BigTV English

Anitha Comments on Jagan: ‘ఈవీఎం పగులగొట్టి జైలుకెళ్లిన పిన్నెల్లి కోసం జగన్ రూ. 25 లక్షలు ఖర్చు చేశారు’

Anitha Comments on Jagan: ‘ఈవీఎం పగులగొట్టి జైలుకెళ్లిన పిన్నెల్లి కోసం జగన్ రూ. 25 లక్షలు ఖర్చు చేశారు’

AP Home Minister Anitha Comments on Jagan met Pinnelli: ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై హోంమంత్రి అనిత తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు. జైలులో ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించడాన్ని ఖండించారు.


గురవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘ఈవీఎంను పగులగొట్టి జైలుకెళ్లిన పిన్నెల్లిని పరామర్శించడానికి జగన్ రూ. 25 లక్షలు ఖర్చు చేశారు. పిన్నెల్లిని కలిసేందుకు ఆయన ఏకంగా హెలికాప్టర్ లో నెల్లూరు జైలుకు వెళ్లారు. జైలులో పిన్నెల్లిని కలిసేందుకు ఉన్న ములాఖత్ లు అయిపోయాయి. అయినా మేం మానవతా దృక్పథంతో జగన్ కు అనుమతి ఇచ్చాం. అనుమతి ఇచ్చే పరిస్థితి లేదని జగన్ కూడా తెలుసు. అయినా కూడా ఆయన ఘర్షణ వాతావరణం సృష్టించడానికే ఈ ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది.

జైలు నుంచి బయటకు వచ్చాక ఆయన ఏదేదో మాట్లాడి వెళ్లిపోయారు. ములాఖత్ లపై జైళ్ల శాఖ ఐజీ నుంచి నివేదిక తెప్పించుకుని పరిశీలిస్తాం. గత ప్రభుత్వం నాపై అక్రమ కేసులు పెట్టింది. వాటిపై విచారణ చేపడుతాం. న్యాయపరంగా చర్చించి తదుపరి నిర్ణయం తీసుకుంటాం’ అంటూ అనిత పేర్కొన్నారు.


అదేవిధంగా రాష్ట రవాణాశాఖ మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి కూడా జగన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ మరోసారి జైలుకు పోయే సమయం ఆసన్నమైందన్నారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నెల్లూరులో జగన్ చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు.

also Read: 2 నెలల్లోగా వివరణ ఇవ్వండి : వైసీపీకి ఏపీ హైకోర్టు ఆదేశాలు

‘ఐదేళ్లలో జగన్ చేసిన పాపాలే అతడిని వెంటాడుతున్నాయన్నారు. అధికారం చేపట్టిన 21 రోజుల్లోనే చంద్రబాబు ఏం చేయలేదంటూ జగన్ అంటుంటే విచిత్రంగా అనిపిస్తుందన్నారు. కూటమి పాలనను ప్రశ్నిస్తున్న జగన్.. వైసీపీ హయాంలో చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలన్నారు. రాష్ట్రంలో వాలంటీర్లతో వైసీపీ నేతలు ఊడిగం చేయించుకున్నారన్నారు. ఐదేళ్లలో వైసీపీ నేతలు చేసిన అవినీతిని ఖచ్చితంగా వెలికితీస్తామన్నారు. వైసీపీ నేతలపై కక్ష సాధించే ఆలోచన టీడీపీకి లేదన్నారు. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి చరిత్ర అందరికీ తెలుసున్నారు. ఐదేళ్లలో మాచర్లలో పిన్నెల్లి నరమేధం సృష్టించారు’ అంటూ రామ్ ప్రసాద్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు.

Tags

Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×