IND VS AUS 5th T20I: టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య ఇవాళ చిట్టచివరి t20 జరుగుతోంది. ఇప్పటికే ఈ టోర్నమెంట్లో రెండు జట్ల మధ్య 4 టీ20లు పూర్తయ్యాయి. ఇవాళ ది గబ్బా వేదికగా రెండు జట్లు ఐదవ టి20 ఆడుతున్నాయి. అయితే ఈ మ్యాచ్ కు సంబంధించిన టాస్ గెలిచిన ఆస్ట్రేలియా, ఎప్పటిలాగే బౌలింగ్ ముందు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఆస్ట్రేలియా టాస్ గెలవడంతో టీమిండియా ముందుగా బ్యాటింగ్ చేయనుంది. ఇవాళ్టి మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఎలాంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగుతోంది. కానీ టీమిండియా మాత్రం ఒకే ఒక్క మార్పుతో వస్తోంది. తెలుగు కుర్రాడు తిలక్ వర్మపై వేటు వేసింది టీమిండియా. అతని స్థానంలో డేంజర్ ఫినిషర్ రింకూ సింగ్ వస్తున్నాడు. తిలక్ వర్మ…ఈ టోర్నమెంట్ లో పెద్దగా రాణించలేదు. దీంతో అతనిపై వేటు పడగా, రింకూ సింగ్ కు ఛాన్స్ ఇచ్చారు.
Also Read: Cm Revanth Reddy: హైదరాబాద్ లో మరో అంతర్జాతీయ స్టేడియం..ఆస్ట్రేలియా తరహాలో బౌన్సీ పిచ్ లు
టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య ఇవాళ బ్రిస్బెన్ లోని ది గబ్బర్ స్టేడియంలో బిగ్ ఫైట్ జరుగుతోంది. ఈ మ్యాచ్ ఎప్పటి లాగే 1:45 గంటలకు ప్రారంభం అవుతుంది ఈ మ్యాచ్ ను జియో హాట్ స్టార్ లో ఉచితంగా చూడవచ్చు. స్టార్ స్పోర్ట్స్ లో కూడా ఈ మ్యాచ్ కు సంబంధించిన లైవ్ ప్రసారాలు వస్తున్నాయి. టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య టి20 రికార్డులు ఒకసారి పరిశీలిస్తే.. ఇందులో సూర్య కుమార్ యాదవ్ సేన అనే పై చేయి సాధించింది. ఇప్పటి వరకు ఈ రెండు జట్ల మధ్య 36 మ్యాచ్ లు జరిగాయి. ఇందులో 22 మ్యాచ్లో టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. అటు 12 మ్యాచ్ లలోనే ఆస్ట్రేలియా విజయం సాధించడం గమనార్హం. వన్డేలలో మాత్రం ఆస్ట్రేలియాపై చేయి సాధించగా టి20లలో టీమిండియాది దూకుడు కనిపిస్తోంది. ఇక రెండు జట్ల మధ్య రెండు మ్యాచ్ లలో ఫలితం తేలలేదు. ఇవాళ టీమిండియా వర్సెస్ ఆసీస్ మధ్య 5వ టీ20 జరుగుతోంది. ఇందులో టీమిండియా గెలిస్తే, 3-1 తేడాతో సిరీస్ గెలువనుంది. అదే ఆస్ట్రేలియా గెలిస్తే, 2-2 తేడాతో సిరీస్ సమం కానుంది.
భారత్ (ప్లేయింగ్ ఎలెవన్): అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రింకు సింగ్, జితేష్ శర్మ(w), వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబే, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చకరవర్తి, జస్‌ప్రీత్ బుమ్రా
ఆస్ట్రేలియా (ప్లేయింగ్ XI): మిచెల్ మార్ష్ (కెప్టెన్), మాథ్యూ షార్ట్, జోష్ ఇంగ్లిస్ (w), టిమ్ డేవిడ్, జోష్ ఫిలిప్, మార్కస్ స్టోయినిస్, గ్లెన్ మాక్స్‌వెల్, బెన్ ద్వార్షుయిస్, జేవియర్ బార్ట్‌లెట్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా
Mitchell Marsh won the toss and has elected to bowl against Australia in the 5th T20I in Brisbane 🏏
Here are the line-ups of both sides.#AUSvIND #CricketTwitter pic.twitter.com/Go8jeQoaqC
— InsideSport (@InsideSportIND) November 8, 2025