BigTV English

IIIT student Suicide: తీవ్ర కలకలం.. ట్రిపుల్ ఐటీ విద్యార్థి ఆత్మహత్య!

IIIT student Suicide: తీవ్ర కలకలం.. ట్రిపుల్ ఐటీ విద్యార్థి ఆత్మహత్య!

IIIT Student Commits Suicide: ట్రిపుల్ ఐటీ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఏపీలో తీవ్ర కలకలం రేగింది. ఇందుకు సంబంధించి ఇతర వార్తా కథనాల ప్రకారం.. కర్నూల్ నగర పరిధిలోని జగన్నాథగట్టుపై ఉన్న ట్రిపుల్ ఐటీ(డీఎం)లో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. విజయనగరం జిల్లాకు చెందిన ఓ విద్యార్థి మూడో ఏడాది ఈసీఈ చదువుతున్నాడు. వేసవి సెలవుల తరువాత ఈ నెల 22 నుంచి ఆ విద్యార్థి తరగతులకు హాజరవుతున్నాడు. ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం ట్రిపుల్ ఐటీ భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోస్టుమార్టం నిమిత్తం కర్నూలు ఆసుపత్రికి విద్యార్థి మృతదేహాన్ని తరలించారు. అనంతరం విద్యార్థి తల్లిదండ్రులకు ట్రిపుల్ ఐటీ యాజమాన్య సమాచారం ఇచ్చింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకున్నారు. అనంతరం పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు.


Related News

Jagan on Pulivendula: జగన్ ప్రెస్ మీట్.. ఓటమిని అంగీకరిస్తున్నారా?

AP Liquor Shops: మందుబాబులకు గుడ్ న్యూస్! కొత్త జీవో పూర్తి వివరాలు..

Pulivendula ZP: పులివెందుల జెడ్పీ.. ఆ ముగ్గురు వ్యూహం, బెడిసికొట్టిన వైసీపీ ప్లాన్

Jagan: కూలిపోతున్న పులివెందుల కోట.. తప్పు ఎక్కడ జరిగింది? టెన్షన్‌లో జగన్‌

Viveka Murder Case: వివేకా హత్యకేసు విచారణలో కీలక మలుపు..

ZPTC Fightings: భగ్గుమన్న పులివెందుల.. మంత్రి ఎదుటే కొట్టుకున్న టీడీపీ, వైసీపీ కార్యకర్తలు

Big Stories

×