BigTV English
Advertisement

Jagan latest comments: జగన్‌ హాట్ కామెంట్స్, ఎంతకాలం ఆపగలం, వెనక్కి తగ్గొద్దు..

Jagan latest comments: జగన్‌ హాట్ కామెంట్స్, ఎంతకాలం ఆపగలం, వెనక్కి తగ్గొద్దు..

YS Jagan latest comments(AP political news): వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌కు తత్వం బోధపడలేదు. ఎప్పుడు మాదిరి గానే పాడిందే పాటగా అవే మాటలు చెబుతున్నారు. తమ ప్రభుత్వంలో ఎక్కడ తప్పు జరిగిందనే దానిపై ఆయన కనీసం దృష్టి పెట్టినట్టు కనిపించలేదు. ప్రస్తుతం పార్టీని విడిచి వెళ్లే నేతలపై హాట్ కామెంట్స్ చేశారు అధినేత జగన్. వెళ్లేవారిని ఎంతకాలం ఆపగలమని మనసులోని మాట బయటపెట్టారు.


బెంగుళూరు నుంచి తాడేపల్లి వచ్చిన వైసీపీ అధినేత జగన్‌ను వివిధ జిల్లాల నేతలు వచ్చి కలుస్తున్నారు. బుధవారం విశాఖ, తిరుపతి, నంద్యాల జిల్లాలకు చెందిన పార్టీ నేతలతో జగన్ సమావేశమయ్యారు. దాదాపు గంటకు పైగానే నేతలతో మాట్లాడారు వైసీపీ అధినేత. ఇప్పటికే చాలామంది నేతలు జనసేన, బీజేపీ వైపు చూస్తున్నారు. కీలక నేతలు తమకున్న పరిచయాలతో టీడీపీ వైపు దృష్టిపెట్టారు. త్వరలోనే కొందరు నేతలు వెళ్లిపోతారన్న విషయం తెలుసుకున్న జగన్, వేదాంత ధోరణిలో మాట్లాడారు.

పార్టీ విడిచి వెళ్లిపోవాలని అనుకునేవారికి ఎంతకాలం ఆపగలమన్నారు జగన్. అది వారి ఇష్టమని, విలువ లు, విశ్వసనీయ ఉండాలన్నారు. వెళ్లేవారు వెళ్తారని, ఆటుపోట్లు తట్టుకుని నిలబడేవారు తనతో ఉంటా రని ఖరాఖండిగా చెప్పేశారట. పార్టీ మొదలు పెట్టినప్పుడు తాను, అమ్మ మాత్రమే ఉన్నామని గుర్తు చేశారు. ఇప్పుడు మళ్లీ మొదటి నుంచి మొదలుపెడతామని, ఎలాంటి ఇబ్బంది లేదని వ్యాఖ్యానించినట్టు తెలిసింది.


నియోజకవర్గాల పరిస్థితులపై కొందరు నేతలు వివరించగా, ఈ విషయంలో నేతలు ఏమాత్రం తగ్గవద్దని, ధైర్యంగా ముందుకు అడుగు వేయాలని నేతలకు సూచన చేశారు అధినేత. చాలామంది నేతలు సైలెంట్ గా ఉండడంతో అన్న మీరు మాట్లాడాలని వైసీపీ అధినేత జగన్ అనడంతో పలువురు నేతలు నోరువిప్పారట.

ఇదే క్రమంలో బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలు తమ పార్టీపై ప్రభావం చూపాయని చెప్పారట విశాఖకు చెందిన నేతలు. విభజనపై ఏపీ ప్రజలు ఇప్పటికీ ఆగ్రహంతో ఉన్నారని, ఈ సమయంలో వైసీపీ గెలుస్తుందని పదేపదే బీఆర్ఎస్ నేతలు చెప్పడం ఫలితాలపై ప్రభావం చూపిందని అన్నారు. ఆ మాటలు విన్న జగన్, లైట్‌గా స్మైల్ ఇచ్చి సైలెంట్ అయ్యారట.

ALSO READ:  ఏపీపీఎస్సీ ఛైర్మన్ పదవికి గౌతమ్ సవాంగ్ రాజీనామా, ఆయన స్థానంలో..

అధినేతతో సమావేశం తర్వాత కొందరు వైసీపీ నేతలు నోరువిప్పారు. పథకాలు పేరిట ప్రజలకు డబ్బులు ఇచ్చామని, అయినా ఓట్లు పడలేదన్న మాట తప్పితే మరో మాట అధినేత నోటి నుంచి కొత్త మాటలు  రావడం లేదన్నది వైసీపీ నేత మాట. ఈ పరిస్థితులే ఆయన్ని మార్చాలని, ఈ విషయంలో మనమేమీ చేయలేమని నేతలు చెప్పుకోవడం గమనార్హం.

Tags

Related News

TTD Chairman BR Naidu: మూడు గంటల్లోనే శ్రీవారి దర్శనం కల్పిస్తున్నాం: బీఆర్ నాయుడు

Vallabhaneni Vamsi: రాజకీయాల్లోకి రీ ఎంట్రీ.. జగన్‌ పర్యటనలో వల్లభనేని

Pawan Kalyan: పంట నష్టం అంచనాలను వేగంగా పూర్తి చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలు

Kolikapudi Srinivasa Rao: కొలికపూడికి చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్

Nara Lokesh: ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం.. సింగపూర్‌కు ప్రభుత్వ ఉపాధ్యాయులు!

Gollapalli Surya Rao: మాజీ మంత్రి, వైసీపీ నేత సూర్యారావుకు గుండెపోటు

Botsa Satyanarayana: వైసీపీ వాళ్లను ఎలా ఇరికించాలి అని మాత్రమే ప్రభుత్వం ఆలోచిస్తోంది.. బొత్స విమర్శలు

Amaravati News: స్పీకర్ అయ్యన్న క్లారిటీ.. తేల్చుకోవాల్సింది ఎమ్మెల్యేలు, వైసీపీలో ముసలం ఖాయం?

Big Stories

×