Social Media Hackers| సోషల్ మీడియా మన జీవితంలో పెద్ద భాగంగా మారిపోయింది. అందరూ ఫోటోలు, వీడియోలు రోజువారీ క్షణాలు ఆన్‌లైన్‌లో షేర్ చేస్తున్నారు. అయితే ఈ అలవాటు వ్యసనంగా మారిపోయింది. చాలా మంది గంటల తరబడి ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్ లో సమయం గడుపుతున్నారు. ఈ అలవాటు చాలా ప్రమాదకరం. ఎందుకంటే ఇలా ఎక్కువ సమయం సోషల్ మీడియాల గడిపేవారిని సైబర్ దొంగలు టార్గెట్ చేస్తున్నారు. యూజర్లు చేసే పోస్టుల నుంచి వ్యక్తిగత సైబర్ దొంగలు సమాచారం దొంగిలిస్తున్నారు. తర్వాత మీ గుర్తింపుతోనే ఈజీగా మోసాలు చేస్తారు.
ఈ ప్రమాదం నుంచి బయటపడాలంటే మీరు తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
ముందు మీ అకౌంట్ ప్రైవెసీ సెట్టింగ్స్ చెక్ చేయండి. ప్రొఫైల్‌ను పబ్లిక్ నుంచి ప్రైవేట్‌కు మార్చండి. ఇలా చేస్తే మీ పోస్టులు ఎవరు చూడగలరో మీ కంట్రోల లో ఉంటుంది. ఫేస్‌బుక్ ప్రైవసీ చెకప్ వంటి టూల్స్ ఉపయోగించండి. ఏ యాప్స్ మీ డేటా తీసుకుంటున్నాయో మీరు చూడగలరు. ఫేస్‌బుక్ బయటి ట్రాకింగ్‌ను వెంటనే ఆపేయండి. ఇది మీ భద్రతను పెంచుతుంది.
ఒకే పాస్‌వర్డ్‌ను అంతటా ఉపయోగించకండి. ప్రతి అకౌంట్‌కు వేర్వేరు పాస్‌వర్డ్ పెట్టండి. అక్షరాలు, సంఖ్యలు, చిహ్నాలు కలిపి బలమైనవి చేయండి. పాస్‌వర్డ్ మేనేజర్ యాప్ ఉపయోగించి గుర్తుంచుకోండి. ఒక అకౌంట్ హ్యాక్ అయినా మిగతావి సురక్షితంగా ఉంటాయి.
మీ అకౌంట్‌కు మరో సెక్యూరిటీ లేయర్ ని యాడ్ చేయండి. సెక్యూరిటీ సెట్టింగ్స్‌లో టూ-స్టెప్ వెరిఫికేషన్ ఆన్ చేయండి. లాగిన్ అయ్యే ముందు కోడ్ అడుగుతుంది. పాస్‌వర్డ్ తెలిసినా హ్యాకర్లు లాగిన్ కాలేరు. యాప్ నుంచి రాండమ్ కోడ్ వచ్చే ఆథెంటికేటర్ యాప్ ఉపయోగించండి. ఇది బెస్ట్ సెక్యూరిటీ ఫీచర్.
చాలామంది ఒకటి కంటే ఎక్కువ అకౌంట్లు ఉపయోగిస్తుంటారు. కొంతమంది అలా చేస్తూ ఒక పాత అకౌంట్ ను నిరుపయోగం చేసి ఒకే అకౌంట్ లో చాట్ చేస్తుంటారు. అలాంటి పాత సోషల్ మీడియా అకౌంట్లను మర్చిపోకండి. హ్యాకర్లు ఇవి లక్ష్యంగా చేసుకుంటారు. వీటిని ‘జాంబీ అకౌంట్లు’గా మార్చి మోసాలు చేస్తారు. ముందు మీ డేటా బ్యాకప్ తీసుకోండి. తర్వాత పాత అకౌంట్లు డిసేబుల్ చేయండి. ఇది ఆన్‌లైన్ రిస్క్‌ను తగ్గిస్తుంది.
అన్నీ ఆన్‌లైన్‌లో షేర్ చేయాలనే తొందర తగ్గించండి. మీ భావాలు, రోజువారీ రొటీన్ పోస్ట్ చేయకండి. ప్రైవేట్ విషయాలు సురక్షిత మెసేజింగ్ యాప్స్‌లో షేర్ చేయండి. సిగ్నల్ వంటి యాప్స్‌లో మీకు నమ్మకమైన స్నేహితుల కోసమే ఉపయోగించండి. మీ ప్రైవేసీ చాలా ముఖ్యం.
లింకులు, మెసేజ్‌లతో చాలా జాగ్రత్త. అపరిచితుల నుంచి వచ్చిన లింక్‌లు క్లిక్ చేయకండి. హ్యాకర్లు ఫేక్ లింకులు పంపి డేటా దొంగిలిస్తారు. సెండర్‌ను వెరిఫై చేయండి. వ్యక్తిగత, ఫైనాన్షియల్ డేటా ఏ ఒక్కరికీ ఇవ్వకూడదు. అనుమాదాస్పదమైన మెసేజ్‌ను రిపోర్ట్ చేయండి.
మీ ఆన్‌లైన్ భద్రత మీ చేతుల్లో ఉంది. ఈ సింపుల్ స్టెప్స్‌ను ఎల్లప్పుడూ పాటించండి. డిజిటల్ జీవితాన్ని నేరస్తుల నుంచి కాపాడండి. జాగ్రత్తలు పాటిస్తూ.. సోషల్ మీడియాను ఆనందించండి. సురక్షితంగా ఉండండి!
Also Read: ఏఐ బ్రౌజర్లు ప్రమాదకరం.. బ్యాంక్ అకౌంట్లు ఖాళీనే.. హెచ్చరిస్తున్న నిపుణులు