BigTV English

Krishna : రూ.500 పెట్టిన చిచ్చు.. ఆత్మహత్యకు పాల్పడిన భార్యాభర్తలు..

Krishna : భార్యాభర్తలు మధ్య రూ.500 చిచ్చు పెట్టి ఇద్దరు ఆవేశంతో ఆత్మహత్యలకు పాల్పడేల చేసి ఆ కుటుంబంలో పెను విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటన కృష్ణా జిల్లా గుడివాడలో చోటు చేసుకుంది. వాసవీనగర్‌కు చెందిన కొలుసు రాంబాబు(45) అనే వ్యక్తి ప్రైవేటు ట్రావెల్స్‌లో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. అతని భార్య , కుమారుడు, కుమార్తె ఉన్నారు. కొంత కాలంగా మద్యానికి బానిసయ్యాడు. రూ.500 కావాలని రాంబాబు తన భార్య కనకదుర్గ(40)ను అడిగాడు.

ఈ క్రమంలో వారి మధ్య గొడవ జరిగింది. దీంతో ఆవేశంతో రాంబాబు ఇంట్లో ఉరేసుకున్నాడు. గమనించిన భార్య చుట్టుపక్కల వారి సాయంతో రాంబాబును కిందకు దించారు. కుమారుడు గౌతమ్‌ తండ్రిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాడు. అప్పటికే మృతి చెందాడని వైద్యులు ధ్రువీకరించారు. ఆ విషయాన్ని గౌతమ్‌ తల్లికి ఫోన్‌చేసి చెప్పడు. తన వల్లే భర్త మృతి చెందాడని మనస్తాపానికి గురై ఆమె కూడా ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డింది. కుమారుడు ఇంటికి వచ్చేసరికి కనకదుర్గ ఉరికి వేలాడుతూ కనిపించింది.

ఒకవైపు తండ్రి మృతదేహం, మరోపక్క విగతజీవిగా ఉరికి వేలాడుతున్న తల్లిని చూసిన గౌతమ్‌ తల్లడిల్లిపోయాడు. స్థానికుల సాయంతో ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాడు. ఆమె కూడా మృతి చెందిందని వైద్యులు తెలిపారు. తల్లిదండ్రుల మృతదేహాలు చూసిన అక్కా, తమ్ముళ్ల రోదనలు మిన్నంటాయి.

Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×