Anu Emmanuel: ఇండస్ట్రీలో హిట్ కోసం ఎదురుచూస్తున్న హీరోయిన్లు చాలామందే ఉన్నారు. ఎన్ని సినిమాలు చేసినా లక్ లేకుండా ఉన్న హీరోయిన్లు ఉన్నారు. అందులో అను ఇమ్మాన్యుయేల్ ఒకరు. మజ్ను సినిమాతో అను తెలుగుతెరకు పరిచయమైంది. ముద్దుగా.. బొద్దుగా కనిపించి కుర్రాళ్ళ గుండెలను మెలిపెట్టేసిన ఈ అందం ఆ తరువాత పలు సినిమాల్లో నటించినా కూడా విజయాలను మాత్రం దక్కించుకోలేదు. ఇక అల్లు అర్జున్ సరసన నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా సినిమాలో ఛాన్స్ పట్టేసింది. ఈ సినిమాతో అను రేంజ్ మారిపోతుంది అనుకున్నారు. కానీ, అది కూడా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది.
ఇక అను ఆ తరువాత కొద్దిగా గ్యాప్ తీసుకొని బరువు తగ్గి.. మరింత హాట్ గా తయారయ్యి.. అందాల ఆరబోతకు కూడా ఏ మాత్రం తీసిపోని అని చెప్పుకొచ్చింది. ఇక అల్లు శిరీష్ తో ఊర్వశివో రాక్షసివో అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఇందులో శిరీష్ తో ఘాటు రొమాన్స్ చేసి షాక్ ఇచ్చింది. ఆ తరువాత వీరిద్దరికీ మధ్య ఏదో ఉందని పుకార్లు వచ్చాయి. కానీ, అవేమి నిజం కాదని తెలియడంతో రూమర్స్ ఆగాయి.
అప్పుడు వెళ్లిన అను.. ఇప్పుడు ది గర్ల్ ఫ్రెండ్ సినిమాలో ఎంట్రీ ఇచ్చింది. రష్మిక మందన్నా ప్రధాన పాత్రలో రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా నిన్న రిలీజ్ అయ్యి మంచి పాజిటివ్ టాక్ ను అందుకుంది. రష్మిక, దీక్షిత్, అను పాత్రలే ఈ సినిమాకు కీలకం అని చెప్పొచ్చు. రష్మిక పాత్ర తరువాత అంత ఇంపాక్ట్ కలిగించింది దుర్గ. ఆ పాత్రలో నటించింది అనునే. ఆమె పాత్ర సినిమాకు కీలకం.
భూమాకు ఫ్రెండ్ గా దుర్గ నటన పీక్స్ అని చెప్పొచ్చు. అలాంటి ఫ్రెండ్ ప్రతి ఒక్క అమ్మాయికి ఉండాలి. ఫ్రెండ్ రిలేషన్ లో ఇబ్బంది పడుతుందని, ఆమెకు తోడుగా ఉండడం దగ్గర నుంచి సలహాలు ఇవ్వడం.. ధైర్యం చెప్పడం. కన్ఫ్యూజ్ లో ఉన్న భూమాకు క్లారిటీ వచ్చేలా చేసి నిజమైన స్నేహితురాలు అంటే ఇలానే ఉండాలి అని అనిపించేలా చేసింది. ఇక అను పాత్రకు ప్రేక్షకులు మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు.
ఇప్పటివరకు అను నటనని గుర్తించని ప్రేక్షకులు.. ఈ సినిమాలో ఆమె యాక్టింగ్ కు ఫిదా అవుతున్నారు. ఈ సినిమా తరువాత అమ్మడికి మంచి అవకాశాలు వచ్చేలా ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల టాక్. మరి ముందు ముందు అను కూడా మంచి విజయాలను అందుకుంటుందేమో చూడాలి.