Mohammed Shami : టీమిండియా ఫాస్ట్ బౌలర్లలో ఒకరైన మహ్మద్ షమీ మరోసారి వార్తల్లో నిలిచారు. అయితే ఈ సారి క్రికెట్ మైదానంలో అతని ప్రదర్శన వల్ల కాదు.. అతని వ్యక్తి గత జీవితానికి సంబంధించిన వివాదమే కారణం. ఇప్పటికే షమీకి దూరంగా ఉంటున్న భార్య హాసీన్ జహాన్ తనకు, తమ కుమార్తెకు ఇచ్చే భరం మొత్తాన్ని పెంచాలంటూ సుప్రీంకోర్టులో అప్పీల్ చేసింది. ప్రస్తుతం కలకత్తా హైకోర్టు నెలకు రూ.4లక్షల భరణం ఇవ్వాలని ఆదేశించగా.. దానిని రూ.10లక్సలకు పెంచాలనీ హాసీన్ జహన్ కోరుతుంది. ఈ అప్పీల్ పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు హాసీన్ జహన్ ను, ఆమె న్యాయవాదులను కోర్టు కీలక ప్రశ్న అడిగింది.
Also Read : Hong Kong Sixes 2025: దినేష్ కార్తీక్ చెత్త కెప్టెన్సీ.. కువైట్, UAE చేతిలో వరుసగా ఓడిన టీమిండియా
టీమిండియా బౌలర్ షమీ, అతని భార్య హాసీన్ జహీన్ గత ఏడు సంవత్సరాలుగా వేర్వేరుగా ఉంటున్నారు. 2018లోనే హాసీన్ జహాన్, షమీ అతని కుటుంబ సభ్యులపై గృహహింస, వేధింపుల ఆరోపణలతో ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ వివాదం కోర్టుల పరిధిలో ఉంది. ప్రారంభంలో ఓ ట్రయల్ కోర్టు షమీని నెలకు రూ.1.3లక్షల మధ్యంతర భరణం చెల్లించాలని ఆదేశించింది. 2025 జులై లో కలక్తా హైకోర్టు ఈ మొత్తాన్ని నెలకు రూ.4లక్షలకు పెంచింది. ఇందులో రూ.1.5లక్షలు హాసీన్ జహాన్ కు మిగిలిన రూ.2.50 లక్షలు వారికుమార్తెకు కేటాయించారు. హాసీన్ జహాన్ కలకత్తా హైకోర్టు ఆదేశాన్నీ సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో అప్పీల్ చేసింది. తనకు కుమార్తెకు కలిపి మధ్యంతర భరణాన్ని నెలకు రూ.10లక్షలకు పెంచాలనీ డిమాండ్ చేసింది. ఆమె మొదటి నుంచి రూ.7లక్షలు తన కోసం రూ.3లక్షలు కుమార్తె కోసం కోరుతోంది. సుప్రీంకోర్టులో చేసిన అప్పీల్ లో హాసిన్ జమాన్, భరణం పెంపునకు గల కారణాలను ప్రముఖంగా ప్రస్తావించింది. షమీ ఏ-లిస్టెడ్ నేషనల్ క్రికెటర్ అని.. అతని నికర విలువ దాదాపు రూ.500 కోట్లు ఉంటుందని హాసీన్ జహాన్ కోర్టుకు తెలిపింది.
క్రికెటర్ బాధితురాలు జీవన ప్రమాణాల మధ్య భారీ వ్యత్యాసం ఉందని ఈ భరణం తమ జీవన ప్రమాణాన్ని మెరుగు పరచడానికి సరిపోదని ఆమె వాదించింది. ఇతర ఎలైట్ క్రికెటర్ల కుటుంబాల మాదిరిగానే తాము కూడా అదేస్థాయిలో జీవించే హక్కు ఉందని.. అయితే షమీ నుంచి సరైన మద్దతు లభించడం లేదని ఆరోపించింది. ఈ అప్పీల్ పై విచారణ సందర్బంగా సుప్రీంకోర్టు ధర్మాసనం హాసీన్ జహాన్ ను ఆమె న్యాయవాదులను ప్రశ్నించింది. జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ నేతృత్వంలోని ధర్మాసనం హాసిన్ జహాన్ న్యాయవాదులను ఉద్దేశించి నెలకు రూ.4లక్షలు భరణం కూడా బాధితురాలు సరిపోదా..? అని ప్రశ్నించింది. హాసీన్ జహాన్ అభ్యర్థనపై సుప్రీంకోర్టు ప్రస్తుతం ఎలాంటి తుది ఆదేశాలు ఇవ్వనప్పటికీ ఈ కేసుపై మరింత విచారణ జరిపేందుకు మహ్మద్ షమీ, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసుల తరువాత తదుపరి విచారణ కొనసాగనుంది.
Also Read : Pratika Rawal Medal : ప్రతీకా రావల్ కు ఘోర అవమానం..కానీ అంతలోనే ట్విస్ట్, ICC బాస్ జై షా నుంచి పిలుపు
HASIN JAHAN : "Rs. 4 Lakh per month is LESS according to Shami's Luxurious lifestyle. We had demanded Rs. 10 Lakh every month" pic.twitter.com/rP3X0foHHG https://t.co/KMewVVVbrf
— News Algebra (@NewsAlgebraIND) November 7, 2025