BigTV English

Narayana : మాజీ మంత్రి నారాయణకు షాక్ .. తమ్ముడి భార్య పోలీసులకు ఫిర్యాదు..

Narayana : మాజీ మంత్రి నారాయణకు షాక్ .. తమ్ముడి భార్య పోలీసులకు ఫిర్యాదు..

Narayana : మాజీ మంత్రి నారాయణ తమ్ముడి భార్య వివాదం.. కొత్త టర్న్ తీసుకుంది. ఈ వ్యవహారంలో రోజుకో ట్విస్ట్ చోటు చేసుకుంటోంది. తాజాగా నారాయణ తమ్ముడు సుబ్రహ్మణ్యం భార్య కృష్ణప్రియ హైదరాబాద్ రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు. తనను నారాయణ వేధింపులకు గురి చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు.


నారాయణ ఒక డేగలా తనపై కన్నేశారని.. పిట్టను ఎత్తుకెళ్లినట్టుగా తన పరిస్థితి ఉందంటూ చెప్పుకొచ్చారు ఆమె. నారాయణ వల్ల తాను పడుతున్న ఇబ్బందులు వివరించారు. ఇటీవల నారాయణపై కృష్ణప్రియ సంచలన ఆరోపణలు చేశారు. అర్ధరాత్రి తనను టార్చర్‌ పెడుతున్నారని ఇన్‌స్ట్రాగామ్‌ వేదికగా కన్నీటి పర్యంతం అయ్యారు.

ఇన్‌స్ట్రాగామ్‌లో కృష్ణప్రియ రిలీజ్‌ చేసిన వీడియోపై స్పందించారు ఆమె భర్త సుబ్రహ్మణ్యం. తన భార్య మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నారని తెలిపారు. మానసిక ఒత్తిడితోనే ఏవేవో వీడియోలు చేస్తుందన్నారు. సుబ్రహ్మణ్యం మాట్లాడిన కొన్ని గంటల వ్యవధిలోనే కృష్ణప్రియ రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం సంచలనం రేపుతోంది. అయితే ఈ వివాదంపై ఇంతవరకు నారాయణ స్పందించలేదు. వివరణ ఇచ్చే ప్రయత్నం చేయలేదు.


Related News

Free Bus: ఉచిత బస్సు.. వైసీపీ విమర్శలను జనం నమ్మేస్తారా?

Tollywood Producers: ఏపీకి చేరిన సినిమా పంచాయితీ.. మంత్రి దుర్గేష్ తో ఫిలిం చాంబర్ నేతల సమావేశం

Anantapur News: ఏపీలో షాకింగ్ ఘటన.. బస్సు ఆపలేదని మహిళ ఆగ్రహం.. డ్రైవర్ చెంప పగలకొట్టింది

Aadudam Andhra Scam: రోజా అసలు ‘ఆట’ మొదలు.. అరెస్టుకు రంగం సిద్ధం, రంగంలోకి సిట్?

Tirumala News: బుక్కైన జగన్ మామ, టీటీడీ కేసు నమోదు, అసలు ఏం జరిగింది?

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Big Stories

×