Vishal Reacts on Coimbatore Assaulted Case: తమిళనాడులో యువతిపై సాముహిక అత్యాచార ఘటనపై ఎమ్మెల్యే చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ ఘటనలో బాధితురాలిని నిందించిన ఎమ్మెల్యే తీరు తప్పుబడుతున్నారు. కొయంబత్తూరు విమానాశ్రయం సమీపంలో యువతిపై సామూహిక అత్యాచారం జరిగిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఓ కళశాల విద్యార్థిని తన స్నేహితుడితో కలిసి కారులో వెళుతుంది. ఈ క్రమంలో కోయంబత్తూరు ఎయిర్‌పోర్టు సమీపంలో ఆగి ఉన్న కారు నుంచి ముగ్గురు వ్యక్తులు ఆమెను అపహరించి శారీకంగా వేధించారు.
అర్థరాత్రి చోటుచేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేశారు. అయితే ఈ ఘటనలో అర్థరాత్రి ఆ యువతి బయట తిరగడాన్ని ఎమ్మెల్యే ఈశ్వరన్ తప్పుబడుతూ చేసిన కామెంట్స్ వివాదస్పదంగా మారాయి. అర్థరాత్రి స్నేహితుడితో కలిసి తిగరడాన్ని సామాజిక పతనం అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన కామెంట్స్ రాజకీయ పరంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి.ఆయన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. సినీ, రాజకీ య ప్రముఖులు ఎమ్మెల్యే ఈశ్వరన్ వ్యాఖ్యలపై మండిపడుతున్నారు.
అలాగే హీరో విశాల్ కూడా ఈ అత్యాచార ఘటనపై స్పందించాడు. ఈ మేరకు ట్వీట్ చేస్తూ మీ కాళ్లు మొక్కుతా ఈ ఘటనన రాజకీయం చేయడం ఆపండి అంటూ వేడుకున్నాడు. ఆ రాత్రి ఆడపిల్ల అక్కడ ఎందుకు ఉందంటూ బాధితురాలినినింధించడం ఆపండి. దేశంలో పెరిగిపోతున్న అత్యాచార ఘటనలను రాజకీయం చేయడం మానుకోండంటూ విశాల్ తన ట్వీట్‌లో రాసుకొచ్చాడు. “న్యాయవ్యవస్థను ముందు మోకరిల్లు వేడుకుంటున్నా. మీ కాళ్లు పట్టుకుంటా. దయచేసి ఈ దారుణమైన అఘాయిత్యానికి పాల్పడ్డ నిందితులకు ఉరిశిక్ష వేయండి. గతంలో నిర్భయలాంటి ఉదంతాలను చూశాం.
ఏడేళ్ల బాలికపై అత్యాచారం చేయడంతో పాటు ఆమె కన్నతల్లిని హత్యచేసిన కేసులో నిందితుడిగా జైలుకు వెళ్లిన వ్యక్తి సుదీర్ఘ విచారణ అనంతరం కోర్టు అతడిని నిర్దొషిగా తీర్పు ఇచ్చింది. దీంతో అతడు బయటకు వచ్చేశాడు. అదే ఇలాంటివి సౌది అరేబియా వంటి దేశాల్లో జరుగుతుందా? ఎందుకంటే అక్కడ దోషులకు అంతటి కఠిమైన శిక్షలు ఉంటాయి. కానీ, మన దేశంలో ఎన్నటికీ దోషులుగా తేలమన్న ధైర్యం వల్లే నేరస్థులు మరింత రెచ్చిపోతున్నారు. కొన్నేళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇలాంటి నేరం జరిగినప్పుడు దివంగత ముఖ్యంత్రి వైఎస్‌ఆర్ (వైఎస్ రాజశేఖర్ రెడ్డి) తీసుకున్న చర్యలు మెచ్చకోదగినవి. ఆయనకు నేను సెల్యూట్ చేస్తున్నాను. ఇప్పుడు ఆ సమయం వచ్చింది” అంటూ విశాల్ తన పోస్ట్‌లో రాసుకొచ్చాడు. ప్రస్తుతం అతడి ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Stop blaming the victim for being at that place at that hour. Stop politicising this bloody gory recurring issue, rape in our country.
High time atleast now I beg, bow and fall on your feet dear Judicial system and lawmakers. Kindly bring about captial punishment and death…
— Vishal (@VishalKOfficial) November 7, 2025