BigTV English

Chevireddy Mohith Reddy: బెంగళూరులో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి.. పోలీసుల అదుపులోకి..!

Chevireddy Mohith Reddy: బెంగళూరులో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి.. పోలీసుల అదుపులోకి..!

YCP Leader: వైసీపీ నేత చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరులో తిరుపతి పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నానిపై దాడి కేసులో వైసీపీ నేత చెవిరెడ్డి మోహిత్ రెడ్డి నిందితుడిగా ఉన్నారు. పోలింగ్ సమయంలో తిరుపతి పద్మావతి మహిళా యూనివర్సిటీలో స్ట్రాంగ్ రూమ్‌ను పరిశీలించడానికి వెళ్లినప్పుడు పులివర్తి నానిపై దాడి జరిగింది. ఈ కేసులో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి నిందితుడిగా ఉన్నారు.


పులివర్తి నానిపై దాడి ఘటనపై పోలీసులు హత్యాయత్నం సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసు ఫైల్ కాగానే.. చెవిరెడ్డి మోహిత్ రెడ్డి యాంటిసిపేటరీ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. హైకోర్టులో ఈ పిటిషన్ పై విచారణ మొదలైంది. కాగా, ఇప్పటికీ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పోలీసులకు లొంగిపోలేదు. ముందస్తు బెయిల్ పిటిషన్ పై కోర్టు తీర్పు వెలువడే వరకు పరారీలో ఉండాలనే బహుశా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి బెంగళూరుకు వెళ్లాడు.

Also Read: కేటీఆర్ ఇంకా తాను యువరాజే అనుకుంటున్నాడు: మంత్రి పొన్నం


కాగా, మోహిత్ రెడ్డి బెంగళూరులో ఉన్నట్టు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే తిరుపతి పోలీసులు బెంగళూరుకు వెళ్లారు. అక్కడే చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. చెవిరెడ్డి మోహిత్ రెడ్డి.. చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుడే. ఈ కేసులో మోహిత్ రెడ్డి 37వ నిందితుడిగా ఉన్నాడు.

Related News

Viveka Murder Case: వివేకా హత్యకేసు విచారణలో కీలక మలుపు..

ZPTC Fightings: భగ్గుమన్న పులివెందుల.. మంత్రి ఎదుటే కొట్టుకున్న టీడీపీ, వైసీపీ కార్యకర్తలు

Pulivendula ZPTC: పులివెందుల, ఒంటమిట్టలో ముగిసిన పోలింగ్

AP Free Bus Scheme: ఆగస్ట్ 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం – స్త్రీశక్తి పథకంపై సీఎం సమీక్ష

AP Asha Workers: ఆశా వర్కర్లకు ఏపీ సర్కార్ బంపర్ ఆఫర్.. ఆరోగ్యం, భవిష్యత్తు భరోసా!

Pulivendula ZPTC: ఏపీ పాలిటిక్స్ @ పులివెందుల

Big Stories

×