BigTV English

Jagan – KCR : జగన్‌ను కేసీఆర్ ఆడిస్తున్నారా?

Jagan – KCR : జగన్‌ను కేసీఆర్ ఆడిస్తున్నారా?

Jagan – KCR : ఏపీలో వెన్నుపోటు దినోత్సవం. జూన్ 4న దుమ్మురేగిపోయింది. వైసీపీ బలప్రదర్శనకు దిగింది. ఊరూరా ర్యాలీలు. భారీగా కార్యకర్తలు. పెద్ద స్థాయి నేతలంతా రోడ్డెక్కారు. రోజా చెవిలో పువ్వులు పెట్టుకున్నారు. బొత్సా కుప్పకూలిపోయారు. అంబటి పోలీసులపై రెచ్చిపోయారు. పెద్దిరెడ్డి నేను సైతం అన్నారు. బెంగళూరు ప్యాలెస్‌లో కూర్చొని.. టీవీల్లో ఆ సీన్లన్నీ చూస్తూ.. జగన్ తనదైన స్టైల్‌లో ముసిముసి నవ్వులు నవ్వుకున్నారట. వెన్నుపోటు హైలైట్స్‌తో సాయంత్రం తీరిగ్గా ఓ వీడియో కూడా రిలీజ్ చేశారు. వెన్నుపోటు గ్రాండ్ సక్సెస్ అంటూ ట్వీట్ చేశారు. ఇదంతా జగన్ స్ట్రాలజీనేనా? కేసీఆర్ ఆడిస్తున్నారా?


జగన్ అంటే ఇది కాదా?

ఇది జగన్ స్టైలేనా? ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంతకు ముందెప్పుడైనా చూశామా? అనే చర్చ పొలిటికల్ సర్కిల్స్‌లో నడుస్తోంది. జగన్‌కు సొంత ప్రచారంపై మమకారం ఎక్కువ అంటారు. ఏ దీక్ష చేసినా.. ఏ ధర్నా చేసినా.. తానే స్వయంగా చేయాలనే స్వభావం. సెల్ఫ్ ప్రొజెక్షన్ కోసం బాగా ట్రై చేస్తుంటారని చెబుతారు. గతంలో రైతు దీక్ష, నిరుద్యోగుల ధర్నా గట్రా ఆయనే చేసేవారు. పాదయాత్ర, ఓదార్పు యాత్రలు అందుకే. ఫోకస్ అంతా తన చుట్టూనే ఉండేలా జాగ్రత్త పడేవారు. కానీ, ఇప్పుడు రొటీన్‌కు భిన్నంగా పార్టీ నేతలను, కార్యకర్తలను ఇన్వాల్వ్ చేశారు. వాళ్లనే ముందుంచారు. రాష్ట్రమంతా ఒకేసారి పబ్లిసిటీ వచ్చేలా చేశారు. అదే టైమ్‌లో తాను మాత్రం ఏపీలో ఉండకుండా.. బెంగళూరుకే పరిమితం అయ్యారు. ఇదంతా జగన్ తీరుకు డిఫరెంట్‌గా ఉందని అంటున్నారు. అది కేసీఆర్ మార్క్ పాలిటిక్స్ అంటూ కంపేర్ చేస్తున్నారు విశ్లేషకులు.


ఇది కేసీఆర్ స్టైల్..

ఉద్యమ సమయంలో కేసీఆర్ ఇలానే చేసేవారు. తాను ఇంట్లో కూర్చొని.. నేతలకు, కేడర్‌కు టాస్క్‌లు ఇచ్చేవారు. మానవ హారాలు, వంటావార్పులు, ధూంధాంలు, ర్యాలీలు, ధర్నాలు, మిలియన్ మార్చ్‌ ఇలా ఏ కార్యక్రమంలోనూ కేసీఆర్ నేరుగా అటెండ్ కాలేదు. ఇంట్లో ఉండే ఉద్యమం నడిపించారు. ఇప్పుడు జగన్ సైతం కేసీఆర్‌ను ఫాలో అవుతున్నారా? లేదంటే, కేసీఆర్ ఆడించినట్టే ఆడుతున్నారా? అనే డౌట్ రాజకీయ వర్గాల్లో వ్యక్తం అవుతోంది.

దోస్త్ మేరా దోస్త్..

కేసీఆర్, జగన్ చాలా క్లోజ్. ఎంతంటే.. ప్రగతి భవన్‌లో కలిసి భోజనం చేసేంత సఖ్యత. బేసిన్లు, భేషజాలు లేకుండా రాయలసీమకు నీళ్లు ఇచ్చేంతలా. రోజా ఇంట్లో చేపల పులుసు తినేంత ఆప్యాయత. తెలంగాణ ఎన్నికల్లో వైసీపీ శ్రేణులు బీఆర్ఎస్‌కు బాగా సపోర్ట్ చేశాయి. ఏపీలో గత రెండు అసెంబ్లీ ఎలక్షన్స్‌కు జగన్‌కు కేసీఆర్ సీక్రెట్ సాయం దండిగానే చేశారని అంటారు. ఇటీవలి తెలంగాణ అసెంబ్లీ పోలింగ్ రోజున నాగార్జున సాగర్ ప్రాజెక్టు మీదకు ఏపీ పోలీసులను పంపించి గులాబీ పార్టీకి రిటర్న్ సాయం చేసేందుకు జగన్ ట్రై చేసినా ఆ గేమ్ వర్కవుట్ కాలేదు. కేసీఆర్ ఓడిపోయి తుంటి విరిగాక.. ఇంటికెళ్లి మరీ బాస్‌ను పరామర్శించారు జగన్. అలా వాళ్లిద్దరి బంధం విడదీయరానిదని అంటారు.

