Delhi Car Blast: సోమవారం సాయంత్రం, ఢిల్లీలోని రెడ్ ఫోర్ట్ మెట్రో స్టేషన్ సమీపంలో జరిగిన దారుణ కారు పేలుడు దేశమంతటా ఉలిక్కిపడింది. ఈ పేలుడు ఒక i20 కారులో జరిగినట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో 9 మంది మరణించగా, 20 మంది గాయపడ్డారు. ఈ ప్రాంతం చంద్నీ చౌక్ వాణిజ్య కేంద్రం సమీపంలో ఉండటంతో, ప్రభావం మరింత తీవ్రంగా మారింది.
అయితే పేలుడు ANFO వంటి పేలుడు పదార్థాలతో జరిగినట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు ఢిల్లీ పోలీసులు చేయగా అనుమానితుడిగా ఉమర్ మహ్మద్ పేరు తెలిసింది. ప్రస్తుతం అతని కుటుంబ సభ్యులను అరెస్ట్ చేశారు.
ఈ ఘటన తర్వాత ఢిల్లీ-ఎన్‌సిఆర్ ప్రాంతంలో హై అలర్ట్ ప్రకటించారు. మెట్రో స్టేషన్లు, మార్కెట్లు, ప్రధాన కేంద్రాల్లో భద్రతా చర్యలు పెంచారు. ప్రభుత్వం బాధితులకు చికిత్స, పరిహారం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. రాష్ట్రపతి భవన్ నుంచి కేవలం 8 కిలోమీటర్ల దూరంలో జరిగిన ఈ పేలుడు ఢిల్లీ భద్రతా వ్యవస్థపై ప్రశ్నలు వ్యక్తం చేశారు.
Also Read: జూబ్లీహిల్స్ పోలింగ్ 20 శాతం నమోదు.. నాన్ లోకల్స్ పై కేసులు..
అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భూటాన్‌లో రెండు రోజుల అధికారిక పర్యటనలో ఉన్న మోదీ, నవంబర్ 11న థింపూలో జరిగిన గెలెఫు మైండ్‌ఫుల్‌నెస్ సిటీ ప్రారంభోత్సవంలో మాట్లాడుతూ, “ఈ రోజు నేను చాలా బరువెక్కిన హృదయంతో ఇక్కడ ఉన్నాను. నిన్న సాయంత్రం ఢిల్లీలో జరిగిన దారుణ సంఘటన అందరినీ తీవ్రంగా బాధపెట్టింది. బాధిత కుటుంబాల బాధను నేను అర్థం చేసుకున్నాను. ఈ రోజు దేశం మొత్తం వారితో నిలుస్తుంది” అని అన్నారు. పేలుడు తర్వాత రాత్రంతా పరిస్థితిని పర్యవేక్షించానని, హోం మంత్రి అమిత్ షాతో మాట్లాడానని చెప్పారు. “దీని వెనుక ఉన్న కుట్రదారులను వదిలిపెట్టబోము. బాధ్యులందరినీ న్యాయం జరుగుతుంది” అని హామీ ఇచ్చారు.
ఢిల్లీ పేలుడు ఘటన నిందితులను వదిలిపెట్టే ప్రసక్తే లేదు: మోదీ
దేశంలో పలు దర్యాప్తు సంస్థలు ఈ ఘటనపై సమీక్ష చేస్తున్నాయి
దాడి వెనుక కారణాలను అధికారులు త్వరలో వెల్లడించనున్నారు
ఢిల్లీ పేలుడు ఘటనలో మృతులకు నా ప్రగాఢ సంతాపం
– ప్రధాని నరేంద్ర మోదీ pic.twitter.com/uTL7Rhqpbj
— BIG TV Breaking News (@bigtvtelugu) November 11, 2025