్వం. ఇప్పటికే పరిస్థితి చేయి దాటిపోవడంతో మరోసారి ఖతార్, సౌదీ అరేబియాను ఆశ్రయించింది పాకిస్థాన్. ప్రస్తుతం సోషల్ మీడియాలో కాబూల్‌పై పాకిస్థాన్ ఎయిర్‌స్ట్రైక్ నిర్వహించిందన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారాన్ని ఖండించారు తాలిబన్లు. ఆ ప్రాంతంలో ఓ ట్యాంకర్‌కు మంటలు అంటుకొని పేలిపోయిందని.. ఆ వీడియోను చూపిస్తూ తాము ఎయిర్‌స్ట్రైక్స్ నిర్వహించిందని తప్పుడు ప్రచారం చేసుకుంటున్నారని తాలిబన్ ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు.