BigTV English

Team India Victory Rally: టీమిండియా ప్లేయర్ల రోడ్ షో.. కిక్కిరిసిపోయిన ముంబై రహదారులు

Team India Victory Rally: టీమిండియా ప్లేయర్ల రోడ్ షో.. కిక్కిరిసిపోయిన ముంబై రహదారులు

Fans came in Large Numbers for Huge Victory Rally: 17 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ టీ20 వరల్డ్ కప్ -2024 సాధించి విజయ పతాకాన్ని ఎగురవేసిన టీమిండియా గురువారం స్వదేశానికి చేరుకుంది. ఉదయం ఢిల్లీలోని ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ఆయనతో కలిసి అల్పాహారం తీసుకున్నారు. ఆ తరువాత ముంబైకి బయలుదేరారు. ముంబైలోని మెరైన్ రోడ్డులో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు.


ప్రపంచ కప్ గెలిచిన టీమిండియా ఆటగాళ్లు ఓపెన్ టాప్ బస్ లో నిల్చుని రోడ్ షోలో పాల్గొన్నారు. రెండు గంటలపాటు సాగిన ఈ ఊరేగింపు నారీమన్ పాయింట్ నుంచి వాంఖడే స్టేడియం వరకు కొనసాగింది. టీమిండియా ఆటగాళ్లు వరల్డ్ కప్ ట్రోఫీని పట్టుకుని అభిమానులకు అభివాదం చేస్తూ మందుకుసాగారు. ఓపెన్ టాప్ బస్సులోంచి భారత ఆటగాళ్లు అభిమానులను ఉత్సాహపరిచారు. దీంతో తమ అభిమాన క్రికెటర్లను తమ ఫోన్లలో వీడియోలు, ఫొటోలు తీసుకునేందుకు పోటీ పడ్డారు.

విశ్వవిజేతలకు ఘన స్వాగతం పలికేందుకు క్రికెట్ అభిమానులు, ప్రజలు భారీగా ముంబైకి తరలివచ్చారు. మెరైన్ రోడ్డుకు మధ్యాహ్నం నుంచే ఫ్యాన్స్ భారీ సంఖ్యలో చేరుకున్నారు. దీంతో ఆ రోడ్డు మొత్తం అభిమానులతో నిండిపోయింది. వాళ్లంతా మువ్వన్నెల జెండాలను ప్రదర్శిస్తూ తెగ సందడి చేశారు. రాత్రి వాంఖడే స్టేడియంలో బీసీసీఐ ఆధ్వర్యంలో భారత జట్టుకు సన్మాన కార్యక్రమం నిర్వహించి రూ. 125 కోట్ల నగదు బహుమతిని అందజేశారు. అయితే, షెడ్యూల్ ప్రకారం సాయంత్రం ఐదు గంటలకే రోడ్ షో ప్రారంభం కావాల్సి ఉండగా.. భారత ఆటగాళ్లు ఢిల్లీ నుంచి ముంబైకి ఆలస్యంగా చేరుకున్నారు. దీంతో రోడ్ షో ఆలస్యంగా ప్రారంభమయ్యింది.


Also Read: నాడు విమర్శలు.. నేడు జేజేలు

అదేవిధంగా వాంఖడే స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమానికి కూడా అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఉచిత ప్రవేశం కల్పించడంతో స్టేడియంలో అన్ని స్టాండ్స్ కూడా అభిమానులతో కిటకిటలాడాయి. టీమిండియా క్రికెటర్లు బీసీసీఐ ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో బార్బడోస్ నుంచి ఢిల్లీకి వచ్చారు. అక్కడి నుంచి ముంబైకి వచ్చిన విషయం తెలిసిందే. కాగా, టీమిండియా ప్లేయర్స్ ను స్వదేశానికి తీసుకువచ్చిన ఈ ప్రత్యేక విమానానికి ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రమంలో ఎయిర్ పోర్టు సిబ్బంది స్పెషల్ వాటర్ సెల్యూట్ చేశారు.

Tags

Related News

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Virat – Anushka : విరాట్ కోహ్లీ దంపతులు పాములు వండుకొని తిన్నారా.. బీఫ్ కూడా?

Brick Lesnar : బ్రాక్ లెస్నర్ కూతురా మజాకా.. ఏకంగా నాలుగు మెడల్స్ సాధించిందిగా..?

Virat Kohli: తెల్ల గడ్డంతో విరాట్ కోహ్లీ…నెల రోజులకే ముసలోడు అయ్యాడా !

Zim vs NZ 2nd Test : జింబాబ్వే కు చుక్కలు చూపిస్తున్న న్యూజిలాండ్.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే

Big Stories

×