E-Paper
Advertisement

Pawan Kalyan: అయోధ్య రామ మందిరానికి పవన్ కల్యాణ్ భారీ విరాళం..!

Pawan Kalyan: అయోధ్య రామ మందిరానికి పవన్ కల్యాణ్ భారీ విరాళం..!
Advertisement

Pawan Kalyan: ప్రస్తుతం ఎక్కడ చూసినా అయోధ్య రాములవారి పేరే వినిపిస్తోంది. ఎప్పుడెప్పుడు రాముల వారిని దర్శించుకుందామా అని అందరూ ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇందులో భాగంగా రేపు శ్రీరాముల వారి విగ్రహ ప్రతిష్ట జరగబోతోంది. ఈ కార్యక్రమానికి దేశం నలుమూలల నుంచి సినీ, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలతో పాటు అధిక సంఖ్యలొ ప్రజలు స్వామివారిని దర్శించుకోనున్నారు.

ఇందుకోసం అన్ని ఏర్పాట్లు జరుగుతుండగా.. ప్రధాని నరేంద్ర మోదీ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. ఈ సందర్భంగా ఆయన నేడు అయోధ్య మొత్తం పర్యటించనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. అయోధ్య రామ మందిరానికి రాజకీయ ప్రముఖులే కాదు.. సినీ ప్రముఖులు కూడా తమ వంతు సాయంగా భారీగా విరాళాలు అందిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ తన వంతు సాయంగా రూ.50 కోట్ల విరాళం ప్రకటించారు.

Advertisement

ఇప్పుడు అదే బాటలో మరో స్టార్ హీరో వచ్చి చేరారు. జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అయోధ్య రామ మందిరానికి రూ.30 లక్షలు ప్రకటించారు. తాజాగా ఆర్‌ఎస్ఎస్ ముఖ్యులు భరత్ జీ కి.. పవన్ రూ.30 లక్షల చెక్‌ను అందజేశారు. దీంతోపాటు పవన్ కల్యాణ్ వ్యక్తిగత సిబ్బంది కూడా రూ.11 వేలు విరాళంగా ఇచ్చారు. అలాగే ప్రజల నుంచి కూడా అయోధ్య రామ మందిరానికి భారీ విరాళాలు అందుతున్నాయి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×