టచ్‌లో ఉంటే చెప్తా..!

చంద్రబాబు మీద కోపంతో జగన్‌కు కేసీఆర్ బాగా దగ్గరయ్యారని అంటారు. బాబును అడ్డుకోవడానికే జగన్‌ను గెలిపించడానికి గట్టిగా ప్రయత్నించారని చెబుతారు. ఇప్పుడు ఆ ఇద్దరు నేతలు ప్రతిపక్షానికి పరిమితమై రిలాక్స్డ్ గా ఉంటున్నారు. ఫాంహౌజ్‌లో పెద్దాయన.. ప్యాలెస్‌లో చిన్నాయన. వాళ్లిద్దరూ రాష్ట్ర రాజకీయాలపై తరుచూ చర్చించుకుంటున్నారా? సలహాలు, సూచనలు ఇచ్చి పుచ్చుకుంటున్నారా?

వెన్నుపోటు వ్యూహం ఎవరిది?

గులాబీ బాస్‌కు పొలిటికల్ స్ట్రాటజిస్ట్ అనే ఖ్యాతి కూడా ఉంది. లక్ష పుస్తకాలు చదివిన తెలివితో.. అటు ఏపీ రాజకీయాల్లోనూ పరోక్షంగా వేలు పెడుతున్నారని అనుమానిస్తున్నారు. అప్పట్లో ఆంధ్రప్రదేశ్‌లో బీఆర్ఎస్ బ్రాంచ్ కూడా ఓపెన్ చేసినా.. ఎప్పుడు మూసేశారో కూడా తెలీకుండా పోయింది. ఇప్పుడు జగన్‌కు గాడ్ ఫాదర్‌గా మారి ఐడియాలు ఇస్తున్నారా? నువ్వు కష్టపడొద్దు.. పార్టీ నేతలను కష్టపెట్టు అనేలా పెద్దరికం ప్రదర్శిస్తున్నారా? కేసీఆర్ చెప్పినట్టే జగన్ చేస్తున్నారా? అనే డౌట్ వస్తోంది. లేటెస్ట్ వెన్నుపోటు దినోత్సవం వ్యూహం కూడా కేసీఆర్‌దే అనే ప్రచారం జరుగుతోంది.

జగన్‌కు ఆ సాయం చేస్తున్నారా?

మరో ఇంట్రెస్టింగ్ మేటర్ కూడా ఆఫ్ ది రికార్డ్ నడుస్తోంది. ఏపీ లిక్కర్ స్కాంలో జగన్ మనుషులంతా ఇరుక్కుపోయారు. పెద్దిరెడ్డి ఫ్యామిలీ మినహా మిగతా పాత్రధారులందరినీ పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. ఆనాటి లిక్కర్ సంపాదన అంతా వారి దగ్గరే ఉందని అంటున్నారు. ఎక్కడెంత దాచింది వారికే తెలుసట. వాళ్ల చేతులకు బేడీలు పడటంతో.. జగన్‌కు మనీ ప్రాబ్లమ్ మొదలైందని తెలుస్తోంది. ఈ విషయం స్వయంగా జగనే ఇటీవల ఓపెన్‌గా చెప్పేశారని గుర్తు చేస్తున్నారు. పార్టీని నడపడానికి తన దగ్గర డబ్బులు లేవని.. ఎవరైనా ఇస్తే తీసుకోవటానికి రెడీ అంటూ సంచలన కామెంట్స్ చేశారాయన. జగన్‌కు డబ్బులు టైట్ కావడంతో.. కేసీఆరే సర్దుతున్నారా? అనే అనుమానమూ వ్యక్తం చేస్తున్నారు కొందరు. ఎందుకంటే గులాబీ బాస్‌కు ఆ అలవాటు బాగానే ఉందంటున్నారు.

నిప్పు లేకుండా పొగ..?

కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు.. ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్, జేఎంఎం సోరెన్, జేడీఎస్ కుమారస్వామి తదితరులు రెగ్యులర్‌గా ప్రగతి భవన్‌కు కేసీఆర్ సాయం కోసం వచ్చేవారని గుర్తు చేస్తున్నారు. తిరిగి వెళ్లేటప్పుడు ప్రైవేట్ విమానాల్లో వారితో పాటు పెద్ద పెద్ద సూటుకేసులు కూడా వెళ్లేవనే రాజకీయ ఆరోపణలు కూడా ఉండేవి అప్పట్లో. ఇప్పుడు కూడా జగన్‌కు కేసీఆర్ అలానే సాయం చేస్తున్నారా? ఆర్థికంగా, వ్యూహాల పరంగానూ జగన్‌ను గులాబీ బాస్ గైడ్ చేస్తున్నారా? అనే చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. అసలే తన పరిస్థితే బాలేదు.. కేసులు చుట్టుముట్టాయి.. కూతురుతో తలనొప్పి మొదలైంది.. ఇలాంటి టైమ్‌లో ఏపీ పాలిటిక్స్‌లో కేసీఆర్ జోక్యం చేసుకుంటారా? జగన్‌ను డైరెక్ట్ చేసేంత సీన్ ఉందా? అని కూడా అంటున్నారు. ఏది నిజమో తెలీదు కానీ.. జగన్ వెనుక కేసీఆర్ ఉన్నారనే ప్రచారం మాత్రం మొదలైంది. మరి, నిప్పు లేనిదే పొగ…?

Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×