చైనీస్ స్మార్ట్ ఫోన్ దిగ్గజం వన్ ప్లస్ తన తదుపరి ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ OnePlus 15 విడుదలకు ముహూర్తం ఖరారు అయ్యింది. నవంబర్ 13న దేశీ మార్కెట్లో ఆవిష్కరించడానికి రెడీ అవుతోంది. ఇప్పటికే ఈ స్మార్ట్ ఫోన్ కు సంబంధించిన పలు వివరాలు లీక్ అయ్యాయి. ఇంతకీ ఈ స్మార్ట్ ధర ఎంత ఉంటుంది? స్పెషల్ స్పెసిఫికేషన్లు ఏంటి? అనే వివరాలను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
OnePlus 15 సరికొత్త స్పెసిఫికేషన్లు, ఫీచర్లతో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. భారత్ లో క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్ తో రన్ అయ్యే మొట్టమొదటి స్మార్ట్ ఫోన్‌గా OnePlus 15 గుర్తింపు తెచ్చుకోనుంది. కంపెనీ ఇప్పటికే పలు టెక్నికల్ ఫీచర్లను కన్ఫార్మ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ 7,300mAh బ్యాటరీతో రాబోతున్నట్లు పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇప్పటి వరకు OnePlus స్మార్ట్ ఫోన్లలో ఇంత పెద్ద బ్యాటరీ ఎందులోనూ లేకపోవడం విశేషం.
OnePlus 15 స్మార్ట్ ఫోన్ పలు వేరియంట్లలో అందుబాటులోకి రానుంది. 12GB RAM , 256GB స్టోరేజ్ బేస్ వేరియంట్ ధర రూ.72,999గా ఉంటుందని అంచనా. అటు 16GB RAM, 512GB స్టోరేజ్ తో కూడిన హైఎండ్ మోడల్ ధర రూ.76,999గా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ కొనుగోలుదారులు ప్రమోషనల్ బండిల్ లో భాగంగా దాదాపు రూ.2,699 విలువైన OnePlus Nord ఇయర్ బడ్ లను పొందే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ధర గురించి OnePlus ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన చేయనప్పటికీ, పలు టెక్ నివేదికలు లాంచ్ ధర రూ. 75,000 కంటే తక్కువగా ఉంటుందని వెల్లడిస్తున్నాయి. వన్ ప్లస్ గత ఫ్లాగ్ షిప్, OnePlus 13 రూ. 69,999కు ప్రారంభించింది. ఆ తర్వాత రూ. 63,999కి తగ్గించింది.
Read Also: రాసి పెట్టుకోండి.. ఆ రోజు భూమి మొత్తం చీకటైపోతుంది, ఇంకెతో టైమ్ లేదు!
OnePlus 15 ఇండియా లాంచ్ ఈవెంట్ నవంబర్ 13న సాయంత్రం 7 గంటలకు జరుగుతుంది. కంపెనీ అధికారిక ఛానెల్స్ లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. పూర్తి విడుదలకు ముందు OnePlus ఒక గంట పాటు ప్రత్యేక ముందస్తు యాక్సెస్ సేల్ ను ప్లాన్ చేస్తోంది. వన్ ప్లస్ అభిమానులు అధికారికంగా అమ్మకానికి రాకముందే ఫోన్ ను కొనుగోలు చేసే అవకాశం కల్పిస్తోంది. ఇక ఈ స్మార్ట్ ఫోన్ అమెజాన్ ఇండియా, OnePlus ఆన్ లైన్ స్టోర్, దేశ వ్యాప్తంగా ఉన్న రిటైల్ అవుట్ లెట్ల లోనూ అందుబాటులో ఉంటుందని వన్ ప్లస్ వెల్లడించింది.
Read Also: ఇక ఆండ్రాయిడ్ ఫోన్లలోనూ కామెట్ బ్రౌజర్.. గూగుల్‌కు చెమటలు పట్టిస్తోన్న పర్ ప్లెక్సిటీ!