Visakhapatnam Incident: విశాఖ జిల్లా పెందుర్తిలో కనకమహాలక్ష్మి మృతి కేసులో ట్విస్ట్ చోటుచేసుకుంది. కోడలు లలితనే అత్తను హత్య చేసినట్టు దర్యాప్తులో తేలింది. తనపై చిరాకుపడుతుందనే కారణంతోనే మర్డర్ చేసినట్టు అంగీకరించింది. అయితే కోడలు.. అత్తను చంపటం కోసం దొంగ-పోలీస్ ఆటను ఎంచుకుంది. మనవరాలితో కలిసి దొంగ పోలీస్ ఆట ఆడాలని.. అత్తను కుర్చీలో తాళ్లతో బంధించింది. ఈలోగా పెట్రోల్ పోసి దేవుడి గదిలోని దీపం విసిరింది. కుర్చీలో కదల్లేని స్థితిలో ఉన్న అత్త కనక మహాలక్ష్మి స్పాట్‌లోనే చనిపోయింది. అనంతరం అగ్నిప్రమాదం జరిగిందని నమ్మించే ప్రయత్నం చేసింది. పోలీసులు కూడా.. మొదట అగ్నిప్రమాదంగానే కేసు నమోదు చేశారు. కానీ దర్యాప్తులో కోడలే చంపిందని తేల్చారు.
వివరాల్లోకి వెళితే.. విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం అప్పన్నపాలెంలోని ఒక చిన్న కుటుంబంలో ఊహించని దారుణ ఘటన జరిగింది. 66 ఏళ్ల వృద్ధురాలు జయంతి కనక మహాలక్ష్మి అనుమానాస్పదంగా మరణించారు. మొదట్లో అగ్నిప్రమాదంగా నమ్మించేలా కుటుంబ సభ్యులు, పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. కానీ, దర్యాప్తులో ఈ మరణం కేవలం ప్రమాదం కాదు, కోడలు లలిత చేత జరిగిన రహస్య హత్య అని తేలింది.
జయంతి కనక మహాలక్ష్మి తమ కుమారుడు సుబ్రహ్మణ్య శర్మ, కోడలు లలిత, మనవడితో కలిసి అప్పన్నపాలెంలో నివసిస్తున్నారు. వితంతువైన కనక మహాలక్ష్మి కుటుంబానికి మద్దతుగా ఉండేది. అయితే, ఆమె మధ్యలో కోడలు లలితతో తీవ్ర విభేదాలు ఏర్పడ్డాయి. అలాగే తనపై అనవసరంగా చిరాకు పెడుతూ, రోజూ తిట్టుకుంటూ ఉండేది కనక మహాలక్ష్మి అని అలిత ఆరోపించింది. ఈ మానసిక ఒత్తిడి తట్టుకోలేక ఈ హత్యకు పాల్పడినట్లు చెబుతుంది.
అయితే గురువారం సాయంత్రంఈ దారుణ ఘటన జరిగింది. లలిత తన పిల్లలతో కలిసి ‘దొంగ-పోలీస్’ ఆటను ఆడుతున్నట్లు చూపించుకుంది. ఈ ఆట పేరిట అత్తను ఆకట్టుకుని, ఆమెను కుర్చీలో కూర్చోబెట్టింది. తర్వాత, లలిత కనక మహాలక్ష్మి చేతులు, కాళ్లు తీగలతో బిగించింది. కళ్లకు కప్పు పట్టి, ఆమెను కదలకుండా చేసింది. ఈ లోగా పెట్రోల్ పోసి దేవుడి గదిలోని దీపం విసిరింది. కనకమహాలక్ష్మి కదల్లేని పరిస్థితిలో ఉంది కాబట్టి అక్కడే మృతి చెందింది. లలిత ఈ లోపలే తలుపు మూసివేసి, బయటికి వచ్చి “అమ్మా! అత్త మంటల్లో కాలిపోతున్నారు… ఎవరైనా రక్షించండి!” అని అరుస్తూ అందరినీ మోసం చేసింది.
Also Read: దేశంలో పెద్ద సమస్య ఊబకాయం.. ఫిట్ ఇండియానే పరిష్కారమా? కేంద్రం ప్లానేంటి?
అయితే ఈ ఘటనపై పెందుర్తి పోలీస్ స్టేషన్‌లో మొదట అగ్నిప్రమాద కేసుగానే నమోదు చేశారు. కుటుంబ సభ్యుల వాంగ్మూలాల ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. కానీ, లలిత ప్రవర్తనలో అనుమానాలు ఏర్పడ్డాయి. ఆమె మొదట్లో భావోద్వేగంగా మాట్లాడుతూ, తర్వాత విరుగుడు మాటలు చెప్పడం, ఘటనా స్థలంలో ఆధారాలు పరిశీలించడంతో హత్య కోణం బయటపడింది. పోలీసులు లలితను ఇన్వెస్టిగేషన్ చేయగా ఆమె పూర్తిగా నిజం ఒప్పుకుంది. “అత్త తనపై చిరాకు పెడుతూ ఉండటం భరించలేకపోయాను. ఈ ఆట పేరిట హత్య చేశాను” అని ఆమె వెల్లడించింది. పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. సుబ్రహ్మణ్య శర్మకు ఈ విషయం తెలిసిన తర్వాత షాక్‌కు గురయ్యాడు. పిల్లలు ఈ ఆటలో పాల్గొన్నారని, కానీ హత్యలో పాలుపంచుకోలేదని పోలీసులు నిర్ధారించారు.