Rajendra Prasad: నటి కిరీటి రాజేంద్రప్రసాద్ (Rajendra Prasad)ఇటీవల కాలంలో తన మాట తీరు కారణంగా వార్తలలో నిలుస్తున్నారు. అయితే సినిమా వేదికలపై ఈయన నటీనటులను ఉద్దేశించి మాట్లాడుతున్న తీరు సోషల్ మీడియాలో పలు విమర్శలకు కారణమవుతుంది. ఇక రాజేంద్రప్రసాద్ తోటి నటీనటుల గురించి ఎప్పుడూ ఉద్దేశపూర్వకంగా మాట్లాడకపోయినా ఇలా ఒక బహిరంగ వేదికపై మాట్లాడటంతో ఈయన మాటలను చాలామంది తప్పుగా వక్రీకరిస్తూ తన మాట తీరుపై విమర్శలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న వారందరూ కూడా తన కళ్ళముందే ఇండస్ట్రీలో కొచ్చి మంచి గుర్తింపు సంపాదించుకున్న వారు వాళ్లంతా నా కుటుంబం, నా బిడ్డలతో సమానం, వారితో ఉన్న చనువు కారణంగానే మాట్లాడుతున్నానని పలు సందర్భాలలో తెలియచేస్తూ వచ్చారు.
పెద్దన్నయ్యతో సమానం…
ఇక ఇటీవల ప్రముఖ దర్శకుడు ఎస్ వి కృష్ణారెడ్డి (S.V.Krishna Reddy)పుట్టినరోజు సందర్భంగా కూడా రాజేంద్రప్రసాద్ అక్కడికి వచ్చిన హీరో హీరోయిన్ల గురించి మాట్లాడిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి . ముఖ్యంగా ఆలీని(Ali) ఉద్దేశించి ఈయన మాట్లాడిన తీరు తీవ్ర స్థాయిలో విమర్శలకు కారణమైంది. సోషల్ మీడియాలో ఈ ఘటన గురించి రాజేంద్రప్రసాద్ పట్ల వస్తున్నటువంటి వ్యతిరేకత పై ఆయన ఎంతో ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన గురించి ఆలీ స్పందిస్తూ తాను నాకు పెద్దన్నయ్యతో సమానం మా కుటుంబ సభ్యుడు లాంటి వ్యక్తి ఆయన అంటే నేనేమీ బాధపడలేదు ఎవరు కూడా దీనిని తప్పుగా అర్థం చేసుకోవద్దు అంటూ వివరణ ఇచ్చారు.
ఏక వచనంతో పిలవను…
తాజాగా ఇదే విషయం గురించి రాజేంద్రప్రసాద్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అక్కడికి వచ్చిన వారందరూ నా కుటుంబమని భావించి ఎప్పటిలాగే వారితో మాట్లాడినట్లే మాట్లాడాను. కానీ ఆ మాటలు సోషల్ మీడియాలో వివాదానికి కారణం అవుతాయని నాకు తెలియదు అంటూ క్లారిటీ ఇచ్చారు. ఈ వివాదం కారణంగా నేను చాలా బాధపడ్డాను. ఇకపై నా జీవితంలో నేను చచ్చే వరకు ఎవరిని కూడా ఏక వచనంతో పిలవను అందరికీ మర్యాద ఇచ్చి మాట్లాడుతానని తెలిపారు.. ఇలా ఇకపై తప్పు మాట్లాడానని చెప్పిన రాజేంద్రప్రసాద్ యాంకర్ ముందే మరోసారి నోరు జారుతూ బూతు పదాలు మాట్లాడారు.
మా కృష్ణాజిల్లాలో ఇలాంటి మాటలన్నీ మనుషుల మధ్య ప్రేమలు ఎక్కువైతేనే మాట్లాడుకుంటాము. ఇక మా మధ్య అతి ప్రేమలు ఉన్నాయి అంటే ఏరా ము*, ఏడీ ఆనా కొ* అంటూ ఇలా మాట్లాడతాము. మా మధ్య మరి ఎక్కువ ప్రేమలు ఉంటే ఇలాంటి పదాలు బయటకు వచ్చి మరొక సమస్యగా మారుతాయని రాజేంద్రప్రసాద్ మాట్లాడారు. ఇలాంటి పదాలు మాట్లాడటం మా జిల్లా వారికి అలవాటేనని రాజేంద్రప్రసాద్ తెలియజేశారు. ఇక ఆ రోజు నేను ఏదో పర్సనల్ ఫంక్షన్ అనుకొని అక్కడికి వచ్చాను కానీ, అక్కడికి వచ్చిన తర్వాతే నాకు తెలిసింది సినిమా సెలబ్రిటీలందరూ కూడా వచ్చారని, మీడియా వారు కూడా ఉన్నారని అప్పుడే తెలిసింది. ఇక నేను అక్కడ అందరిని ఒకేసారి చూడగానే నా ఫ్యామిలీతో మాట్లాడుతున్నట్టే మాట్లాడాను తప్ప, మీడియా వారు ఉన్నారు, నేను ఈ మాట మాట్లాడుకూడదని ఆలోచించలేదని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.