BigTV English

Interview Video: ఇంటర్వ్యూలో లిప్ సింక్‌.. వెనుక నుంచి వేరే వాళ్ల వాయిస్.. అసలు ఏం జరిగింది అక్కడ

Interview Video: ఇంటర్వ్యూలో లిప్ సింక్‌.. వెనుక నుంచి వేరే వాళ్ల వాయిస్.. అసలు ఏం జరిగింది అక్కడ

Interview Video: అభ్యర్థికి బదులుగా ఇతరులు పరీక్ష రాయడం వంటివి చాలా ఘటనలు జరుగుతుంటాయి. ఇలా చేసి కొంతమంది దొరికిపోతుంటారు. మరి కొంతమంది మాత్రం చాకచక్యంగా వ్యవహరించి మరి పరీక్షలు రాసి వచ్చేస్తుంటారు. అయితే ఇది పరీక్షలు రాయడంలో మాత్రమే సాధ్యం అవుతుంది. కానీ ఓ వ్యక్తి ఇలాంటి పద్ధతినే ఇంటర్వ్యూలో ట్రై చేశాడు. అది కూడా ఆన్‌లైన్ ఇంటర్వ్యూలో. ప్రశ్నలకు అభ్యర్థి బదులు వేరొకరిని సమాధానాలు ఇచ్చిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆన్‌లైన్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వాలనే ఉద్ధేశ్యంతో ఓ వ్యక్తి తన స్నేహితుడి సలహాను తీసుకున్నాడు. ఈ తరుణంలో వారు ఇద్దరు చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.


ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వడానికి చాలా మంది ఒకరితో ఒకరు పోటీపడతారు. వాటిలో కొన్ని విజయవంతమవుతే మరికొన్ని ఫెయిల్ అవుతుంటాయి. వెలుగులోకి వచ్చిన ఈ వీడియోలో ఇంటర్వ్యూ ఇవ్వడానికి సిద్ధమవుతున్న వ్యక్తి.. సిస్టమ్ ముందు హెడ్ సెట్ పెట్టుకుని కూర్చున్నాడు. ఇంటర్వ్యూ చేసే వ్యక్తి ప్రశ్న అడగగానే వెనుక నుంచి ఎవరో సమాధానం చెప్పడం ప్రారంభించారు. అభ్యర్థి పెదవి సింక్ చేస్తూ నటించాడు. ఈ తరుణంలో ఇంటర్వ్యూయర్‌కు అనుమానం వచ్చింది. దీంతో అభ్యర్థిని మధ్యలోనే ఆపేశాడు. ‘ఈ సమాధానాలు మీరు చెప్పడం లేదు, ఎవరో ఇస్తున్నారు. మీరు కేవలం పెదవి సింక్ చేస్తున్నారు’ అని అన్నాడు.

ఈ విధంగా అభ్యర్థి తెలివితేటలు గమనించి, ఇంటర్వ్యూ చేసే వ్యక్తి కూడా అతని తీరు చూసి షాక్ అయ్యాడు. దీంతో దీనికి సంబంధించిన వీడియోను కూడా నెట్టింట పోస్ట్ చేయడంతో తెగ వైరల్ అవుతోంది.


Related News

Fight Viral Video: విద్యార్థుల ముష్టి యుద్ధం.. చొక్కాలు చినిగినా, వదల్లేదు.. వైరల్ వీడియో!

Jana Gana Mana: జాతీయ గీతాన్ని చిన్నారి ఎంత ముద్దుగా పాడిందో చూడండి.. వావ్ అనాల్సిందే..!

Burning pyre reel: స్మశానంలో కాలుతోన్న శవం పక్కన.. డ్యాన్స్ చేస్తూ రీల్స్ చేసిన అమ్మాయి, వీడియో వైరల్

Viral wedding: అందుకే ఒకే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాం.. వింత వివాహంపై స్పందించిన అన్నదమ్ములు

Viral News: కెమెరాకు చిక్కిన రాక్షసుడు.. కుక్కతో ఆ విధంగా, జంతు ప్రేమికులు ఆగ్రహం

Washing Machine Mistake: వాషింగ్ మెషిన్‌లో బట్టలు వేస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే..

Big Stories

×