Sankranti 2026 Train Tickets: ఏపీ, తెలంగాణలో అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే పండగలలో మకర సంక్రాంతి ఒకటి. తెలుగు రాష్ట్రాల్లో ఈ మూడు రోజుల పండగను భోగి, సంక్రాంతి, కనుమ పేర్లతో ఘనంగా జరుపుకుంటారు. పండగ సమయంలో సొంతూరుకు.. పని చేస్తున్న ప్రాంతాలు, తాత్కాలికంగా నివాసం ఉన్న చోటు నుంచి చాలా మంది వెళ్తుంటారు. ఇలాంటి సమయంలో అప్పటికప్పుడు టికెట్లు బుక్ చేయడం వల్ల ఎక్కువ చార్జీలు చెల్లించాల్సి వస్తుంది. కొన్ని సార్లు టికెట్లు దొరకని పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఇంతకీ 2026లో పండగ ఏ తేదీల్లో వచ్చింది. టికెట్లు బుక్ చేయడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పండగ తేదీలు:
ప్రతి సంవత్సరం మాదిరిగానే.. 2026లో కూడా మకర సంక్రాంతి దాదాపుగా అదే తేదీన రానుంది. వచ్చే ఏడాది జనవరి 14 వ తేదీన పండగను జరుపుకోనున్నాము.
భోగి: జనవరి 13 (మంగళవారం)
మకర సంక్రాంతి: జనవరి 14(బుధవారం)
కనుమ: జనవరి 15 (గురువారం)
ఈ పర్వ దినాలలో నదీ స్నానాలు, దాన ధర్మాలు చేయడం హిందూ సంప్రదాయంలో అత్యంత పుణ్యప్రదం. అందుకే చాలా మంది వివిధ దేవాలయాలకు కూడా వెళ్తుంటారు.
IRCTC ద్వారా రైలు టికెట్లు బుక్ చేసుకునే విధానం:
సంక్రాంతి పండగ సందర్భంగా ప్రజలు తమ సొంతూళ్లకు, బంధువుల ఇళ్లకు వెళ్లడానికి ట్రైన్‌లను ఆశ్రయిస్తారు. పండగ సమయంలో డిమాండ్ ఎక్కువగా ఉండటం వల్ల టికెట్లు దొరకడం కష్టమవుతుంది.
1. టికెట్ బుకింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుంది ?
సాధారణంగా ఇండియన్ రైల్వేలు (Indian Railways) 120 రోజుల ముందు (నాలుగు నెలలు) టికెట్ బుకింగ్ ప్రారంభిస్తాయి. 2026 జనవరి 14న సంక్రాంతి పండగ ఉంది కాబట్టి.. బుకింగ్‌లు సెప్టెంబర్నుంచి ప్రారంభం అయ్యాయి.
2. వెంటనే బుక్ చేసుకోండి:
మీరు ప్రయాణించాలనుకుంటున్న తేదీకి 90 రోజుల ముందుగానే. అంటే.. నవంబర్ 2025 నెలలోనే వీలైనంత త్వరగా టికెట్లు బుక్ చేసుకోవడం చాలా ముఖ్యం.
ముఖ్యంగా పండగ తేదీలకు ముందు, అంటే జనవరి 10 నుంచి 13 తేదీల మధ్య, పండగ తర్వాత జనవరి 16 నుంచి 19 తేదీల మధ్య డిమాండ్ అత్యధికంగా ఉంటుంది.
3. IRCTC ద్వారా బుకింగ్ :
IRCTC అకౌంట్: ముందుగా IRCTC వెబ్‌సైట్ (www.irctc.co.in) లేదా మొబైల్ యాప్‌లో మీ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌తో లాగిన్ అవ్వండి.
ప్రయాణ వివరాలు: మీరు బయలుదేరే స్టేషన్ (From), మీరు చేరుకోవాల్సిన స్టేషన్ (To), ప్రయాణ తేదీ (జనవరి 2026లో), ఏసీ/స్లీపర్ వంటి తరగతిని ఎంచుకోండి.
రైళ్లను ఎంచుకోండి: అందుబాటులో ఉన్న రైళ్లను, ఖాళీగా ఉన్న సీట్లను చెక్ చేయండి.
Also Read: ప్రయాణికులకు సంక్రాంతి టెన్షన్.. బుకింగ్ ఓపెనైన ఐదు నిమిషాలకే వెయిటింగ్ లిస్టు
ప్యాసింజర్ వివరాలు: ప్రయాణికుల పూర్తి వివరాలు (పేరు, వయస్సు, ఇతర వివరాలు) ఎంటర్ చేయండి.
చెల్లింపు: డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్ లేదా UPI ద్వారా చార్జీలు చెల్లించండి.
4. తత్కాల్ బుకింగ్ , ప్రత్యామ్నాయాలు:
సాధారణ టికెట్లు దొరకనప్పుడు.. ప్రయాణానికి ఒక రోజు ముందు ప్రారంభమయ్యే తత్కాల్ బుకింగ్ ఆప్షన్‌ను ప్రయత్నించండి.
వెయిటింగ్ లిస్ట్ / ఆర్ఏసీ (RAC): వీలైనంత వరకు కన్ఫర్మ్ అయ్యే అవకాశం ఉన్న వెయిటింగ్ లిస్ట్ టికెట్లను బుక్ చేసుకోండి.