BigTV English

Salaar 2: ‘సలార్-2’లో అఖిల్.. ప్రశాంత్ నీల్ భార్య క్లారిటీ..!

Salaar 2: ‘సలార్-2’లో అఖిల్.. ప్రశాంత్ నీల్ భార్య క్లారిటీ..!

Salaar 2: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా ‘సలార్’. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలై.. కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇందులో శృతి హాసన్ హీరోయిన్‌గా నటించగా.. పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు, శ్రియా రెడ్డి వంటి నటీనటులు కీలకపాత్రలో నటించి మెప్పించారు. హోంబలే ఫిలింస్ వారు నిర్మించారు.


ఇక ఫస్ట్ పార్ట్ ‘సలార్’ టైటిల్‌తో రాగా.. సెకండ్ పార్ట్ ‘శౌర్యంగ పర్వం’ అనే టైటిల్‌తో రాబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. అంతేకాకుండా త్వరలోనే ఈ సెకండ్ పార్ట్ షూటింగ్ కూడా మొదలు కానున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే తాజాగా ‘సలార్’ సక్సెస్ సెలబ్రేషన్స్‌ని మేకర్స్ చాలా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ వేడుకకు ప్రభాస్, ప్రశాంత్ నీల్, పృథ్వీరాజ్ సుకుమారన్‌తో పాటు మరికొంత మంది నటీ నటులు హాజరయ్యారు. అయితే ఇదే వేడుకకు అక్కినేని అఖిల్ హాజరుకావడం ఆశ్చర్యానికి గురిచేసింది. సినిమాలో లేని అఖిల్ సెలబ్రేషన్స్‌లో ఎందుకు పాల్గొన్నాడు అంటూ నెటిజన్లు ఆరా తీస్తున్నారు. ఈ తరుణంలో ఆయనకు సంబంధించి ఓ న్యూస్ తెగ వైరల్ అవుతోంది.

ఈ మూవీ సెకండ్ పార్ట్‌లో అఖిల్ అతిథి పాత్రలో కనిపించబోతున్నాడంటూ వార్తలు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ భార్య లిఖిత రెడ్డి పార్ట్ 2 గురించి ఇన్‌స్టాగ్రామ్‌లో పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. తన తండ్రిని రాజమన్నార్ చంపేశాడనే విషయం దేవాకు తెలుసా..? అని ఓ నెటిజన్ అడగగా.. ఇది మిలియన్ డాలర్ల మంది ప్రశ్న అంటూ లిఖిత తెలిపింది. అంతేగాక ఈ సెకండ్ పార్ట్‌లో అఖిల్ అతిథి పాత్రపై కూడా ఆమె క్లారిటీ ఇచ్చింది. అక్కినేని అఖిల్ అతిథి పాత్రలో నటిస్తున్నాడనే వార్తల్లో ఎలాంటి నిజం లేదు అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.


Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×