BigTV English

Jagan Comments on Chandrababu: చంద్రబాబుకు ఓటు వేస్తే మళ్లీ చంద్రముఖి నిద్రలేస్తుంది: జగన్ కామెంట్స్

Jagan Comments on Chandrababu: చంద్రబాబుకు ఓటు వేస్తే మళ్లీ చంద్రముఖి నిద్రలేస్తుంది: జగన్ కామెంట్స్

CM Jagan Comments on Chandrababu Naidu: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిపై సీఎం జగన్ మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో పైరయ్యారు. శుక్రవారం ప్రకాశం జిల్లా కనిగిరిలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, చంద్రబాబుపై మండిపడ్డారు. మీ పేరు చెబితే ఒక్క పథకమైనా గుర్తొస్తదా అంటూ చంద్రబాబు పాలనను గుర్తు చేస్తూ జగన్ మోహన్ రెడ్డి ఎద్దేవా చేశారు. తమ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.


2014లో చంద్రబాబుకు ఓటు వేస్తే ఆయన ఇచ్చిన హామీల్లో ఒక్కటైనా నెరవేర్చారా?. రైతులకు ఏ ఒక్కరికైనా రుణమాఫీ చేశారా..?. ఇళ్ల స్థలాలు ఇయ్యలేదు. ఇంటికో ఉద్యోగం అన్నాడు ఇయ్యలేదు. అంతేకాదు.. ఇంకా ఎన్నో హామీలు ఇచ్చాడు.. అందులో ఒక్కటైనా అమలు చేశాడా? అంటూ ప్రజలను అడుగుతూ చంద్రబాబుపై ఆయన ఫైరయ్యారు.

‘జగన్ అధికారంలో ఉంటే వాలంటీర్ వ్యవస్థ ఉంటుంది. జగన్ అధికారంలో ఉంటేనే మీ ఇంటికి పెన్షన్ వస్తది. జగన్ ఉంటేనే అమ్మఒడి, ఇళ్ళ స్థలాలు, చేయూత అందుతుంది. అంతేకాదు.. మరెన్నో పథకాలు మీకు అందుతాయి. కానీ, మీరు గనుక చంద్రబాబుకు ఓటు వేస్తే మళ్లీ చంద్రముఖి నిదలేస్తుంది’ అంటూ జగన్ అన్నారు. మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశానని చంద్రబాబు చెప్పుకుంటాడు.. కానీ, ఆయన పేరు చెబితే ఒక్క మంచైనా గుర్తుకు వస్తుందా..? పేదల కోసం చేసిన ఒక్క స్కీమైనా గుర్తొస్తుందా..? అంటూ జగన్ ప్రశ్నించారు.


Also Read: ఇది మీకు తగునా..? సీఎస్ కు చంద్రబాబు లేఖ

‘జగన్ కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగుతాయి. అదే చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ నిలిపివేస్తారు. గతంలో ఎన్నడు లేని విధంగా మంచి పాలనను 59 నెలల్లో మీరు చూశారు. ఎన్నో విప్లవాత్మక మార్పులను రాష్ట్రంలో తీసుకొచ్చా. ప్రభుత్వ బడుల్లో రూపురేఖలు మార్చేశా. ఆసరా, చేయూత, కాపునేస్తం, విద్యాదీవెన్, వసతి, అమ్మఒడి లాంటి పథకాలను తీసుకొచ్చా. కానీ, చంద్రబాబు అధికారంలోకి వస్తే వాటన్నిటినీ నిలిపివేస్తారు’ అని జగన్ అన్నారు.

Related News

CM Chandrababu: వరదలపై హై అలర్ట్.. సీఎం చంద్రబాబు డైరెక్ట్ ఆర్డర్స్.. అంతా అప్రమత్తం!

Bus accident: రాత్రి వేళ బస్సు బోల్తా… క్షణాల్లో కేకలు, అరుపులు.. ఎక్కడంటే?

Balakrishna warns: బాలకృష్ణ మాస్ వార్నింగ్… వేదికే కదిలిపోయింది!

Vijayawada beautification: విజయవాడకు కొత్త లుక్.. ఏపీ ప్రభుత్వం ప్లాన్ ఇదే!

Trolling On Jagan: కేంద్ర బలగాలతో ఎన్నికలు.. జగన్ ని కామెడీ పీస్ చేసేశారుగా?

Heavy rain alert: 48 గంటల పాటు దంచుడే.. ఏపీలోని ఆ జిల్లాలకు భారీ వర్ష సూచన!

Big Stories

×